Bus Falls Off Bridge In Jharkhand: జార్ఖండ్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హజారీబాగ్ జిల్లాలో శనివారం ఓ బస్సు వంతెనపై నుంచి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా.. చాలా మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Lakhimpur Kheri girl dies of assault: ఉత్తర్ ప్రదేశ్ లఖీంపూర్ ఖేరీ జిల్లా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఇటీవల లఖీంపూర్ ఖేరీ జిల్లాలో ఇద్దరు దళిత బాలికపై అత్యాచారం చేసి, చెట్టుకు ఉరేసి చంపారు. ఈ ఘటన మరవకు ముందే మరో బాలికపై దాడి చేశారు ఇద్దరు వ్యక్తులు. బాలిక చికిత్స పొందుతూ మరణించింది. నిందితులిద్దరూ కూడా బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
Pregnant woman dies after being mowed down by finance recovery agents in jharkhand: జార్ఖండ్ హజారీ బాగ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రుణ వాయిదా చెల్లించలేదని ట్రాక్టర్ తీసుకువెళ్లేందుకు లోక్ రికవరీ ఏజెంట్లు వచ్చిన క్రమంలో గర్భిణిపై ట్రాక్టర్ ఎక్కించారు. దీంతో మూడు నెలల గర్భిణి మరణించింది. జిల్లాలోని ఇచక్ ప్రాంతానికి చెందిన మిథిలేష్ రైతు స్థానికంగా ఉన్న ఫైనాన్స్ కంపెనీలో రుణం తీసుకుని ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. అయితే నెలనెల కట్టాల్సిన వాయిదాలను కొన్ని కారణాల వల్ల…
Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సైనికులు దురాగతాలు ఒక్కొక్కటిగ బయటపడుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్ రెండో అతిపెద్ద నగరం ఖార్కీవ్ నుంచి రష్యా బలగాలు నిష్క్రమించాయి. ఈ ప్రాంతాన్ని మళ్లీ ఉక్రెయిన్ తన ఆధీనంలోకి తెచ్చుకుంది. తిరిగి ఆధీనంలోకి తీసుకున్న ప్రాంతాల్లో రష్యా బలగాలు చేసిన అకృత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇజియమ్ ప్రాంతంలో 400లకు పైగా మృతదేహాలను ఉక్రెయిన్ అధికారులు గుర్తించారు. దీంట్లో విస్తూపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
Visa-Free Travel To Russia: రష్యాను సందర్శించాలనుకునే భారతీయులకు శుభవార్త. ఇకపై రష్యా సందర్శించాలనుకుంటే వీసా రహితంగా సందర్శించే అవకాశం ఏర్పడింది. శుక్రవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ మధ్య ఇరు దేశాల మధ్య వీసా ఫ్రీ ట్రావెల్ ప్రయాణ ఒప్పందం చర్చలోకి వచ్చింది. ఈ ఒప్పందంపై త్వరలోనే నిర్ణయం అమలులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
santosh yadav - The First Woman Chief Guest At RSS Dussehra Event: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్( ఆర్ఎస్ఎస్) తొలిసారిగా దసరా కార్యక్రమానికి ఓ మహిళను అతిథిగా ఆహ్వానించింది. గత 97 ఏళ్లలో ఓ మహిళను ముఖ్య అతిథిగా ఆహ్మానించడం ఇదే తొలసారి. నాగ్పూర్లో జరిగే వార్షిక దసరా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని ప్రముఖ పర్వతారోహరాలు సంతోష్ యాదవ్ ను ఆహ్వానించింది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథి అని ఆర్ఎస్ఎస్ జాయింట్ పబ్లిసిటీ చీఫ్ నరేందర్ ఠాకూర్…
CBI petition to cancel Tejaswi Yadav's bail: బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సీబీఐ ఝలక్ ఇచ్చింది. గతంలో రైల్వేలో ఉద్యోగాలకు అక్రమంగా కొందరు అభ్యర్థల నుంచి ల్యాండ్స్ తీసుకున్నారు. ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’ స్కామ్ భాగంగా సీబీఐ విచారిస్తున్న సమయంలో అధికారుల పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులను బెదిరించిన కేసులో తేజస్వీ ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది.
US Media Praises PM Modi: ఉజ్బెకిస్తన్ లో జరిగిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీ ఓ) సమావేశం ప్రపంచ దృష్టిని ఆకర్షింది. ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్ యుద్దంపై భారత ప్రధాని మోదీ ఏ విధంగా స్పందిస్తారో అని అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు ఆసక్తిగా చూశాయి. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి రష్యా అధినేత పుతిన్, భారత ప్రధాని మోదీలు తొలిసారిగా ఒకే వేదికను పంచుకున్నారు. వీరిద్దరి మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి, ఉక్రెయిన్ యుద్ధంపై 55 నిమిషాల పాటు చర్చ జరిగింది.
17 people Killed heavy rains and Landslides in Nepal: హిమాలయ దేశం నేపాల్ ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీగా పడుతున్న వర్షాలతో జనజీవితం స్తంభించిపోయింది. చాలా ప్రాంతాల్లో కొండచరియాలు విరిగిపడుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి నేపాల్ వ్యాప్తంగా భారీగా వానలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో వానల కారణంగా దేశంలో 17 మంది మరణించారని అక్కడి అధికారులు శనివారం వెల్లడించారు.
Road accident in odisha: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఝార్సుగూడ-సంబల్ పూర్ బిజూ ఎక్స్ప్రెస్వేపై శుక్రవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఝార్సుగూడ పవర్ హౌజ్ చర్ సమీపంలో బొగ్గు లారీ, బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది.