Sukesh Chandrashekhar: రూ.200 కోట్ల దోపిడి కేసులో సుకేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నాడు. ఈ కేసులో బాలీవుడ్ స్టార్స్ జాక్వలిన్ ఫెర్నాండెస్, నోరా ఫతేహ్ వంటి వారి పేర్లు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే జాక్వలిన్ ఫెర్నాండెస్ కు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ.. సుకేష్ లవ్ లెటర్ రాశాడు. ఈ లెటర్ లో మీడియాను ఆయన మద్దతుదారులను, వ్యతిరేకులను ఉద్దేశిస్తూ హోలీ విషెస్ తెలిపారు.
Read Also: Aligarh Mosque: హోలీ సందర్భంగా అలీగఢ్ మసీదుకు ముసుగు..
అందమైన జాక్వెలిన్ కు హోలీ శుభాకాంక్షలు, హోలీ రోజు నీకు ప్రావిస్ చేస్తున్నా.. మీ నుంచి వెళ్లిపోయిన కలర్ ఫుల్ జీవితాన్ని 100 రెట్లు తిరిగి వస్తుంది, దానికి నాదే పూర్తి బాధ్యత, ఐ లవ్ యూ బేబీ గర్ల్, కీప్ స్మైలింగ్, లవ్ యూ మై ప్రిన్సెస్, మిస్ యూ లోడ్స్ అంటూ తన ప్రేమను తెలియజేశారు. మీకు తెలుసు నేను మీకోసం ఎందాకైనా వెళ్తా అంటూ లేఖలో పేర్కొన్నాడు. గతంలో ప్రేమికుల రోజున కూడా సుకేష్ చంద్రశేఖర్ ఇలాగే జాక్వెలిన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
మనీలాండరింగ్ కేసులో సుకేష్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నాడు. రూ.200 కోట్లు మనీలాండరింగ్ కు పాల్పడినట్లు అభియోగాలను ఎదర్కొంటున్నారు. ఇప్పటికే ఈడీ ఇతడిపై మొత్తం మూడు కేసులను నమోదు చేసింది. కేంద్ర హోం, లా సెక్రటరీలుగా నటిస్తూ.. మాజీ రెలిగేర్ ప్రమోటర్ మల్వీందర్ సింగ్ భార్య అదితి సింగ్ ను మోసగించి రూ. 200 కోట్లు వసూలు చేశాడు. ఈ కేసులో జాక్వెలిన్ రూ.7 కోట్ల వరకు పొందినట్లు అభియోగాలు ఉన్నాయి. రెలిగేర్ ఫిన్ వెస్ట్ లిమిటెడ్ లో నిధుల దుర్వినయోగానికి సంబంధించిన కేసులో మల్వీందర్ ప్రస్తుతం జైలు ఉన్నాడు. అయితే ఈ కేసులో జాక్వెలిన్ కు ఎలాంటి సంబంధం లేదని కోర్టులో తెలిపారు సుకేష్. అయితే జాక్వెలిన్ మాత్రం సుకేష్ తన జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపిస్తోంది.