185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
REDMAGIC Astra 2: గేమింగ్ డివైస్ల తయారీలో పేరు పొందిన REDMAGIC తన తాజా ఫ్లాగ్షిప్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2ను గ్లోబల్ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. గత నెలలో చైనాలో లాంచ్ చేసిన ఈ ట్యాబ్లెట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. మొబైల్ గేమింగ్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ డివైస్‌లో Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్, 185Hz OLED డిస్ప్లే, పరిశ్రమలో తొలిసారిగా ట్యాబ్లెట్లో అందించిన లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.
సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్:
REDMAGIC Astra 2లో Qualcomm నుండి వచ్చిన కొత్త Snapdragon 8 Elite Gen 5 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనికి గరిష్టంగా 16GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు. భారీ గ్రాఫిక్స్ గేమ్స్, మల్టీటాస్కింగ్, హై-పర్ఫార్మెన్స్ యాప్స్‌ను సులభంగా నిర్వహించగలదు. ఇందులో REDMAGIC ప్రత్యేకంగా రూపొందించిన RedCore R4 గేమింగ్ చిప్ కూడా ఉంది. ఇది గేమింగ్ సమయంలో విజువల్ ఎఫెక్ట్స్, 2K సూపర్ రిజల్యూషన్, పవర్ మేనేజ్మెంట్ వంటి పనులను ప్రత్యేకంగా నిర్వహించి ప్రధాన ప్రాసెసర్‌పై భారం తగ్గిస్తుంది. అలాగే ఎనర్జీ క్యూబ్ 3.0 టెక్నాలజీ CPU, GPU, మెమరీ, టచ్, కూలింగ్ వంటి అన్ని విభాగాలను రియల్‌టైమ్‌లో ఆప్టిమైజ్ చేసి స్థిరమైన ఫ్రేమ్రేట్లను అందిస్తుంది.
Also Read
- 200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
- New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
- 7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- Dell XPS 13: Dell XPS 13 వచ్చేసింది.. 2.5K టచ్‌స్క్రీన్, Intel Core Ultra 7 ప్రాసెసర్ తో ప్రీమియం ల్యాప్‌టాప్
2.4K OLED డిస్ప్లే:
ఈ గేమింగ్ ట్యాబ్లెట్లో 9.06 అంగుళాల 2.4K OLED డిస్ప్లేను అందించారు. ఇది 2400 × 1504 పిక్సెల్స్ రిజల్యూషన్, 185Hz రిఫ్రెష్ రేట్, 90.1% స్క్రీన్-టు-బాడీ రేషియో, కేవలం 4.9mm బెజెల్స్ తో వస్తుంది. అలాగే Synaptics S3930 టచ్ సిస్టం ద్వారా 300Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2000Hz ఇన్స్టంట్ టచ్ శాంప్లింగ్ సపోర్ట్ లభిస్తుంది. దీంతో గేమింగ్ సమయంలో టచ్ రెస్పాన్స్ అత్యంత వేగంగా ఉంటుంది.
ట్యాబ్లెట్లో తొలిసారి లిక్విడ్ కూలింగ్:
Astra 2లో AquaCore కూలింగ్ సిస్టం 2.0ను అందించారు. ఇది ట్యాబ్లెట్లో ఫ్లోయింగ్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని ఉపయోగించిన తొలి మోడల్‌గా కంపెనీ పేర్కొంది.
ఈ కూలింగ్ సిస్టమ్‌లో యాక్టివ్ లిక్విడ్ లూప్, లిక్విడ్ మెటల్ 3.0, 4D వేపర్ ఛాంబర్ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీలు ఉన్నాయి. దీని వల్ల ఎక్కువసేపు గేమింగ్ చేసినా ట్యాబ్లెట్ వేడెక్కకుండా స్థిరమైన పనితీరు అందిస్తుంది.
8300mAh బ్యాటరీ:
ఈ ట్యాబ్లెట్లో 8300mAh డ్యూయల్-సెల్ బ్యాటరీను అందించారు. ఇది 75W ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతు ఇస్తుంది. కంపెనీ ప్రకారం, బ్యాటరీని సుమారు 60 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇందులో రెండు USB Type-C పోర్టులు ఉన్నాయి. ఒకటి 75W ఫాస్ట్ ఛార్జింగ్‌కు, మరొకటి 40W ఛార్జింగ్, ఆడియో అవుట్‌పుట్‌కు అదనంగా 4K@144fps, 8K@60fps DisplayPort అవుట్‌పుట్, Bluetooth 6.0, Two-way Reverse Charging వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ప్రీమియం డిజైన్:
REDMAGIC Astra 2లో మెటల్ ఫ్రేమ్, పారదర్శక గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌తో పాటు లోపలి లిక్విడ్ కూలింగ్ భాగాలు కనిపించే ప్రత్యేక డిజైన్‌ను అందించారు. అలాగే RGB లైటింగ్ కూడా ఉంది. ఈ ట్యాబ్లెట్‌కు IP54 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణ లభిస్తుంది. ట్యాబ్లెట్లో DTS Ultra సపోర్ట్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, డ్యూయల్ X-axis లీనియర్ మోటార్లు ఉన్నాయి. Magic Key బటన్ ద్వారా GameSpaceను వెంటనే యాక్సెస్ చేయవచ్చు. ఇది REDMAGIC OS 11.5 (Android 16 ఆధారితం)పై పనిచేస్తుంది. ఇందులో 13MP రియర్ కెమెరా, 9MP ఫ్రంట్ కెమెరా, ఫేస్ అన్‌లాక్, ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ధర:
REDMAGIC Astra 2 Gaming Tablet ఆగస్టు 10 నుంచి అధికారిక వెబ్సైట్లో Early Bird Access ద్వారా అందుబాటులోకి రానుంది. ఆగస్టు 26 నుంచి ఓపెన్ సేల్ ప్రారంభమవుతుంది. Early Bird కస్టమర్లకు 80W ఫాస్ట్ ఛార్జర్‌తో పాటు ప్రత్యేక REDMAGIC Keychainను ఉచితంగా అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
* 12GB + 256GB వేరియంట్ ధర 749 డాలర్లు (రూ.72,085).
* 16GB + 512GB వేరియంట్ ధర 849 డాలర్లు (రూ.81,710).
REDMAGIC Astra 2: Icy Veins. Infinite Frames.
Snapdragon 8 Elite Gen 5
AquaCore Liquid Cooling System
9.06" 185Hz OLED Display
Dual USB-C Ports
8300mAh Battery + 80W Fast Charging
Available August 26. pic.twitter.com/7YrzPpDNvQ
— REDMAGIC (@redmagicgaming) July 17, 2026
తాజావార్తలు
-
Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!