జో బైడెన్ ప్రభుత్వంపై మరోసారి ట్రంప్ నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం ఖజానాను దోచుకుందని ట్రంప్ ఆరోపించారు. శనివారం జరిగిన ఒక రాజకీయ కార్యక్రమంలో అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడారు. ఒక సంవత్సరం క్రితం వరకు మన దేశం ఆర్థికంగా చచ్చిపోయిందని.. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదిగిందని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత ఉన్నత దేశంగా ఉందని.. అధ్యక్షుడిగా ఉన్న తానే అమెరికాను మొదటి స్థానంలో ఉంచినట్లు చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు మరో బిగ్ షాక్.. అవినీతి కేసులో 17 ఏళ్లు జైలు శిక్ష
తన విధానాల కారణంగానే దేశం మళ్లీ పునరావృతం అయిందని పేర్కొన్నారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్, కాంగ్రెస్‌లోని దాని మిత్రదేశాలు ఆర్థిక దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. దాదాపు బైడెన్ కాలంలో ట్రిలియన్ల డాలర్లు దుర్వినియోగం అయ్యాయని పేర్కొన్నారు. బైడెన్ దుష్ప్రవర్తన కారణంగానే ధరలు పెరగడానికి ఆజ్యం పోసినట్లైందని తెలిపారు. అంతేకాకుండా అమెరికన్లపై అదనపు ఆర్థిక భారం పడిందని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Mallika Sherawat: వైట్‌హౌస్‌లో ట్రంప్ విందుకు హాజరైన మల్లికా షెరావత్.. ఫొటోలు వైరల్
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రపంచ దేశాలపై వాణిజ్య యుద్ధం ప్రకటించారు. ఆయా దేశాలపై భారీగా సుంకాలు పెంచేశారు. దీంతో అమెరికాకు భారీగా ఆదాయం వచ్చి పడింది. ప్రస్తుతం భారతదేశంపై 50 శాతం సుంకాలు విధించారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
#WATCH | US President Donald Trump says, "One year ago, our country was dead. Now we are the hottest country anywhere in the world because we finally have a President who puts America first…"
(Source: The White House) pic.twitter.com/ojWI7mnj70
— ANI (@ANI) December 20, 2025