Tax Survey on BBC:భారతదేశంలోని బీబీసీ కార్యాలయాలపై ఐటీ శాఖ టాక్స్ సర్వే చేపడుతోంది. ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తోంది ఐటీ శాఖ. ఐటీ పన్నుల ఎగవేత కేసులో ఐటీ శాఖ బీబీసీ కార్యాలయాల్లో రైడ్స్ చేస్తోంది. గతంలో నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా బీబీసీ ధిక్కరించిందని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ ఐటీ రైడ్స్ పై ఓ పాకిస్తాన్ జర్నలిస్ట్, అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైడ్ ని ప్రశ్నించారు.
Read Also: Nitish Kumar: నాకు ప్రధాని కావాలనే కోరిక లేదు..
దీనికి సమాధానంగా నెడ్ ప్రైడ్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా స్వేచ్ఛా పాత్రికేయం ప్రాముఖ్యతకు అమెరికా మద్దతు ఇస్తుందని ఆయన అన్నారు. ఢిల్లీలోని బీబీసీ ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నాయని మాకు తెలుసని అన్నారు. భావప్రకటన స్వేచ్ఛా, మత స్వేచ్ఛ, మానవ హక్కులు ప్రజాస్వామ్య దేశాలు బలోపేతం చేయడానికి దోహద పడుతాయని నెడ్ ప్రైడ్ అన్నారు. అమెరికా దీనిపై తీర్పు ఇచ్చే స్థితిలో లేదని తాను గతంలో చేసిన ప్రకటనను మరోసారి పునరుద్ఘాటించారు నెడ్ ప్రైడ్.
2002 గుజరాత్ అల్లర్లపై బీబీసీ ‘ ఇండియా: ది మోదీ క్వశ్చన్’పేరుతో ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ హాయాంలోని ప్రభుత్వం ఈ అల్లర్లకు మద్దతు ఇచ్చిందని ఆరోపించింది. కాగా, ఈ డాక్యుమెంటరీని ప్రసారం చేసినందకే మోదీ ప్రభుత్వం బీబీసీపై దాడులు చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ దాడులపై ఐటీ శాఖకు సహకరించాలని బీబీసీ తన ఉద్యోగులకు సూచించింది.