Venu Goapl Reddy
Author- NTV Telugu-
IMF: 2023 ప్రపంచవృద్ధిలో సగం వాటా భారత్, చైనాలదే..
IMF: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 3 శాతం కన్నా తక్కువ వృద్ధిని సాధిస్తుందని, 2023లో ప్రపంచవృద్ధిలో భారత్, చైనాల వాటానే సగం ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) చీఫ్ గురువారం తెలిపారు. ఐఎంఎఫ్ మేనేజింగ్ డైెరెక్టర్ క్రిస్టాలినా జార్జివా మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రం ప్రభావం చూపించాయని, దీంతో పాటు కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనంలో ఉందని ఆమె హెచ్చరించారు. -
Israel: ఇజ్రాయిల్, లెబనాన్ మధ్య ఉద్రిక్తత.. రాకెట్, వైమానిక దాడులు
Israel blames Hamas for multiple rockets launched from Lebanon: ఇజ్రాయిల్, లెబనాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. లెబనాన్ నుంచి హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయిల్ పై రాకెట్ దాడులు చేసినట్లు ఆ దేశం ఆరోపిస్తోంది. ఇప్పటికే లెబనాన్ చర్యలపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు స్పందించారు. శతృవులు మూల్యం చెల్లించుకోక తప్పదని మెచ్చరించారు. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ గురువారం అర్థరాత్రి పాలస్తీనా గాజా స్ట్రిప్ పై వైమానికి దాడులు నిర్వహించింది. -
CNG Rates: 10 శాతం వరకు తగ్గనున్న సీఎన్జీ ధరలు.. ధర విధానంలో మార్పుకు కేంద్రం ఆమోదం..
CNG Rates: సహజవాయువు ధరను నిర్ణయించేందుకు ప్రభుత్వం కొత్త పద్ధతిని తీసుకురాబోతోంది. ధర పరిమితి విధించేందుకు కేంద్ర క్యాబినెట్ గురువారం ఆమోద ముద్ర వేసింది. యూఎస్ఏ, కెనడా, రష్యా వంటి విదేశాల్లోని గ్యాస్ ధరలతో కాకుండా దిగుమతి చేసుకున్న ముడి చమురు ధరతో అనుసంధానించనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. దీని వల్ల పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ) ధర 10 శాతం వరకు, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ) ధర 6 శాతం నుంచి 9 శాతానికి తగ్గుతుందని ఆయిల్ సెక్రటరీ పంకజ్ జైన్… -
Delhi High Court: బాత్రూంలో స్నానం చేయడం ప్రైవేటు వ్యవహారం.. ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
Delhi High Court: మహిళల ప్రైవసీకి సంబంధించి ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాత్ రూంలో స్నానం చేయడమనేది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం అని, ఒక వేళ బాత్ రూం ఇంటి బయట ఉన్నా, తాత్కాలిక నిర్మాణమైనంత మాత్రాన అక్కడ స్నానం చేయడం బహిరంగ చర్యగా పేర్కొనలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. -
Care Hospital: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడిని సత్కరించిన కేర్ ఆస్పత్రి..
Care Hospital: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని 102 సంవత్సరాల ప్రముఖ స్వతంత్ర సమరయోధులు శ్రీ ఏటికూరి కృష్ణ మూర్తికి కేర్ ఆస్పత్రి తరపున సత్కరించింది. గురువారం కేర్ ఆసుపత్రి అవుట్ పేషెంట్ విభాగంలో జరిగిన హెల్త్ ఫర్ అల్ కార్యక్రమంలో శాలువా కప్పి జ్ఞాపికతో సత్కరించారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (WHD) జరుపుకుంటారు. ఈ సంవత్సరం ప్రజారోగ్యానికి సంబంధించిన ప్రాధాన్యతా ప్రాంతాన్ని హైలైట్ చేయడానికి ఒక థీమ్‌ని ఎంపిక చేస్తారు. -
India Oil Exports: రష్యా ఆయిల్‌తో భారత్ వ్యాపారం.. యూరప్‌కు పెరిగిన ఎగుమతులు..
India Oil Exports: గ్లోబల్ ఆయిల్ మార్కెట్ లో ప్రస్తుతం ఇండియా కీలక పాత్ర పోషిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో భారత్, రష్యా ఆయిల్ తో వ్యాపారం చేస్తోంది. రష్యాపై ఆంక్షలు విధించిన యూరప్ దేశాలు ప్రస్తుతం ఆయిల్ కోసం భారత్ ను ఆశ్రయిస్తున్నాయి. యుద్ధాన్ని చూపిస్తూ యూరప్ దేశాలు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలును నిలిపేశాయి. దీంతో పాటు రష్యా క్రూడ్ ఆయిల్ ధరపై ధర పరిమితిని విధించాయి. -
Donald Trump: అరెస్ట్ తర్వాత అమాంతం పెరిగిన డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ…
Donald Trump: పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్ కేసులో డొనాల్డ్ ట్రంప్ న్యాయపరమైన విచారణ ఎదుర్కొంటున్నారు. 2016 ఎన్నికల ముందు స్టార్మీ డేనియల్ తో ఉన్న శృంగార సంబంధాన్ని దాచిపెట్టేందుకు పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చినట్లు మాజీ అధ్యక్షుడు ట్రంప్ అభియోగాలను ఎదుర్కొంటున్నారు. రెండు రోజుల క్రితం ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుల నేపథ్యంలో ఆయన న్యూయార్క్ మాన్ హట్టన్ కోర్టులో విచారణకు హాజరయ్యారు. మొత్తం 34 అభియోగాలను ఎదుర్కొంటున్నారు ట్రంప్. -
Covid 19: దేశంలో 5 వేలను దాటిన రోజూవారీ కోవిడ్ కేసులు..
Covid 19: దేశంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 5,335 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. గత రోజుతో పోలిస్తే 20 శాతం అధికంగా కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 25,587 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత సెప్టెంబర్ 23 తర్వాత తొలిసారిగా కేసుల సంఖ్య 5 వేలను దాటింది. ప్రస్తుతం రోజూవారీ పాజిటివిటీ రేటు 3.32 శాతంగా ఉంది. -
Success Story: ఇది కదా సక్సెస్ అంటే.. డ్రైవర్ స్థాయి నుంచి ఐఐటీ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలిచ్చే స్థాయికి..
Success Story: కష్టపడే తత్వం, తెలివితేటలు ఉంటే చాలా ఎంతటి కష్టాలనైనా ఎదుర్కొని గొప్పగా మారొచ్చు. అందుకు ఈ దిల్‌ఖుష్‌కుమార్ జీవితమే ఓ ఉదాహరణ. పెద్దపెద్ద చదువులు చదివినా కొన్ని సార్లు రాని పేరు తన కష్టం, తెలివితో సాధించుకున్నాడు. రిక్షాపుల్లర్, సాధారణ డ్రైవర్, కూరగాయల వ్యాపారి స్థాయి నుంచి కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దేశంలో పేరొందిన ఐఐటీ, ఐఐఎం గ్యాడ్యుయేట్లకు తన సంస్థలో ఉద్యోగం ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. -
PM Modi: హనుమాన్ స్పూర్తితో అవినీతి, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలి.
PM Modi: భగవాన్ హనుమాన్ స్పూర్తితో దేశంలోని అవినీతి, బంధు ప్రీతి, వారసత్వ రాజకీయాలు, శాంతిభద్రతల సవాళ్లపై పోరాడలని బీజేపీ కృతనిశ్చయంతో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీ 44వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. బీజేపీ హనుమంతుడిలా దేశం కోసం ధృడసంకల్పం, దేశ సంక్షేమం కోసం కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా వెనకాడబోమని, పార్టీ కార్యకర్తలు త్యాగం, అంకితభావంతో పనిచేయాలని ఆయన సూచించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!