Supreme Court Closes Contempt Proceedings In Babri Masjid Demolition Case: బాబ్రీ మసీద్ కేసులో ధిక్కార పిటిషన్లపై కీలక తీర్పును వెల్లడించింది సుప్రీంకోర్టు. బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో దాఖలైన అన్ని కోర్టు ధిక్కరణ కేసులను ముగించింది సుప్రీం ధర్మాసనం. 1992లో అయోధ్యంలో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, బీజేపీ నాయకులపై నమోదు అయిన ధిక్కరణ పిటిషన్లను క్లోజ్ చేసింది. జస్టిస్ ఎస్కే కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం.. బాబ్రీ మసీదు కేసు ప్రస్తుతం మనుగడలో లేదని నవంబర్…
Bengaluru Idgah Maidan Case- Supreme Court: బెంగళూరులోని ఈద్గా మైదాన్‌లో గణేష్ చతుర్థి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడం వివాదానికి దారి తీసింది. కర్ణాటక వక్ఫ్ బోర్డు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. దీంతో ఈ కేసులు ప్రస్తుతం సుప్రీం కోర్టుకు చేరింది. అంతకుముందు రోజు ఈ కేసులు విచారించిన ఇద్దరు సభ్యుల ధర్మాసనంలో న్యాయమూర్తులు పరస్పరం విభేదించారు. దీంతో సుప్రీంకోర్టు ప్రస్తుతం ముగ్గురు సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. బుధవారం వినాయక చతుర్థి పండగ ప్రారంభం అవుతుండటంతో మంగళవారం సాయంత్రంలోపే ఈ వివాదానికి…
National Crime Records Bureau (NCRB) report On Woman Molestation: నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దేశంలో వివిధ నేరాలపై నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కేసుల వివరాలు, క్రైమ్ రేట్ మొదలైన వివరాలను నివేదిక బహిర్గతపరిచింది. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం దేశంలో అత్యధికంగా అత్యాచారా కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రాలే ఉన్నాయి. ఏడాది కాలంలో అత్యధికంగా రాజస్థాన్ రాష్ట్రంలో అత్యాచార కేసులు నమోదు అయ్యాయి. రాజస్థాన్ తరువాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్రలు ఉన్నాయి.
India flood aid to Pakistan: పాకిస్తాన్ గత మూడు దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా భారీ వరదలతో అల్లాడుతోంది. ఏకంగా పాకిస్తాన్ లోని సింధ్, బలూచిస్థాన్ ప్రావిన్స్ వరదలతో అతలాకుతలం అవుతోంది. 100కు పైగా జిల్లాలు వరద బారినపడ్డాయి. ఇప్పటి వరకు 1000కి పైగా మరణాలు సంభవించగా.. 3 కోట్ల మంది వరదల వల్ల ప్రభావితం అయ్యారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ దేశాన్ని భారీ వరదలు, వర్షాలు తీవ్రంగా నష్టపరిచాయి. 6 లక్షలకు పైగా ఇళ్లు వరదల్లో ప్రభావితం అయ్యాయి.…
Madras High Court on Kallakurichi student death: తమిళనాడు రాష్ట్రంలో పాటు యావత్ దేశంలో చర్చనీయాంశంగా మారిన కళ్లకురిచి కేసులో మద్రాస్ హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును తప్పుదారి పట్టించడాన్ని మద్రాస్ హైకోర్ట్ తోసిపుచ్చింది. 17 ఏళ్ల విద్యార్థిని మరణం కేవలం ఆత్మహత్యేనని.. హత్య, అత్యాచారం కాదని స్పష్టం చేసింది. తమిళనాడు కళ్లకురిచిలో 17 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపింది. విద్యార్థులు పెద్ద నిరసనలు చేపట్టి ఆందోళనలు నిర్వహించారు. కాలేజీ యాజమాన్యం ఒత్తడితోనే విద్యార్థిని ఆత్మహత్య…
CBI searched Delhi Deputy CM's bank lockers: ఢిల్లీ మద్యం స్కామ్ లో సీబీఐ దూకుడు పెంచింది. ఏ1 నిందితుడిగా ఉన్న ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సంబంధించిన లాకర్లను మంగళవారం పరిశీలించారు సీబీఐ అధికారులు. దేశ రాజధాని ఢిల్లీ శివారుల్లోని ఘజియాబాద్ సెక్టార్ 4లో ఉన్న పీఎన్బీ బ్యాంచ్ లో ఐదుగురు సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే ఈ సోదాలపై మనీష్ సిసోడియా స్పందించారు. సీబీఐ అధికారుల దాడుల్లో ఏమీ దొరకలేదని ఆయన అన్నారు.
Goa CM Pramod Sawant on sonali phogat case.. CBI enquiry: బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగాట్(43) మృతిపై విచారిస్తున్నారు గోవా పోలీసులు. ముందుగా గుండెపోటుతో మరణించిందని అనుకున్నప్పటికీ.. శవపరీక్షలో శరీరంపై గాయాలు ఉండటంతో హత్య కేసుగా నమోదు చేశారు. సోనాలి మరణంలో ఆమె సన్నిహితులు సుధీర్ సాంగ్వన్, సుఖ్వీందర్ సింగ్ వాసిల ప్రమేయం ఉందని..సోనాలి ఫోగాట్ సోదరుడు రింకూ ఢాకా ఆరోపించిన నేపథ్యంలో వీరిద్దరిని గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పాటు సోనాలి పార్టీ చేసుకున్న రెస్టారెంట్ ఓనర్ తో…
shivsena's Thackeray Camp on bilkis bano case: బిల్కిస్ బానో అత్యాచార నిందుతులను విడుదల చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గుజరాత్ లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో పాటు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం శాఖ మంత్రిపై విమర్శలు చేస్తున్నాయి విపక్షాలు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ఈ విడుదల ద్వారా దేశ మహిళలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రధాని మోదీని ప్రశ్నించారు. ప్రధాని మోదీ చేతలకు, మాటలకు తేడా ఉంటుందని ఆరోపించారు.…
ఇదిలా ఉంటే శ్రీనగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ( ఎన్ఐటీ) విద్యార్థులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉండటంతో కొన్ని ఆదేశాలను జారీ చేసింది. విద్యార్థులు గ్రూపులగా మ్యాచ్ చూడద్దని.. సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేయవద్దని స్టూడెంట్స్ వెల్ఫెర్ డీన్ నోటీసులు జారీ చేశారు. ఎన్ఐటీ విద్యార్థులు మ్యాచ్ సమయంలో తమకు కేటాయించిన గదుల్లోనే ఉండాలని వర్సిటీ అధికారులు కోరారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో వారి వారి గదుల్లోనే విద్యార్థులు ఉండాలని..
The growing OTT market is expected to reach Rs.12,000 crore by 2023: ఇండియాలో ఓవర్ - ది- టాప్(ఓటీటీ) వ్యాపారం విస్తరిస్తోంది. ఎస్బీఐ రిసెర్చ్ ప్రకారం 2023 నాటికి ఓటీటీ మార్కెట్ రూ. 11,944 కోట్లకు చేరుతుందని అంచానా వేసింది. 2018లో రూ.2590 కోట్లుగా ఉన్న ఓటీటీ వ్యాపారం ఐదేళ్లలో అనూహ్యంగా పుంజుకుంది. 36 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటును నమోదు చేస్తోంది. ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ సమయాల్లో ప్రజలు ఎక్కువగా ఓటీటీలకు చేరువయ్యారు. 2000 ప్రారంభంలో…