Pakistan Gets Chinese J-10C Fighter Jets: తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నా.. ప్రజలు తినేందుకు తిండి కూడా అందించే పరిస్థితుల్లో లేకున్నా కూడా దాయాది దేశం పాకిస్తాన్ తన సైన్యాన్ని ఆధునీకీకరించుకుంటోంది. తన ఆప్తమిత్ర దేశం చైనా నుంచి ఆయుధానలు కొంటోంది. ఇదిలా ఉంటే భారతదేశం, ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధవిమానాలకు ధీటుగా భావిస్తున్న చైనాకు చెందిన జే-10సీ ఫైటర్ జెట్లను కొనుగోలు చేసింది. గత మార్చిలో మొదటి విడతగా చైనా నుంచి ఆరు జే-10సీ ఫైటర్ జెట్లను పొందింది. తాజాగా మరో విడత జే-10సీ యుద్ధ విమానాలు పాకిస్తాన్ సైన్యంలో చేరాయి. రెండో విడతలో కూడా ఆరు యుద్ధవిమానాలను చైనా, పాకిస్తాన్ కు అందించింది.
Read Also: Supreme Court: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఇక ఆ కేసులన్నీ ప్రత్యక్ష ప్రసారం
రాఫెల్ కు ధీటుగా జే-10 యుద్ధ విమానాలు నిలుస్తాయని పాకిస్తాన్ భావిస్తోంది. అయితే ఈ ఫైటర్ జెట్లపై తొలి నుంచి అనుమానాలు ఉన్నాయి. చైనా చెబుతున్న విధంగా ఇవి అంత మెరుగైన ప్రదర్శన చేయకపోవచ్చని.. రాఫెల్ కు ధీటుగా ఉండకపోవచ్చని యుద్ధరంగ నిపుణులు చెబుతున్నారు. 2021 జూన్ నెలలోనే పాకిస్తాన్, చైనా దేశాల మధ్య యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం జరిగింది. ఆరు నెలల తర్వాత డిసెంబర్ 2021లో పాకిస్తాన్ అధికారికంగా చైనాతో యుద్ధ విమానాల ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. సింగిల్ ఇంజిన్ మల్టీరోల్ ఎయిర్ క్రాఫ్ట్ అన్ని వాతావరణ పరిస్థితుల్లో, ఎయిర్ టూ ఎయిర్ కాంబాక్ట్ ఆపరేషన్స్ చేపట్టగలదు. పాకిస్తాన్ సైన్యంతో ప్రస్తుతం ఉన్న అత్యాధునిక ఫైటర్ జెట్ జే-10సీ.
చైనాకు చెందిన ఈ ఫైటర్ జెట్ పాకిస్తాన్ వైమానికి దళబలన్నా పెంచుతుందని ఆ దేశం భావిస్తోంది. భారత్ రాఫెల్ విమానాల డీల్ లో విమానాలతో పాటు సాంకేతికతను పొందిన విధంగానే.. పాకిస్తాన్ జే-10సీ విమానాల డీల్ లో ఫైటర్ జెట్లతో పాటు సాంకేతికతను కూడా పొందుతోంది. జే-10సీ పాకిస్తాన్ సైన్యంలో చేరడాన్ని చారిత్రాత్మక క్షణంగా అభివర్ణించింది పాకిస్తాన్ ఆర్మీ. ఇటీవల అమెరికా కూడా పాకిస్తాన్ కు ఎఫ్-16 అమ్ముతున్నట్లు ప్రకటించింది.