physical assault on minor girl in madhya pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 16 ఏళ్ల బాలిపై సామూహిక అత్యాచారం జరిగింది. రాష్ట్రంలో రేవా జిల్లాలో శనివారం 16 ఏళ్ల బాలికను ఆరుగురు వ్యక్తుల అపహరించారు. వీరిలో ఇద్దరు మైనర్ బాలురు కూడా ఉన్నారు. వీరందరిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు తనకు కాబోయే భర్తతో కలిసి శనివారం మధ్యాహ్నం ఆలయానికి వెళ్లింది. ఈ సమయంలో దంపతులు ఆలయం సమీపంలో కూర్చొని ఉండగా.. నిందితులంతా కలిసి బాలికను అపహరించారు. సమీపంలోని అటవీ ప్రాంతానికి…
Magnitude 7.5 Earthquake Hits Mexico: లాటిన్ అమెరికా దేశం మెక్సికోలో భారీ భూకంపం వచ్చింది. మైకోకాన్ రాష్ట్రంలోని లా స్లతాసిటీ డియోరెలోస్ కు దక్షిణ-ఆగ్నేయంగా 46 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. రిక్టర్ స్కేల్ పై 7.5 తీవ్రతతో భూకంప రావడంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. మిచోకాన్ తీరానికి సమీపంలో సునామీ వచ్చే అవకాశం ఉన్నట్లు యూఎస్ సునామీ హెచ్చరికలు వ్యవస్థ వెల్లడించింది.
Rahul Gandhi-Congress Party Presidential Election: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే పదవిని చేపట్టాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. పార్టీ సీనియర్ లీడర్ల నుంచి.. సామాన్య కార్యకర్త వరకు రాహుల్ గాంధీనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయితే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పలు రాష్ట్రాల కాంగ్రెస్ యూనిట్లు రాహుల్ గాంధీ అధ్యక్షుడు కావాలని ఏకగ్రీవం తీర్మానాలు చేస్తున్నారు. ఇప్పటికే రాజస్థాన్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలు తీర్మానాలు చేశాయి.
China Tests "Flying" Cars: గత కొన్నేళ్లుగా వాహనరంగంలో వివిధ మార్పులు వస్తున్నాయి. అయితే ఎప్పటి నుంచో ఎగిరే కార్లు మాత్రం చాలా కాలంగా కలగానే ఉన్నాయి. ఎగిరే కార్లను తయారు చేసేందుకు కొన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే భవిష్యత్తుల ఎగిరే కార్లు తప్పకుండా అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. తాజాగా చైనా చేసిన ఓ ప్రయోగం ఎగిరే కార్లు ఇంకెంతో దూరంలో లేవని చెబుతోంది. సిచువాన్ ప్రావిన్సులోని చెంగ్డులోని సౌత్ వెస్ట్ జియాటాంగ్ యూనివర్సిటీకి చెందిన చైనీస్ పరిశోధకులు గతవారం ఎగిరే…
Red Sandal Smuggling: పుష్ప తరహాలో ఎర్ర చందనాన్ని స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు కస్టమ్స్ అధికారులు. దక్షిణాది నుంచి అక్రమంగా తరలించిన ఎర్ర చందనాన్ని విదేశాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్న ముఠాను పట్టుకున్నారు. కొట్ల విలువ చేసే ఎర్రచందనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముంబై, హర్యానాల్లో దేశం దాటించేందుకు గోదాముల్లో సిద్ధంగా ఉన్న ఎర్ర చందనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
President Draupadi Murmu pays tribute to Queen Elizabeth II: భారతప్రజల తరుపున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, యూకే రాణి ఎలిజబెత్ 2కు నివాళులు అర్పించారు. ద్రౌపది ముర్ము క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియల కోసం లండన్ వెళ్లారు. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ హాల్ లో ఉన్న రాణి భౌతికకాయానికి భారత ప్రజల తరుపున ఆమె నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ఈ నెల 17 నుంచి 19 వరకు యూకేలో అధికారిక పర్యటనలో ఉన్నారు. సోమవారం జరిగే క్వీన్ ఎలిజబెత్ అంతక్రియలకు…
Goa Politics: గోవాలో కాంగ్రెస్ దాదాపుగా ఖాళీ అయిపోయింది. ఈ ఏడాది మొదట్లో గోవాలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మరోసారి చతికిలపడింది. ఇదిలా ఉంటే గోవాలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం ఎమ్మెల్యేలు దిగంబర్ కామత్, మైఖేల్ లోబో, డెలిలా లోబో, కేదార్ నాయక్, రాజేష్ ఫాల్దేశాయ్, సంకల్ప్ అమోంకర్, రుడాల్ఫ్ ఫెర్నాండెజ్, అలెక్సో సిక్వేరాలు కాంగ్రెస్ శాససభా పక్షం సమావేశంలో తీర్మాణం చేసి బీజేపీ…
Madrasa survey in uttar pradesh: ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మదర్సాలపై సర్వే చేపట్టింది. ముఖ్యంగా రాష్ట్రప్రభుత్వం గుర్తించని మదర్సాల విషయంలో కఠినంగా వ్యవహరించనుంది ప్రభుత్వం. ఇదిలా ఉంటే కొన్ని రాజకీయ పక్షాల నుంచి దీనిపై అభ్యంతరం వచ్చింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఈ సర్వేను మినీ ఎన్నార్సీగా అభివర్ణించారు. అయితే గుర్తింపులేని మదర్సాల సర్వే విషయంలో మాకు ఏం అభ్యంతరం లేదని జమియత్ ఉలామా-ఏ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ ఆదివారం తెలిపారు.…
J&K L-G inaugurates cinema halls in Pulwama, Shopian: కాశ్మీర్ ప్రాంతం సినిమా షూటింగులకు ఫేమస్ కానీ.. అక్కడి ప్రజలు మాత్రం సినిమాకు దూరం అయ్యారు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో దశాబ్ధాలుగా నెలకొని ఉన్న ఉగ్రవాదం కారణంగా అక్కడి థియేటర్లు అన్ని మూతపడ్డాయి. మళ్లీ ఎవరూ కూడా థియేటర్లను తెరవడానికి ప్రయత్నించలేదు. ఆర్టికల్ 370 రద్దు తరవాత జమ్మూ కాశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు భద్రతా బలగాలు చెక్ పెడుతున్నాయి.
Iranian women take off Hijab, protest Mahsa Amini's death: ఇరాన్ దేశంలో మహిళల ఆందోళనలు మిన్నంటాయి. దేశవ్యాప్తంగా భారీ ఎత్తున నిరసనలు చోటు చేసుకున్నాయి. రాజధాని టెహ్రాన్ లో భారీ ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు మహిళలు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హిజాబ్ తీసేసి మహిళలు ఆందోళనలో పాల్గొన్నారు. హిజాబ్ ధరించలేదని..మహ్స అమినీ అనే 22 ఏళ్ల అమ్మాయిని మోరాటిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆమె ఆ తరువాత కోమాలోకి వెళ్లి శుక్రవారం మరణించింది. దీనిపై దేశంలో పెద్ద ఎత్తున…