Pakistan: టర్కీలో భారీ భూకంపం ఆ దేశాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఇప్పటికే అక్కడ మరణాల సంఖ్య 40 వేలను దాటింది. ఇదిలా ఉంటే ఇండియాతో పాటు ప్రపంచ దేశాలు టర్కీకి భూకంప సాయాన్ని అందిస్తున్నాయి. రెస్క్యూ నుంచి మెడిసిన్స్ వరకు అన్నింటిని సహాయంగా అందిస్తున్నాయి. అయతే టర్కీకి అత్యంత మిత్రదేశం పాకిస్తాన్ కూడా సాయం చేద్దాం అనుకుంది. అసలే పీకల్లోతు ఆర్థిక సమస్యల్లో ఉన్న పాకిస్తాన్ టర్కీకి సాయం చేసి మరోసారి పరువు తీసుకుంది.
పాత సాయానికే కొత్త ప్యాకింగ్ చేసి టర్కీకి సాయాన్ని పంపింది పాకిస్తాన్. ఇందులో ట్విస్ట్ ఏంటంటే గతేడాది వరదల కారణంగా పాకిస్తాన్ తీవ్రంగా దెబ్బతిన్న సమయంలో టర్కీ సాయం చేసింది. అయితే అప్పుడు టర్కీ పంపిన సాయానికే నీట్ గా కొత్త ప్యాకింగ్ తొడిగి సీ-130 విమానాలను టర్కీకి పంపింది పాక్. దీనిపై సొంతదేశ ప్రజలతోనే విమర్శలు ఎదుర్కొంటోంది పాక్ సర్కార్.
READ ALSO: Uddav Thackeray: ఎలక్షన్ కమీషన్ ప్రధాని మోదీకి బానిస.. మా “విల్లు-బాణం” దొంగిలించారు.
చివరకు బాక్సులపై ఉన్న వివరాలను కూడా మార్చకపోవడంతో పాకిస్తాన్ గుట్టు రట్టైంది. కొత్త బాక్సులపై ‘టర్కీ భూకంప బాధితులకు పాకిస్తాన్ ప్రజలు పంపుతున్న సాయం’ అని రాసి ఉంది.. అయితే ఇందులో మరో బాక్స్ ఉంది. అయితే దీనిపై ‘ పాకిస్తాన్ వరద బాధితుల కోసం టర్కీ ప్రజలు పంపిన సాయం’ అని ఉంది. దీంతో పాకిస్తాన్ సాయం విలువ బయటపడింది. ఇదిలా ఉంటే పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఈ సాయాన్ని దగ్గరుండి పర్యవేక్షించడం గమనార్హం. ఈ విషయాన్ని టర్కీ కాన్సులేట్ జనరల్, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
టర్కీ భూకంపం సంభవించిన సమయంలో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో టర్కీకి వెళ్లి తన సానుభూతిని తెలియజేయాలనుకున్నారు. అయితే ఆ సమయంతో టర్కీ వీరిని రావద్దని చెప్పింది. అయినా కూడా రెండు రోజుల క్రితం పాక్ ప్రధాని టర్కీకి వెళ్లి, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ తన సానుభూతిని తెలియజేశారు. అయితే ఈ పర్యటనపై స్వదేశంలోనే ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. పాక్ ప్రజలు నిత్యావసరాల కోసం ఇబ్బందులు పడుతుంటే.. మీరు మాత్రం ప్రజల డబ్బులో పర్యటను చేస్తున్నారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు.