Jani Master: ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. జానీ మాస్టర్‌కు ఊహించని షాక్!
- ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం
- జానీ మాస్టర్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ సహాయ నిరాకరణ
- ఏ సినిమా చేసినా 23 క్రాఫ్ట్‌లు పనిచేయవని ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jani Master Faces Film Federation Boycott: ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఫెడరేషన్.. ఆయనకు సహాయ నిరాకరణ ప్రకటించింది. దేశవ్యాప్తంగా జానీ మాస్టర్ ఏ సినిమాలో పనిచేసినా.. సినీ పరిశ్రమకు చెందిన మిగతా 23 క్రాఫ్ట్‌ల సభ్యులు ఆ చిత్రానికి సహకరించరని ఫెడరేషన్ ప్రకటించింది. ఈ విషయాన్ని నిర్మాతలకు కూడా అధికారికంగా తెలియజేస్తామని ఫెడరేషన్ తెలిపింది. జానీ మాస్టర్ తన భార్య పదవిని అడ్డుపెట్టుకుని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఫిల్మ్ ఫెడరేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఫెడరేషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ.. సభ్యుల అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని పలువురు ఫెడరేషన్ ప్రతినిధులు జానీ మాస్టర్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నెల 12న జానీ చేసిన వ్యాఖ్యలు, సభ్యులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన తీరు, సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడంపై మండిపడింది. ఈ చర్యలకు వివరణ ఇవ్వాలంటూ జులై 14న విచారణకు పిలిచినా ఎందుకు రాలేదని మండిపడింది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఫెడరేషన్ నిర్ణయించింది. ఈ వివాదంపై జానీ మాస్టర్‌కు ఇప్పటికే ఫెడరేషన్ వివరణ కోరుతూ నోటీసు జారీ చేసింది. నిర్ణయించిన గడువులోగా ఆయన సరైన వివరణ ఇవ్వకపోతే.. శాశ్వతంగా బహిష్కరిస్తామని హెచ్చరించింది.
Also Read
- Mohanlal : మోహన్ లాల్- జీతూ జోసెఫ్ క్రేజీ ప్రాజెక్ట్ రీ - ఓపెన్
- Kareena - Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
- Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది
- బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ఈ పరిణామం టాలీవుడ్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఒకవేళ ఫెడరేషన్ ప్రకటించిన సహాయ నిరాకరణ అమల్లోకి వస్తే.. జానీ మాస్టర్‌తో సినిమా చేయాలనుకునే నిర్మాతలు, దర్శకులకు ఇది పెద్ద అడ్డంకిగా మారనుంది. పరిశ్రమలోని వివిధ క్రాఫ్ట్‌ల మధ్య ఐక్యత, సంఘాల నిర్ణయాల ప్రాధాన్యత మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అందరి దృష్టి జానీ మాస్టర్ ఎలా స్పందిస్తాడనే అంశంపై ఉంది. జానీ మాస్టర్ వివరణ తర్వాత ఫెడరేషన్ ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Mohanlal : మోహన్ లాల్- జీతూ జోసెఫ్ క్రేజీ ప్రాజెక్ట్ రీ – ఓపెన్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Pawan Kalyan – Vangaveeti Radhakrishna Meet: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. పవన్‌తో వంగవీటి రాధా భేటీ
-
EC: ఎన్నికల సంఘాన్ని ఏలుతున్నదెవరు?
-
Protein Beer: మందుబాబులు, మందుపాపలు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్..!ప్రోటీన్ బీర్ మంచిదేనా?
ట్రెండింగ్
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?