Kerala man sentenced to 142 years in jail for POCSO Case: మైనర్పై లైంగిక దాడికి పాల్పడిన ఓ వ్యక్తి కేరళలోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం 142 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కేరళలోని పత్తినాంతిట్టకు చెందిన 41 ఏళ్ల వ్యక్తికి ఈ శిక్షను విధించింది. పదేళ్ల మైనర్ పిల్లవాడిపై రెండేళ్ల పాటు లైంగిక వేధింపులకు పాల్పడినందుకు కోర్టు ఈ శిక్ష విధించింది. దీంతో పాటు రూ. 5 లక్షల జరిమానాను విధించింది. నిందితుడు ఒక వేళ రూ.5 లక్షల…
5G services in India: దేశంలో 5జీ సేవలను అక్టోబర్ 1 నుంచి ప్రధాని నరేంద్రమోదీ అట్టహాసంగా ప్రారంభించారు. దేశంలో సాంకేతిక విప్లవానికి 5జీ నాంది పలుతుకుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే దేశంలో ప్రస్తుతం 13 నగరాల్లో మాత్రమే 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అయితే మొదటగా ఎయిర్ టెల్ వినియోగదారులు మాత్రమే 5జీ సేవలను ఉపయోగించుకోనున్నారు. ప్రస్తుతం 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన నగరాల్లో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, చండీగఢ్. గురుగ్రామ్, హైదరాబాద్, లక్నో, పూణే, గాంధీనగర్, అహ్మదాబాద్,…
Y-category security for RSS leaders: రాడికల్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్పైఐ) దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో దాడులు జరిగాయి. ఎన్ఐఏ, ఈడీలు సంయుక్తంగా దాడులు చేసి పీఎఫ్ఐ కీలక నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేసింది. వారివద్ద నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది. దేశంలో మతపరమైన ఉద్రిక్తతలను పెంచడంతో పాటు ముస్లిం యువతను లష్కరే తోయిబా, ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ప్రేరేపిస్తోందనే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్, టర్కీ నుంచి నిధులను అక్రమంగా సేకరిస్తోందని విచారణలో తేలింది.…
Congress President Elections: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. అనేక మలుపులు తిరుగుతున్న ఈ ఎన్నికలు ప్రస్తుతం ఓ కొలిక్కివచ్చాయి. కాంగ్రెస్ అధ్యక్షఎన్నికల కోసం మల్లికార్జున ఖర్గేతో పాటు శశిథరూర్, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి కేఎన్ త్రిపాఠి నామినేషన్లు దాఖలు చేశారు. తాజాగా త్రిపాఠి నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో పోటీలో ఇద్దరే మిగిలారు. వీరిద్దరి మధ్యే పోటీ నెలకొననుంది.
Putin Comments On India: ఉక్రెయిన్ లోని జోపోరిజ్జియా, ఖేర్సన్, లూహాన్స్క్, డోనెట్స్క్ నాలుగు ప్రాంతాలను అధికారికంగా రష్యా తనలో కలుపుకుంది. అయితే దీనిపై యూఎస్ఏతో పాటు యూరోపియన్ దేశాలు మండిపడుతున్నాయి. రష్యాను ఆర్థికంగా ఏకాకిని చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది అమెరికా. రష్యా బెదిరింపుకు భయపడేది లేదని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ వ్యాఖ్యానించారు. అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు రష్యాపై మరింతగా ఆంక్షలు విధించేందుకు సిద్ధం అయ్యాయి. జి 7 దూశాలు కూడా రష్యా, ఉక్రెయిన్ భూభాగాలను ఆక్రమించుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Halal Meat Boycott isuue in Karnataka: కర్ణాటకలో మరో వివాదం రాజుకుంటోంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే అక్కడ హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. తాజాగా దసరా ముందు మరో వివాదం ఏర్పడబోతోంది. దసరా ముందు రోజు ఆయుధ పూజ సందర్భంగా హలాల్ మాంసాన్ని బహిష్కరించాలంటూ హిందూ జనజాగృతి సమితి, హిందువులను కోరుతోంది. హాలాల్ రహిత దసరా అంటూ ఈ సంస్థ ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. అక్టోబర్ 4న ఆయుధపూజ జరుపుకుంటారు హిందువులు. ఈ సమయంలో…
Pakistan airlines order to cabin crew is ‘wear proper undergarments’: పాకిస్తాన్ దేశం అప్పుడప్పుడు వింత ఆదేశాలు జారీ చేస్తుంటుంది. చెప్పాలనుకున్నది ఒకటైతే మరో విధంగా చెబుతూ అబాసుపాలు అవుతుంది. తాజాగా పాకిస్తాన్ ఇంటర్నెషనల్ ఎయిర్లైన్స్ (పీఐఏ) ఇచ్చిన ఆదేశాలు ఆ దేశంలో విమర్శలకు గురువుతున్నాయి. విమాన సిబ్బందికి డ్రెస్ కోడ్ గురించి ఆదేశాలు జారీ చేసింది పీఐఏ. ఈ ఆదేశాల పట్ల అక్కడి మీడియా, నెటిజెన్లు పీఐఏ వ్యవహారశైలిపై విరుచుకుపడుతున్నాయి. పీఐఏ సిబ్బంది యూనిఫాం కింద సరైన ‘లోదుస్తులు’ ధరించడం…
Asaduddin Owaisi assault case అసదుద్దీన్ ఓవైసీ హత్యా నిందితులకు బెయిల్.. యూపీ ప్రభుత్వ స్పందన కోరిన సుప్రీంకోర్టుఈ ఏడాది ఫిబ్రవరిలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ పర్యటిస్తున్న ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీపై ఇద్దరు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఇద్దరు నిందితులకు తాజగా బెయిల్ లభించింది. అయితే వారికి బెయిల్ లభించడాన్ని సవాల్ చేస్తూ అసదుద్దీన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా శుక్రవారం ఈ అంశంపై సుప్రీంకోర్టు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర స్పందన కోరింది. న్యాయమూర్తులు ఎంఆర్…
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్ లోని తూర్పు ప్రాంతాలైన ఖేర్సన్, జపోరిజ్జియా, డోనెట్స్క్, లూహాన్స్క్ ప్రాంతాలను అధికారికంగా విలీనం చేస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ప్రకటించారు. రష్యాలో నాలుగు కొత్త ప్రాంతాలు చేరాయని ఆయన అన్నారు. ఉక్రెయిన్ తో ఏడు నెలల యుద్ధంలో ఆ దేశానికి చెందిన తూర్పు భాగాలను రష్యా పాక్షికంగా ఆక్రమించుకుంది. తాజాగా జరిగిన ప్రజాభిప్రాయ సేకరణతో ఉక్రెయిన్ లోని ఈ నాలుగు ప్రాంతాలు రష్యాలో అధికారికంగా విలీనం అయ్యాయి.
Malaysia-Bound Flight Delayed After Bomb Hoax At Delhi Airport: ఢిల్లీ నుంచి మలేషియా వెళ్లాల్సిన విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. మలేషియన్ ఎయిర్లైన్స్ ఎంహెచ్ 173 విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో ప్రయాణికుల్లో భయాందోళన వ్యక్తం అయ్యాయి. అయితే ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ ఈ బాంబు బెదిరింపులకు కారణం అయింది. దీంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన విమానం దాదాపుగా మూడు గంటల ఆలస్యంగా బయలుదేరింది. ఈ ఘటనకు కారణం అయిన నలుగురు ప్రయాణికులను పోలీసులు అరెస్ట్…