Pakistan: హోలీ జరుపుకున్నందుకు హిందూ విద్యార్థులను చితకబాదిన తోటి విద్యార్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ లో మైనారిటీ హక్కులు ఎలా ఉంటోయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడి మైనారిటీలు అయిన హిందూ, సిక్కు, క్రైస్తవులను ద్వితీయ శ్రేణి పౌరులుగానే చూస్తుంటారు. మైనారిటీ బాలికను బలవంతంగా కిడ్నాప్ చేసి మతం మార్చి పెళ్లిళ్లు చేసుకోవడం అక్కడ సర్వసాధారణం అయిపోయింది. మైనారిటీలు తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నా.. పాక్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉంటే భారత్ లో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయంటూ మొసలి కన్నీరు కారుస్తుంటుంది.
Read Also: Pakistan Suicide Bomber: పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి.. 9 మంది పోలీసులు మృతి
Also Read
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
తాజాగా లాహోర్ యూనివర్సిటీ ప్రాంగణంలో హోలీ జరుపుకుంటున్న హిందూ విద్యార్థులను తోటి విద్యార్థులు, యూనివర్సిటీ సెక్యూరిటీ గార్డులు చితకబాదారు. సోమవారం జరిగిన ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. పంజాబ్ యూనివర్శిటీలోని లా కాలేజ్‌లో సోమవారం దాదాపు 30 మంది హిందూ విద్యార్థులు హోలీ జరుపుకునేందుకు గుమిగూడిన సమయంలో సంఘటన జరిగింది. ఇస్లామీ జమియాత్ తుల్బా(ఐజేఏ) కార్యకర్తలు, హిందూ విద్యార్థులను బలవంతంగా అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది.
ఐజేఏ కార్యకర్తలపై ఛాన్సలర్ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సమయంలో సెక్యూరిటీ గార్డులు కూడా దాడి చేసినట్లు విద్యార్థులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన, ఇప్పటి వరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని బాధిత విద్యార్థులు తెలిపారు. అయితే దాడికి పాల్పడిన ఐజేఏ విద్యార్థి సంఘం నాయకుడు ఇబ్రహీం షాహిద్ మాట్లాడుతూ.. ఈ ఘటనలో తమ విద్యార్థుల ప్రమేయం లేదని అన్నారు. లా కాలేజీలోని లాన్‌లలో హోలీ వేడుకలు నిర్వహించేందుకు వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఇవ్వలేదని పంజాబ్ యూనివర్సిటీ అధికార ప్రతినిధి ఖుర్రం షాజాద్ తెలిపారు. ఇంట్లో వేడుకలు జరుపుకుంటే ఎలాంటి సమస్య ఉండేది కాదని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
-
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!