Pakistan Gets Chinese J-10C Fighter Jets: తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నా.. ప్రజలు తినేందుకు తిండి కూడా అందించే పరిస్థితుల్లో లేకున్నా కూడా దాయాది దేశం పాకిస్తాన్ తన సైన్యాన్ని ఆధునీకీకరించుకుంటోంది. తన ఆప్తమిత్ర దేశం చైనా నుంచి ఆయుధానలు కొంటోంది. ఇదిలా ఉంటే భారతదేశం, ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధవిమానాలకు ధీటుగా భావిస్తున్న చైనాకు చెందిన జే-10సీ ఫైటర్ జెట్లను కొనుగోలు చేసింది. గత మార్చిలో మొదటి విడతగా చైనా నుంచి ఆరు జే-10సీ ఫైటర్ జెట్లను పొందింది.…
Live streaming Of Supreme Court Constitution Bench Hearings: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 27 నుంచి రాజ్యాంగ ధర్మాసనం విచారించే అన్నీ కేసుల విచారణను తన వెబ్ సైట్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇటీవల సీజేఐగా పదవీ విరమణ చేసిన ఎన్వీ రమణ, పదవీ విరమణ రోజు సుప్రీంకోర్టు తన విచారణలను లైవ్ స్ట్రీమింగ్ చేసింది. దీంతో ఓ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. ఇకపై రాజ్యాంగ ధర్మాసనం విచారించే ప్రముఖ కేసులన్నింటిని ప్రత్యక్ష ప్రసారం…
Petition in Kerala High Court on India Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ గత వైభవం కోసం, పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ ‘ భారత్ జోడో యాత్ర’ను ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన ఈ యాత్ర 14వ రోజుకు చేరింది. మొత్తం 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా 3570 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర జరగనుంది. కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన…
pakistan- petrol rates increased again: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది దాయాది దేశం పాకిస్తాన్. శ్రీలంక ఆర్థిక పరిస్థితికి దగ్గర్లో ఉంది. మరో రెండు నెలల్లో పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతోందని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పాకిస్తాన్ ను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టేక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. ద్రవ్యోల్భనం దెబ్బతిన్న కారణంగా మరోసారి పాక్ ప్రభుత్వం మరోసారి పెట్రోల్ ధరలను పెంచింది. బుధవారం లీటర్ పెట్రోల్ పై 1.54 పాకిస్తాన్ రూపాయలను పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్…
Congress President Election: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఆ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి నిరాకరించడంతో ఈ సారి గాంధీయేతర కుటుంబం నుంచి అధ్యక్షుడు వచ్చే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం రాజస్థాన్ సీఎంగా ఉన్న అశోక్ గెహ్లాట్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. గాంధీ కుటుంబానికి వీర విధేయుడని అశోక్ గెహ్లాట్ కు పేరుంది. అయితే అశోక్ గెహ్లాట్ మాత్రం ఇటు సీఎంగా, అటు పార్టీ అధ్యక్షుడిగా రెండు…
Delhi Accident: ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు డివైడర్ పై నిద్రిస్తున్న వారిపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు డివైడర్ పై నిద్రిస్తున్న వారిపైకి వెళ్లింది. దీంతో నిద్రిస్తున్న నలుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ట్రక్కును గుర్తించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరు అక్కడిక్కడే మరణించగా.. తీవ్రంగా గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించగా మరో ఇద్దరు మరణించారు.
Students Self Distraction-Huge protest at Lovely Professional University:ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అలహావబాద్ యూనివర్సిటీలో తారాచంద్ హస్టల్ లో ఓ విద్యార్థి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఫీజు పెంపు నిర్ణయం వల్లే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్య విషయం యూనిర్సిటీ మొత్తం వ్యాపించడంతో విద్యార్థులంతా నిరసన, ఆందోళనలు చేపట్టారు. విద్యార్థులు ఫీజు పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అయితే మరణించిన విద్యార్థి జయ కపూర్ యూనివర్సిటీకి చెందిన వాడు కాదని.. హాస్టల్ లో…
One Person Dying Of Hunger Every Four Seconds: ప్రపంచంలో ప్రస్తుత పరిణామలు తీవ్ర ఆహార సంక్షోభానికి దారి తీస్తున్నాయి. కోవిడ్ 19, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, వాతావరణ మార్పులు వ్యవసాయ రంగంపై, ఆహార భద్రతపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. చాలా దేశాలు ఆహార ధాన్యాల కొరతతో అల్లాడుతున్నాయి. పలు దేశాలు వారి ప్రజల ఆహార భద్రత కోసం ఎగుమతులను కూడా నిషేధిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రపంచంలో ప్రతీ నాలుగు సెకన్లకు ఒకరు ఆకలితో మరణిస్తున్నారని 200 మందికి పై ఎన్జీవోలు మంగళవారం హెచ్చరించారు. ప్రపంచంలో…
Lioness kills 15-year-old boy in Gujarat: గుజరాత్ అమ్రేలి జిల్లాలో సింహాలు బాలుడిని చంపేశాయి. వావ్డీ గ్రామానికి చెందిన రాహుల్ మోస్వానియా అనే 15 ఏళ్ల బాలుడిపై సింహాలు దాడి చేసి చంపేసినట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. గ్రామ శివారులోని రహదారి గుండా నడుచుకుంటూ వస్తున్న సయమంలో బాలుడిపై సింహాలు ఒక్కసారిగా దాడి చేశాయి. తీవ్రగాయాల పాలైన రాహుల్ చనిపోయాడు. మరణించిన బాలుడి తల్లిదండ్రులు వ్యవసాయ కార్మికులుగా పనిచేస్తారు. సింహాలను బంధించేందుకు బోనులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆసియాటిక్ సింహాలకు…
Rajasthan Congress crisis: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు రాజస్థాన్ కాంగ్రెస్ లో చిచ్చు పెట్టేలా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని సీఎం అశోక్ గెహ్లాట్ చేపడుతారనే వార్తల నేపథ్యంలో రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమాలోచన చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి తన సీఎం అశోక్ గెహ్లాట్ నామినేషన్ దాఖలు చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరో వైపు యువనేత సచిన్ పైలెట్ రాజస్థాన్ కు కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఆ పార్టీలో వార్తలు గుప్పుమంటున్న నేపథ్యంలో.. అశోక్ గెహ్లాట్ తన పదవిని కాపాడుకునే…