Massive Fire At Skyscraper in Changsha city: చైనాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సెంట్రల్ చైనా నగరం చాంగ్షా శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికమ్యూనికేషన్ కంపెనీ చైనా టెలికాం కార్యాలయం ఉన్న 42 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో భవనంలోని 12కు పైగా అంతస్తులు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే వెంటనే అగ్నిమాపక అధికారులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.…
SCO Summit: ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్ వేదికగా షాంఘై సహకార సంస్థ(ఎస్ సీ ఓ) శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. అయితే ప్రపంచ అగ్ర రాజ్యాలైన చైనా, ఇండియా, రష్యా దేశాధినేతలు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. సభ్య దేశాల మధ్య సహాయసహకరాల, వాణిజ్యం, ఉగ్రవాద నిర్మూలన వంటి అంశాలు చర్చకు వచ్చాయి. అయితే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, భారత ప్రధాని నరేంద్రమోదీ మధ్య సమావేశం ఉంటుందా..? లేదా..? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఇరు నేతల మధ్య సమావేశాన్ని భారత విదేశాంగ శాఖ ఉంటుందని…
Chinese National Arrested For Physicaly assault on a minor Girl For Months: పాకిస్తాన్ దేశంలో ఓ చైనా దేశీయుడిని అరెస్ట్ చేశారు. గతంలో ఎన్ని నేరాలకు పాల్పడిన చైనా జాతీయుల పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. చివరకు అధికారులపై దాడులు చేసినా కూడా అక్కడి ప్రభుత్వం చైనా వ్యక్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోయింది. అయితే తాజాగా ఓ చైనా జాతీయుడిని మాత్రం పాకిస్తాన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. గత కొన్ని రోజులుగా టీనేజర్ పై చైనా వ్యక్తి అత్యాచారానికి…
Monkeypox cases in india: దేశంలో మరో మంకీపాక్స్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 90కి పైగా దేశాల్లో మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల నైజీరియన్ మహిళలో మంకీపాక్స్ లక్షణాలు ఉండటంతో.. పరీక్షించగా పాజిటివ్ అని తేలింది. ఢిల్లీలో ఇప్పటి వరకు మొత్తం 8 మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. మొత్తంగా ఇప్పటివరకు 13 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం బాధిత మహిళకు లోక్ నాయక్ జైప్రకాష్…
Ex-Punjab CM Capt Amarinder Singh to join BJP on Monday: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. సెప్టెంబర్ 19 సోమవారం రోజున ఆయన ఢిల్లీలో బీజేపీ పార్టీలో చేరనున్నారు. తన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ(పీఎల్సీ)ని కూడా బీజేపీలో విలీనం చేయనున్నారు. అయితే సోమవారం బీజేపీలో చేరున్నట్లు అమరీందర్ సన్నిహితులను నుంచి వార్తలు వినిపిస్తున్నా.. ఆ రోజే చేరుతారా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే బీజేపీలో చేరడం మాత్రం ఖాయమని తెలుస్తోంది. ఆదివారం…
Girl fell into borewell in Rajasthan: మరో బోరుబావి ప్రమాదం చోటు చేసుకుంది. రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా జిల్లాలో ఈ ఘటన జరిగింది. బండికుమ్ పట్టణంలో అడుకుంటూ వెళ్తున్న ఓ రెండేళ్ల చిన్నారి అంకిత 200 అడుగుల బోరుబావిలో పడిపోయింది. చిన్నారి కనపడకపోవడంతో బోరు బావిలో పడిందని కుటుంబీకులు గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం 100 అడుగుల దూరంలో చిన్నారి ఇరుక్కుపోయింది.
CBI Takes Over Probe Into BJP Leader Sonali Phogat's Death: బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగాట్ మృతిపై ఎట్టకేలకు సీబీఐ విచారణ ప్రారంభించింది. గత నెలలో గోవాలోని ఓ హోటల్ లో సోనాలి ఫోగట్ అనుమానాస్పద రీతిలో మరణించింది. ఆ తరువాత రెస్టారెంట్ సీసీ కెమెరాలను చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసును మొదటగా గోవా పోలీసులు విచారించారు. అయితే ఈ కేసులో సీబీఐ విచారణ కోరుతూ..గోవా సీఎం ప్రమోద్ సావంత్ కేంద్రానికి లేఖ రాశారు. దీంతో కేంద్రం…
PM Shahzab Sharif's comments on Pakistan's economic situation: పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి గురించి ఆ దేశ ప్రధాని షహజాబ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చివరకు పాకిస్తాన్ మిత్ర దేశాలు కూడా పాకిస్తాన్ దేశాన్ని డబ్బు కోసం అడుక్కునే దేశంగా చూడటం ప్రారంభించారని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు మనం మన మిత్ర దేశాలకు ఫోన్ చేసినా.. మనం వారి వద్దకు డబ్బులు అడుక్కునేందుకు వచ్చామని అనుకుంటున్నారని.. షహబాజ్ షరీఫ్ లాయర్ల…
Tamil Nadu Waqf Board Claims Ownership Of Entire Hindu Village, Including Temple Land: తమిళనాడులో కొత్త వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హిందూ గ్రామం మొత్తం వక్ఫ్ బోర్డు పరిధిలో ఉందని తెలియడంతో సదరు గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తిరుచిరాపల్లి జిల్లా తిరుచెందురై గ్రామం మొత్తం వక్ఫ్ బోర్డు పరిధి కింద ఉందని తెలియడంతో గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో వింతేంటంటే 1500 ఏళ్ల క్రితం నాటి పురాతన సుందరేశ్వర ఆలయానికి సంబంధించిన 369 భూమి కూడా…
Peace Pact Signed With 8 Tribal Militant Groups Of Assam: అస్సాం ప్రభుత్వం, గిరిజన తీవ్రవాద సంస్థల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో శాశ్వత శాంతి నెలకొల్పేందుకు ఈ ఒప్పందం ముందడుగు కానుంది. అస్సాంతో దశాబ్ధాల కాలంగా ఉన్న తీవ్రవాద సమస్యను పరిష్కరించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం 8 తీవ్రవాద సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. గురువారం గౌహతిలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ నేతృత్వంలో ఈ ఒప్పందం…