FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫిఫా ప్రపంచకప్ సుదీర్ఘ 96 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక సరికొత్త సాంప్రదాయానికి తెరలేవనుంది. ఆదివారం అర్జెంటీనా, స్పెయిన్ జట్ల మధ్య న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరగబోయే 2026 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో విజేతగా నిలిచే జట్టుకు ఈసారి సరికొత్తగా ‘ఛాంపియన్షిప్ రింగ్స్’ బహుకరించనున్నారు. ఫుట్‌బాల్ చరిత్రలోనే ఈ తరహా బహుమతిని అందించడం ఇదే తొలిసారి. అమెరికన్ క్రీడా రంగంలో విజేతలకు ఉంగరాలను బహుకరించే సాంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు అదే వినూత్న శైలిని అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లోకి తీసుకువస్తూ, ఇదొక చారిత్రాత్మక ఘట్టమని ఫిఫా (FIFA) అభివర్ణించింది.
ఫైనల్ మ్యాచ్‌లో గెలిచే జట్టు కోసం ప్రత్యేకంగా రూపొందించిన 30 ఛాంపియన్షిప్ రింగ్స్‌ను అందుబాటులో ఉంచారు. వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానుల కోసం మరో 1,996 ఉంగరాలను విక్రయానికి ఉంచనున్నట్లు సంస్థ ప్రకటించింది. విజేతలకు అందించే ప్రతిష్టాత్మక గోల్డ్ మెడల్స్, ప్రపంచకప్ ట్రోఫీతో పాటు ఈ విజయ సూచిక ఉంగరం కూడా గెలిచిన జట్టుకు ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలవనుంది.
Also Read
- Chairman's Desk: భక్తి విప్లవానికి కొత్త బాటలు..! జాతీయ స్థాయిలో ఎందుకు చర్చనీయాంశం అయింది..?
- Lakdikapul One Way :హైదరాబాద్‌లో మరో వన్ వే.. లక్డీకాపూల్‌లో 22న ప్రయోగాత్మక అమలు..
- Off The Record: సూర్యాపేట కాంగ్రెస్ ను ముంచుతున్న గ్రూప్ వార్..!
- CM Revanth Reddy : కేటీఆర్‌పై రేవంత్ ఫైర్.. పది జన్మలెత్తినా కాలేవంటూ..
అయితే.. ఫిఫా తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై ప్రపంచ ఫుట్‌బాల్ సర్కిల్స్ నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాకర్ ఆటను పూర్తిగా అమెరికీకరణ చేస్తున్నారంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఆట మధ్యలో హైడ్రేషన్ బ్రేకులు ప్రవేశపెట్టడం వల్ల సాంప్రదాయబద్ధంగా సాగే రెండు అర్ధభాగాలు కాస్తా, నాలుగు క్వార్టర్ల మ్యాచ్‌గా మారిపోయిందనే అసంతృప్తి ఉంది. దీనికి తోడు ఆదివారం నాటి ఫైనల్ మ్యాచ్‌లో ప్రత్యేకంగా హాఫ్‌టైమ్ షోను కూడా ఏర్పాటు చేస్తుండటం విశేషం.
ఇదిలా ఉండగా.. అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ 2026 టోర్నమెంట్ ముగింపు వేడుకలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరుకానున్నట్లు వైట్ హౌస్ ధృవీకరించింది. ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం విజేతలకు ట్రంప్ చేతుల మీదుగానే ప్రపంచకప్ ట్రోఫీని అందజేస్తారని ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో గతంలోనే ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది క్రీడాభిమానులను ఆకర్షిస్తోంది.
తాజావార్తలు
-
Modi Speaks to Zelenskyy : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ..
-
Chairman’s Desk: భక్తి విప్లవానికి కొత్త బాటలు..! జాతీయ స్థాయిలో ఎందుకు చర్చనీయాంశం అయింది..?
-
OTR : పవన్ నియోజకవర్గంలో ఎంపీ తీరు మారాలంటున్న జనసైనికులు
-
OTR : కూటమి హవాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు షాక్.. కృష్ణా జిల్లా ఫలితాల్లో ట్విస్ట్!
-
Lakdikapul One Way :హైదరాబాద్‌లో మరో వన్ వే.. లక్డీకాపూల్‌లో 22న ప్రయోగాత్మక అమలు..
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!