Delhi High Court: భార్య నుంచి తీవ్రమైన వేధింపులు ఎదుర్కొంటున్న భర్త కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య వేధింపులతో భర్త విడాకులు కోరాడు. అతను అప్లై చేసుకున్న విడాకులను కోర్టు సమర్థించింది. ప్రతీ వ్యక్తి కూడా గౌరవంగా జీవించడానికి అర్హులని..నిరంతర వేధింపులతో ఎవరూ జీవించకూడదని పేర్కొంది. భార్యతో విడిపోవడాన్ని సమర్థించింది. ఈ కేసులో 2022 జూలైలో ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ భార్య ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేసుకుంది. తాజాగా ఈ కేసును విచారించిన కోర్టు భార్య అప్పీన్ ను కొట్టేసింది.
Read Also: RSS: భారత వ్యతిరేక శక్తులు “సుప్రీంకోర్టు”ను ఓ సాధనంగా ఉపయోగించుకుంటున్నాయి..
భర్త, భార్య చేతిలో క్రూరంగా వేధింపులకు గురయ్యాడని కోర్టు నిర్థారించింది. హిందూ వివాహ చట్టం సెక్షన్ 13(1)(ఐ-ఏ) ప్రకారం ఇది క్రూయాలిటీ కిందకు వస్తుందని కోర్టు పేర్కొంది. దీంతో భార్య , విడాకులకు వ్యతిరేకంగా దాఖలు చేసిన అప్పీల్ ను న్యాయమూర్తులు సంజీవ్ సచ్ దేవా, వికాస్ మహాజన్ తో కూడిన ధర్మాసనం కొట్టేసింది. భార్య ప్రవర్తన భర్తకు నిరంతరం మానసిక వేదన, బాధ, కోపం కలిగిస్తాయని ఇది క్రూరత్వంతోనే సమానం అని కోర్టు పేర్కొంది. ప్రతీ వ్యక్తి గౌరవంగా జీవించడానికి అర్హుడు. అయితే అతని గౌరవానికి భంగం కలిగించేలా భార్య ప్రవర్తిస్తోందని, ఇది స్పష్టంగా అవమానకరమైనదని.. ఖచ్చితంగా క్రూరత్వం కిందకు వస్తుందని బెంచ్ పేర్కొంది.
భార్య క్రూరత్వానికి సంబంధించి నిర్దిష్ట తేదీలు, సమయం లేదని మహిళ తరుపు న్యాయవాది వాదనను కోర్టు తిరస్కరించింది. గొడవ జరిగినప్పుడల్లా స్త్రీ తనకు, తన కుటుంబానికి వ్యతిరేకంగా అగౌర పరిచే పదాలను ఉపయోగిస్తోందని సదరు వ్యక్తి తన సాక్ష్యంలో పేర్కొనందున, ఈ వాదన దాని ప్రాముఖ్యతను కోల్పోతోందని హైకోర్టు పేర్కొంది.