Meta Layoffs: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఆర్థిక లక్ష్యాలను చేరుకోవాడానికి వేలాదిగా ఉద్యోగులను తీసేస్తున్నట్లు ప్లాన్ చేస్తోంది. గతేడాది నవంబర్ నెలలో 13 శాతం అంటే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. 11,000 మంది ఉద్యోగులు కొలువుల నుంచి తీసేసింది. తాజాగా రెండో రౌండ్ కోతలను షురూ చేసింది మెటా. పెద్దమొత్తంలో ప్యాకేజీలు అందుకుంటున్న మేనేజర్లు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: Tamilnadu: తమిళనాడులో ఘోరం.. కరెంట్ ఫెన్సింగ్ కారణంగా ఏనుగులు మృతి
ఈ నేపథ్యంలో ఇప్పటికే తొలగించాల్సిన ఉద్యోగుల జాబితాను తయారు చేయాల్సిందిగా డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్లకు ఆదేశాలు అందాయి. అయితే దీనిపై వ్యాఖ్యానించడానికి మెటతా ప్రతినిధులు నిరాకరిస్తున్నారు. ఎంతమందిని తొలగిస్తున్నారనే వివరాలు వచ్చే వారంలో ఖరారు కావచ్చని తెలుస్తోంది. ఇటీవల మెటా యాడ్ రెవెన్యూ తగ్గిపోయింది. దీంతోనే తాజా కోతలు ఉన్నట్లు తెలుస్తోంది. మార్క్ జుకర్ బర్గ్ తను మూడో బిడ్డ పేరెంటల్ లీవ్ పై వెళ్లే ముందు ఉద్యోగుల తొలగింపు ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆర్ధిక మందగమనం, ఆర్థికమాంద్యం వస్తుందనే కారణంగా ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. ఖర్చులను తగ్గించుకోవాలనే ఆలోచనతో ఇలా చేస్తున్నాయి. జనవరిలో మైక్రోసాఫ్ట్ 10,000 మంది, 5 శాతం ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అమెజాన్ కూడా 18,000 మందిని తొలగించింది. మెటా గతేడాది చివర్లో 11,000 ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఇటీవల యాహూ కూడా 20 శాతం సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.