BBC Documentary On Modi: భారత వ్యతిరేఖ శక్తులు సుప్రీంకోర్టును ఓ సాధనంగా వినియోగించుకుంటున్నాయని తన అనుబంధ పత్రిక పాంచజన్యలో పేర్కొంది. గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో బీబీసీ ప్రధాని నరేంద్రమోదీపై రూపొందించిన డాక్యుమెంటరీని కేంద్రం బ్లాక్ చేసింది. భారత్ కు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్న బీబీసీని బ్యాన్ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. అయితే దీన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. దీనిపై ఆర్ఎస్ఎస్ తాజాగా తన పత్రికలో వ్యాఖ్యలు చేసింది.
సుప్రీంకోర్టు ఈ పిటిషన్ కొట్టివేతపై పాంచజన్య సంపాదకీయంగా ప్రస్తావించింది. సుప్రీంకోర్టు దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికి సృష్టించబడిందని.. దీనిని భారత వ్యతిరేక శక్తులు ఓ ‘టూల్’గా ఉపయోగించుకుంటున్నాయని విమర్శించింది. పర్యావరణం పేరుతో దేశ ఎదుగుదలకు అడ్డంకులు సృష్టిస్తూ, మానవ హక్కుల పేరుతో ఉగ్రవాదులను రక్షించే ప్రయత్నం చేసిన తర్వాత, ఇప్పుడు భారత్‌ను వ్యతిరేకించే శక్తులకు భారత్‌లోనే వ్యతిరేకంగా ప్రచారం చేసే హక్కు ఉండాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొంది.
Read Also: 2023 Tata Harrier: టాటా హారియర్ 2023 బుకింగ్స్ ఓపెన్.. ధర, ఫీచర్స్ వివరాలివే..
పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో సుప్రీంకోర్టు నడుస్తోందని.. భారత చట్టాల ప్రకారం దేశ ప్రయోజనాల కోసం పని చేస్తుందని సంపాదకీయంలో తెలిపింది. భారత వ్యతిరేక శక్తులు మనకు వ్యతిరేకంగా మన ప్రజాస్వామ్యం, మన దాతృత్వం, మన నాగరికత ప్రమాణాలను ఉపయోగించుకుంటున్నాయని తెలిపింది.
2002 గోద్రా అనంతరం అల్లర్ల నేపథ్యంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ హయాంలోని ప్రభుత్వం పాత్ర ఉందని బీబీసీ డాక్యుమెంటరీ ‘‘ ఇండియా- దిమోదీ క్వశ్చన్’’లొ ఆరోపించింది. దీనిపై ఇటు ఇండియాలో అటు యూకేలో పెద్ద ఎత్తున రగడ ఏర్పడింది. భారత ప్రభుత్వం ఈ డాక్యుమెంటరీని ‘ వలసవాద మనస్తత్వం’గా ఆరోపించింది. డాక్యుమెంటరీని అడ్డుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన మరోొ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఏప్రిల్ లో విచారణ జరపనుంది.