George Soros On PM Modi: భారత వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ వ్యవహారంలో బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందిస్తోంది. అదానీ స్టాక్ మార్కెట్ లో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ‘ భారత్ తో ప్రజాస్వామ్య పునరుజ్జీవనం’ వస్తుందని..ప్రధాని నరేంద్రమోదీ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తోంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. భారత ప్రజాస్వామ్య ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించే విదేశీ శక్తులను భారత ప్రజలు ఐక్యంగా తిప్పికొట్టాలని ఆమె అన్నారు. గతంలో భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించిన విదేశీ శక్తులను భారతీయులు ఓడించారని ఆమె తెలిపారు. జార్జ్ సోరోస్ కు భారతీయులు తగిన సమాధానం ఇవ్వాలని ప్రతీ భారతీయుడిని నేను కోరుకుంటున్నా అని అన్నారు.
Read Also: Nude Video Call: అబ్బాయిలు అలర్ట్.. న్యూడ్ కాల్ చేసి లక్షలు కాజేస్తున్న కిర్రాక్ లేడీలు
దీనిపై కాంగ్రెస్ కూడా స్పందించింది. అదానీ స్కామ్ భారతదేశ ప్రజాస్వామ్య పునరుద్దరణకు దారితీస్తుందా అనేది పూర్తిగా కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు, మా ఎన్నికల ప్రక్రియపై ఆధారపడి ఉంటుందని.. దీనికి సోరోస్ వంటి వ్యక్తులతో సంబంధం లేదని, సోరోస్ వంటి వ్యక్తులు మన ఎన్నికల ఫలితాలను నిర్ణయించలేరని మా నెహ్రూ వారసత్వం సూచిస్తోందని ట్వీట్ చేశారు. స్మృతి ఇరానీ, జార్జ్ సోరోస్ ను ఆర్థిక యుద్ధ నేరస్థుడు అంటూ తీవ్రంగా విమర్శించారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ను మోసం చేసి, ఆ దేశంతో ఆర్థిక యుద్ధ నేరస్థుడిగా పేర్కొనబడిన వ్యక్తి, ఇప్పుడు భారత ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయాలనే కోరికతో ఉన్నారని, భారతదేశ ప్రజాస్వామ్య ప్రక్రియలో జోక్యం చేసుకోవాలని తన దురుద్దేశాన్ని ప్రకటించారని కేంద్రమంత్రి విమర్శించారు. ఇలాంటి వ్యక్తులు తమకు నచ్చిన వ్యక్తులు అధికారంలో ఉండేలా.. ఆయా దేశాల్లోని ప్రభుత్వాలను పడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి శక్తులకు మోదీ తలవంచరని ఆమె స్పష్టం చేశారు.
ప్రధాని టార్గెట్ గా సోరోస్ వ్యాఖ్యలు..
92 ఏళ్ల జార్జ్ సోరోస్ గురువారం 2023 మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో ప్రసంగిస్తూ, అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ తర్వాత భారీ స్టాక్ మార్కెట్ పతనాన్ని ఎదుర్కొన్న గౌతమ్ అదానీ వ్యాపార సమస్యలతో ప్రధాని మోదీ బలహీనపడతారని అంచనా వేశారు. ప్రధాని మోదీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని, కానీ ఆయన నిశ్శబ్ధంగా ఉన్నారని అన్నారు. మోదీ, అదానీ మిత్రులని ఆరోపించారు. మోదీ ప్రజాస్వామ్యవాది కాదని.. ముస్లింలపై హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. భారత్, రష్యా నుంచి చాలా తక్కువ ధరతో చమురు కొనుగోలు చేసి దానిపై చాలా డబ్బు సంపాదిస్తోందని విమర్శించాడు.