2023 Tata Harrier: దేశీయ ఆటోమేకర్ దిగ్గజం టాటా తన హారియర్ ను మరింత గ్రాండ్ గా తీసుకురాబోతోంది. 2023 టాటా హారియర్ కోసం ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. అధునాతన అడాస్( అడ్వాన్సుడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) కొత్త హారియర్ లో టాటా తీసుకురాబోతోంది. న్యూ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి కొత్త ఫీచర్లతో రాబోతోంది. పాత హారియర్ ధర రూ. 15 లక్షలు (ఎక్స్ షోరూం) నుంచి రూ. 22.60 లక్షలు (ఎక్స్ షోరూం) ఉండగా.. కొత్త హారియర్ ధర రూ. 15.50 లక్షల నుంచి రూ. 24 లక్షల(ఎక్స్ షోరూం) వరకు ఉండవచ్చు.
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ యూకే పర్యటన.. కేంబ్రిడ్జ్‌లో ఉపన్యాసం..
టాటా హారియర్ 2023, ఎంజీ హెక్టార్ 2023, జీప్ కంపాస్ కు పోటీ ఇవ్వను8ంది. కొత్త హారియర్ ఓమెగా ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపుదిద్దుకుంటోంది. ఎస్ యూ వీ హెచ్ఐడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, 17-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, పనోరమిక్ సన్ రూఫ్ వంటి ఫీచర్లు హారియర్ లో ఉండనున్నాయి. ఇంటీరియర్ కూడా చాలా స్టైలిష్ గా రూపుదిద్దుకుంటోంది. డాష్ బోర్డ్ గతంలో పోలిస్తే మరింత ఆధునికంగా ఉండనుంది. 10.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండనుంది. వైర్ లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్ చేస్తుంది. ఐఆర్ఏ కనెక్ట్ కార్ టెక్నాలజీ ఇందులో ఉంది. ఇది సెక్యూరిటీ, వెహికిల్ డయాగ్నోసిస్, లొకేషన్ సర్వీస్, ఓవర్ ది ఎయిర్(ఓటీఏ) వంటి అనేక కనెక్టివిటీ ఫీచర్లను అందిస్తోంది. 7 ఇంచెస్ డిజిటల్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కొత్త హారియర్ లో ఉండనుంది.
ఇవే కాకుండా కొత్త 2023 హారియర్ లో ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ట్రాఫిక సైన్ రికగ్నిషన్, హై బీమ్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, లేన్ చేంజ్ అలర్ట్, డోర్ ఓపెన్ అలర్ట్, రియర్ క్రాస్ వంటి అడాస్ ఫీచర్లు ఉన్నాయి. 360 డిగ్రీ కెమెరా ఇందులో ఉండనుంది. టాటా మోటార్స్ రాబోయే ఆర్డీఈ నిబంధనలకు అనుగుణంగా కొత్త హారియర్ ఇంజిన్ ను అప్ గ్రేడ్ చేసింది. 2.0-లీటర్ క్రయోటెక్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 170PS పవర్ మరియు 350Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్లలో వస్తోంది.