Rahul Gandhi: బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉంటుందని కలలు కంటోందని రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ పని అయిపోయిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. సోమవారం లండన్ లో జరిగి చాథమ్ హౌస్ థింక్ ట్యాంక్‌లో ఆయన ప్రసంగించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నదని గుర్తు చేశారు. బీజేపీ 2014లో అధికారంలోకి రాకముందు తాము అధికారంలో ఉన్నామని, అయితే బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉంటుందని అనుకుంటున్నారని, అది ఎప్పటికీ జరగదని అన్నారు.
Read Also: Extramarital Affair: భర్త బయటికెళ్లగానే.. భాయ్ ప్రెండ్కు ఫోన్.. సీన్ కట్ చేస్తే
బీజేపీ సైద్ధాంతిక సంస్థ ఆర్ఎస్ఎస్ పై విమర్శలు గుప్పించారు రాహుల్ గాంధీ. ఆర్ఎస్ఎస్, ముస్లిం బ్రదర్ హుడ్ తరహాలో నిర్మించబడిందని, అధికారంలోకి రావడానికి ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకుని, ఆ తరువాత ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తోందని ఆరోపించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఏం జరుగుతోందో, ఇండియా-చైనాల మధ్య అదే జరుగుతోందని ఆయన అన్నారు. యూరప్, అమెరికాలో సంబంధాలు పెట్టుకోవడం రష్యాకు ఇష్టం లేదని, అందుకే ఉక్రెయిన్ సమగ్రతను దెబ్బతిస్తోందని, ఇదే విధంగా భారత్ అమెరికాతో సంబంధాలు పెట్టుకోవద్దని చైనా లడాఖ్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువ్వుతోందని రాహుల్ గాంధీ అన్నారు.
దేశంలో మీడియా, న్యాయవ్యవస్థ, పార్లమెంట్, ఎన్నికల కమిషన్ అన్నీ ప్రమాదంలో ఉన్నాయని, బీజేపీ అన్నింటిని నియంత్రిస్తోందని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ మత ఛాందసవాద ఫాసిస్ట్ సంస్థ దేశంలోని అన్ని సంస్థల్ని స్వాధీనం చేసుకుంటోందని, ప్రజాస్వామ్య పోటీ పూర్తిగా మారిపోయిందని ఆయన ఆరోపించారు. నా ఫోన్ ను పెగాసస్ ద్వారా ట్యాప్ చేస్తున్నారంటూ మరోసారి వ్యాఖ్యానించారు. దేశంలో దళితులు, గిరిజనులు, మైనారిటీలపై దాడులు చేస్తున్నారని బీజేపీపై విమర్శలు గుప్పించారు.