Supreme Court: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఇక ఆ కేసులన్నీ ప్రత్యక్ష ప్రసారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Live streaming Of Supreme Court Constitution Bench Hearings: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 27 నుంచి రాజ్యాంగ ధర్మాసనం విచారించే అన్ని కేసుల విచారణను తన వెబ్ సైట్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇటీవల సీజేఐగా పదవీ విరమణ చేసిన ఎన్వీ రమణ, పదవీ విరమణ రోజు సుప్రీంకోర్టు తన విచారణలను లైవ్ స్ట్రీమింగ్ చేసింది. దీంతో ఓ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. ఇకపై రాజ్యాంగ ధర్మాసనం విచారించే ప్రముఖ కేసులన్నింటిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం..కోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారాలకు అనుకూలంగా సుప్రీంకోర్టు 2018లో తీర్పును ఇచ్చింది. ఇది ప్రస్తుతం అమలులోకి వచ్చే ప్రక్రియ ప్రారంభం అయింది.
Read Also: Nizamabad BJP: ఎన్నికల్లో సీటు ఆశించే నేతలకు బీజేపీ దిమ్మదిరిగే పరీక్ష పెడుతుందా?
Also Read
- PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
భారత ప్రధాన న్యాయమూర్తిగా యూయూ లలిత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఇది కూడా ఒకటి. దేశంలో ప్రముఖ కేసులైన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి ఆర్టికల్ 370 రద్దు వంటి కేసుల విచారణను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడవచ్చు. ఆగస్టు 26న అప్పటి సీజేఐ ఎన్వీ రమణ, పదవీ విరమణ రోజున కోర్టు విచారణలు లైవ్ స్ట్రీమింగ్ జరిగాయి. కొన్ని కేసులు ఏళ్ల తరబడి పెడింగ్ లో ఉండటంతో ఎన్వీ రమణ.. పలు కేసులపై రాజ్యాంగ ధర్మాసనాలు ఏర్పాటు చేశారు.
గతంలో కోవిడ్ మహమ్మారి సమయంలో కోర్టులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనిచేశాయి. వర్చువల్ గా కేసుల విచారణ జరిగింది. కోర్టుల విచారణలో సాంకేతికతను విరివిగా ఉపయోగించారు. ఇది కూడా కోర్టు కేసులను లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి ఓ కారణంగా కనిపిస్తోంది. గతంలో కూడా పలువురు ప్రజా, రాజ్యాంగ ప్రాముఖ్యత ఉన్న కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని న్యాయమూర్తులకు లేఖలు రాశారు. సమాచార స్వేచ్ఛ కూడా ప్రతీ పౌరుడి ప్రాథమిక హక్కుల్లో ఒకభాగంగా ఉందని.. ఇటువంటి కేసుల్లో విచారణను ప్రజలు తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో ఇకపై రాజ్యాంగ ధర్మాసనం కేసుల్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
తాజావార్తలు
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!