Lashkar Terrorist Killed In Encounter: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. పుల్వామా, షోఫియాన్ జిల్లాల్లో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం పుల్వామాలో సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులపైకి ఉగ్రవాదులు కాల్పలు జరిపారు. ఈ ఘటనలో విధి నిర్వహణలో ఉన్న ఒక పోలీస్ మరణించారు. సీఆర్పీఎఫ్ కు చెందిన సిబ్బంది గాయపడ్డారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. పుల్వామాలోని పింగ్లాన వద్ద సీఆర్పీఎఫ్, కాశ్మీర్ పోలీసుల నాకా పార్టీపై ఉగ్రవాదులు దాడులు చేశారు.
Mallikarjun Kharge Comments on congress president elections: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఏకాభిప్రాయంతో అధ్యక్షుడిని ఎన్నుకుంటే మంచిదని అన్నారు మల్లికార్జున ఖర్గే. ఇదే విషయాన్ని శశిథరూర్ కు చెప్పానని ఆయన అన్నారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు ఎవరూ కూడా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకోలేదని ఖర్గే అన్నారు. కొంతమంది సీనియర్ నాయకులు నన్ను పోటీ చేయాలని కోరారని ఆయన అన్నారు. నేను…
1984 One Of "Darkest Years" In Indian History says US Senator:ఆధునిక భారతదేశంలో 1984 సంవత్సరాన్ని చీకటి సంవత్సరంగా అభివర్ణించారు అమెరికా సెనెటర్ పాట్ టూమీ. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లు భారతదేశ చరిత్రలో ఓ మచ్చగా మిగిలిపోయిందని అన్నారు. సిక్కులపై జరిగిన అల్లర్లను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అక్టోబర్ 31, 1984న మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ఇద్దరు సిక్కు అంగరక్షకులు చంపిన తర్వాత పెద్ద ఎత్తున అల్లర్లు చోటు చేసుకున్నాయి. సిక్కులే టార్గెట్ గా…
EAM Jaishankar comments on Pakistan: విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ పాకిస్తాన్ పై మరోసారి విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)లో దూసుకెళ్తుంటే.. పాకిస్తాన్ మాత్రం ఇంటర్నేషనల్ టెర్రరిజం(ఐటీ)లో ఎక్స్పర్ట్ అని వ్యాఖ్యానించారు. గుజరాత్ వడోదరలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఇప్పడు ప్రపంచం ఉగ్రవాదంపై గతం కన్నా మెరుగైన అవగాహనతో ఉందని ఆయన అన్నారు. ప్రపంచం ఉగ్రవాదాన్ని సహించదని.. ఇప్పడు తీవ్రవాదాన్ని ఎగదోస్తున్న దేశాలు ఒత్తడిలో ఉన్నాయని ఆయన అన్నారు.
Islamabad magistrate issues arrest warrant against Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధం అవుతోంది. ఇమ్రాన్ ఖాన్ పై ఇస్లామాబాద్ మేజిస్ట్రేట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మహిళా న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఇస్లామాబాద్ కోర్టు అరెస్ట్ చేయాలని వారెంట్ జారీ చేసినట్లు పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. పీటీఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి కోల్పోయిన తర్వాత నుంచి పాకిస్తాన్ వ్యాప్తంగా పర్యటిస్తూ..పీఎం షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
Students Fall Ill After Eating Hostel food: బల్లి పడిన ఆహారం తిన్న విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని కోటాలో జరిగింది. కూరలో బల్లి పడిన ఆహారం తిన్న హాస్టల్ లోని విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గురువారం రాత్రి భోజనం చేసిన తర్వాత కళ్లు తిరగడంతో పాటు, వాంతులు బారిన పడ్డారు విద్యార్థినులు. 30 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కూరలో బల్లి…
Etela Rajender Comments On CM KCR: తెలంగాణలో బీజేపీ రాకెట్ వేగంతో దూసుకుపోతోందని అన్నారు బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. మునుగోడు గడ్డపై ఎగిరేది కాషాయజెండానే అని అన్నారు. ప్రజాసంబంధ పథకాలను కేసీఆర్ ఎప్పుడూ తీసుకురాలేదని.. పవర్ ఓరియెంటెడ్ పాలసీలనే తీసుకువస్తున్నారని విమర్శించారు. హుజూరాబాద్ ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్ కు ‘దళిత బంధు’ గుర్తుకు వచ్చిందని.. మునుగోడులో గిరిజనులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ‘గిరిజన బంధు’ ఇస్తా అంటున్నాడని ఎద్దేవా చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ లకు కూడా దళితబంధు ఇస్తానన్న మూర్ఖుడు…
BJP Worker Assassination In Kerala: కేరళ రాష్ట్రంలో సూపర్ హిట్ మూవీ ‘దృశ్యం’ మూవీ సీన్ రిపీట్ అయింది. దృశ్యం సినిమాలో ఓ శవాన్ని పోలీస్ స్టేషన్ లో ఫ్లోర్ కింద సమాధి చేయడం అందరికి గుర్తుండే ఉంటుంది. అయితే కేరళలో ఇలాంటి ఘటనే రిపీట్ అయింది. దృశ్యం మూవీని తలపించే విధంగా బీజేపీ కార్యకర్త మర్డర్ జరిగింది. ఇప్పుడు ఈ కేసు కేరళలో సంచలనంగా మారింది. బీజేపీ కార్యకర్తను దారుణంగా హత్య చేసి గోడలోపెట్టి ప్లాస్టరింగ్ చేశాడు నిందితుడు.
Dengue outbreak In Pakistan: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్.. ప్రస్తుతం రోగాల బారినపడింది. అక్కడ ప్రజలు అనారోగ్య సమస్యలకు ఎదుర్కొంటున్నారు. భారీ వరదలు, వర్షాల కారణంగా ఇప్పటికే అక్కడి ప్రజలు అంటువ్యాధులతో సతమతం అవుతున్నారు. తాజాగా పాకిస్తాన్ దేశం డెంగ్యూ కోరల్లో చిక్కుకుంది. దీనికి తోడు తీవ్ర మందుల కొరతను కూడా ఎదుర్కొంటోంది ఆ దేశం. పాకిస్తాన్ రాజధాని నగరం ఇస్లామాబాద్ లో గత 24 గంటల్లో 104 డెంగ్యూ కేసులు నమోదు అవ్వడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
Swachh Survekshan Awards 2022: దేశంలో వరసగా ఆరోసారి మధ్యప్రదేశ్ ఇండోర్ పరిశుభ్రమైన నగరంగా తొలిస్థానంలో నిలిచింది. తాజాగా ప్రకటించిన స్వచ్ఛ్ సర్వేక్షన్ అవార్డుల్లో ఇండోర్ నగరానికే పట్టం కట్టారు. సూరత్, నవీ ముంబై నగరాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. స్వచ్ఛ్ సర్వేక్షన్ అవార్డ్స్ 2022 అవార్డులను కేంద్రం శనివారం ప్రకటించింది. దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా వరసగా ఆరోసారి ఇండోర్ నగరంల నిలిచింది. ఆ తరువాతి స్థానాల్లో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్, మహారాష్ట్రలోని నవీ ముంబై నిలిచాయి. గతేడాది మూడో స్థానంలో…