Venu Goapl Reddy
Author- NTV Telugu-
Komatireddy Venkat Reddy: రైల్వే మంత్రితో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ..
Komatireddy Venkat Reddy: కేంద్ర రైల్వేశాక మంత్రి అశ్విని వైష్ణవ్ తో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్ల అభివృద్ధిపై గురించి చర్చించారు. యాదాద్రి పుణ్యక్షేత్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న భువనగిరి స్టేషన్ కు ప్రతీరోజూ వేల సంఖ్యలో ప్రయాణికులు వస్తున్నారని, అదే విధంగా జనగామ జిల్లాగా ఏర్పడిందని, రోజూ విద్యార్థులు, ఉద్యోగులు రాకపోకలు సాగిస్తున్నారని ఈ రెండు స్టేషన్లను ఆధునీకీకరించాలని ఆయన కేంద్రమంత్రిని కోరారు. -
Starship Super Heavy: ఆకాశంలో పేలిన వరల్డ్ బిగ్గెస్ట్ రాకెట్.. ప్రయోగ సమయంలో విఫలం
Starship Super Heavy: ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన, అతిపెద్ద రాకెట్ ప్రయోగం విఫలం అయింది. ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ శక్తివంతమైన రాకెట్ ‘‘ స్టార్ షిప్ సూపర్ హెవీ’’ని ఈ రోజు ప్రయోగించింది. అయితే ఇది భూమి నుంచి ఆకాశంలోకి వెళ్లినా, కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆకాశంలోనే పేలిపోయింది. టెక్సాస్ లోని బోకా కికాలోని ఎలాన్ మస్క్ ఏరోస్పేస్ ఫెసిలిటి స్టార్ బేస్ నుంచి లిఫ్ట్ ఆఫ్ అయిన కొద్ది సేపటికే పేలిపోయింది. -
Bandi Sanjay: చేవెళ్ల నేతలతో బండి సంజయ్ భేటీ.. అమిత్ షా పర్యటన ఏర్పాట్లపై చర్చ
Bandi Sanjay: చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ నేతలతో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భేటీ అయ్యారు. మొయినాబాద్ సమీపంలోని అజీజ్ నగర్ లో ఈ భేటీ జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 23న తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. చేవెళ్లలో భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ నియోజకవర్గ నేతలతో సమావేశమై సభ ఏర్పాట్లపై చర్చించారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుల ఈటెల రాజేందర్ తో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ… -
Karimnagar: అనుమానాస్పద మృతిని చేధించిన జమ్మికుంట పోలీసులు..
Karimnagar: అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చును రేపుతున్నాయి. చివరకు ఆత్మహత్యలు, హత్యలకు కారణం అవుతున్నాయి. పెళ్లై పిల్లలు ఉన్న వారు పిల్లల జీవితాన్ని, తమ గౌరవాన్ని పట్టించుకోకుండా బరితెగిస్తున్నారు. భర్తలను కాదని ప్రియులతో సంబంధాలు నెరుపుతూ కొంతమంది భార్యలు హత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా అనేకం జరిగాయి. చాలా సందర్భాల్లో అక్రమ సంబంధాలు హత్యలకు కారణం అవుతున్నాయి. -
Volodymyr Zelensky: ఇదే సమయం.. మమ్మల్ని కూడా “నాటో”లో చేర్చుకోండి…
Volodymyr Zelensky: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో అంతం అయ్యేలా కనిపించడం లేదు. రష్యా నెమ్మనెమ్మదిగా ఉక్రెయిన్ పై పట్టు సాధిస్తోంది. ఇప్పటికే అత్యంత కీలకం అయిన బఖ్ మూత్ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే 70 శాతం ప్రాంతాన్ని రష్యా నియంత్రణలోకి తీసుకుంది. దీంతో పాటు మూడు వైపుల నుంచి భారీగా దాడులు చేస్తోంది. ఇటీవల రష్యా జరిపిన దాడుల్లో ఏకంగా 400 మంది ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారి బఖ్ మూత్ సొంతం అయితే ఇక ఉక్రెయిన్ లోని… -
Tata Altroz iCNG: టాటా ఆల్ట్రోజ్ ఐ సీఎన్జీ బుకింగ్స్ ప్రారంభం.. డెలివరీ, స్పెసిఫికేషన్స్ వివరాలు..
Tata Altroz iCNG: ప్రతీ భారతీయులు ఓ కారు కొనాలంటే ముందుగా ఆలోచించేది ఖర్చు, అది ఇచ్చే మైలేజ్. అయితే ప్రస్తుతం ప్రముఖ కార్ తయారీ సంస్థలు ఎలక్ట్రిక్, సీఎన్జీ కార్లపై ప్రత్యేక దృష్టి సారించాయి. అయితే ఎలక్ట్రిక్ కార్ల ధరలు ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉండటంతో వినియోగదారులు తక్కువ ఖర్చులో ఎక్కువ మైలేజ్ ఇచ్చే సీఎన్జీ వాహనాలపై దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ, టాటా వంటి దిగ్గజ కార్ మేకర్స్ సీఎన్జీ కార్లను మార్కెట్ లోకి తీసుకువస్తున్నాయి. ఇప్పటికే మారుతీ… -
26/11 Mumbai Terror Attacks: ముంబై దాడుల నిందితుడిని భారత్‌కు అప్పగించనున్న అమెరికా .. 30 రోజుల్లో కోర్టు నిర్ణయం
26/11 Mumbai Terror Attacks: 26/11 ముంబై ఉగ్రదాడుల నిందితుడిని అమెరికా, భారత్ కు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు అమెరికా కోర్టు 30 రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. 2008లో లష్కరే తోయిబా చేసిన ముంబై దాడుల్లో పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా వ్యక్తి తహవుర్ రాణా కీలక నిందితుడి ఉన్నాడు. ఇతడిపై అమెరికా న్యాయస్థానం విచారణ చేస్తోంది. ప్రస్తుతం జైలులో ఉన్న వ్యాపారవేత్త తహవుర్ రాణా దాఖలు చేసిన స్టేటస్ కాన్ఫరెన్స్ మోషన్‌ను అమెరికా న్యాయస్థానం కొట్టేసింది. -
Karnataka Elections: కర్ణాటకలో ప్రచారానికి ప్రధాని మోదీ.. 20 చోట్ల భారీ బహిరంగ సభలు
Karnataka Elections: కర్ణాటక ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్, జేడీయూలు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించాయి. అధికారం నిలబెట్టుకోవాలని బీజేపీ, అధికారంలోకి రావాలని కాంగ్రెస్, కింగ్ మేకర్ పాత్ర పోషించాలని జేడీఎస్ ఇలా ప్రతీపార్టీ కూడా తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ఈ ఎన్నికలను అంతా సెమీఫైనల్ గా భావిస్తున్నారు. -
2024 Lok Sabha elections: లోక్‌సభ ఎన్నికలకు ఈసీ కసరత్తు..
2024 Lok Sabha elections: 2024 లోకసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహకాలను ప్రారంభించింది. ఎలక్షన్ కమిషన్(ఈసీ) కొత్తగా 8.92 లక్షల కొత్త వీవీపాట్ మెషీన్లకు ఆర్డర్ చేసింది. ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (VVPAT) మరియు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (EVMలు) తప్పుగా ఉన్నాయనే ఆందోళనలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. -
SCO Foreign Ministers Meeting: వచ్చే నెలలో భారత్ రానున్న పాక్ మంత్రి.. 2014 తర్వాత ఇదే మొదటిసారి..
SCO Foreign Ministers Meeting: గోవాలో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్సిఓ) విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చే నెలలో తమ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ భారత్‌కు వస్తారని పాకిస్థాన్ గురువారం ప్రకటించింది. వచ్చే నెలలో 4-5 తేదీల్లో గోవా వేదికగా ఈ సమావేశం జరగబోతోంంది. దీనికి పాకిస్తాన్ తరుపును ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో నేతృత్వంలో ప్రతినిధి బృందం భారత్ రానుంది. దాదాపుగా తొమ్మిదేళ్ల అనంతరం ఓ పాకిస్తాన్ నాయకుడు భారత్ లో పర్యటించడం…
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!