Actress Amani Joins BJP: ప్రముఖ సినీనటి ఆమని బీజేపీలో చేరింది. శనివారం బీజేపీ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు రాంచందర్‌రావు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకుంది. తెలుగు సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న ఆమని రాజకీయంలోకి అడుగుపెట్టింది. బీజేపీలో ఆమని ఎంట్రీ ఆసక్తికరంగా మారింది. ఆమెకు ఉన్న అభిమాన బలం, సామాజిక అంశాలపై గతంలో ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు బీజేపీకి ఉపయోగపడతాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతో నటి భేటీ అయ్యింది. ఈ సమావేశంలోనూ పార్టీలో చేరాలని నటి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ భేటీ అనంతరం పార్టీలోకి నటి ఎప్పుడు వస్తుంది? అనే ప్రశ్న మొదలైంది. తాజాగా ఈ ప్రశ్నకు తెరపడింది.
READ MORE: Vrusabha Trailer : గ్రాండ్ విజువల్స్‌తో..వింటేజ్ మోహన్ లాల్ ‘వృషభ’ ట్రైలర్ రలిజ్..
“నాకు చాలా సంతోషంగా ఉంది.. మోడీ ఎన్నో మంచి పనులు చేస్తున్నారు.. మనం భారతీయులం అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది.. నేను కూడా మంచి పనులు చేయాలని, ప్రజలకు సేవ చేయాలని పార్టీ లో చేరాను.. వాళ్ళ అడుగు జాడల్లో నడవాలని ఇష్టపడుతున్నా.. సనాతన ధర్మం గురుంచి కూడా మోడీ పాటు పడుతున్నారు..” అని ఆమని మీడియాతో తెలిపింది.
READ MORE: Vrusabha Trailer : గ్రాండ్ విజువల్స్‌తో..వింటేజ్ మోహన్ లాల్ ‘వృషభ’ ట్రైలర్ రలిజ్..
ఇక, నటి ఆమని తెలుగు సినీ రంగంలో 1992లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం “జంబ లకిడి పంబ”తో కథానాయికగా అరంగేట్రం చేసింది. ఈ సినిమాకు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఆమె కెరీర్ ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ.. తన అభినయంతో ప్రేక్షకులను మెప్పించి విజయవంతమైన నటిగా ఎదిగింది. ఆమె నటనకు గుర్తింపుగా రెండు నంది అవార్డులు, ఒక ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. కొన్ని కాలం విరామం తర్వాత ‘ఆ నలుగురు’ వంటి చిత్రాలతో రీ-ఎంట్రీ ఇచ్చింది. ‘చావు కబురు చల్లగా’, ‘సుభ సంకల్పం’, ‘MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి)’ వంటి చిత్రాల్లోనూ నటించింది. ఆమని తన కెరీర్ ప్రారంభ రోజుల్లో అనేక సవాళ్లను ఎదుర్కొని నటిగా గుర్తింపుపొందింది. ఆమె ఈ ఏడాదిలో ‘School Life’, ‘Bramhanda’, ‘Yemainade Pilla’, ‘Meghalu Cheppina Prema Katha’, ‘Mathru’, ‘Naari: The Women’, ‘Baapu’, ‘Dheerga Ayushman Bhava’ వంటి చిత్రాల్లో నటించింది. ఇందులో కొన్ని విడుదల కాగా.. మరిన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.