Tata Tiago EV: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మరో ఎలక్ట్రిక్ వాహనాన్ని మార్కెట్ లోకి తీసుకువచ్చింది.. టాటా టియాగో ఈవీ ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అయింది.. ఇప్పటి వరకు కాంపాక్ట్ ఎస్ యూ వీ సెగ్మెంట్ లోనే వివిధ కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను తీసుకువచ్చాయి. అయితే తొలిసారిగా హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లో ఎలక్ట్రిక్ కారును టాటా తీసుకువచ్చింది. ఇప్పటికే టాటా నుంచి నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీలు మార్కెట్ లో ఉన్నాయి. అయితే తాజాగా టియాగో ఈవీని మార్కెట్ లో విడుదల చేసింది.
17 Dead In China Restaurant Fire Accident: చైనాలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ రెస్టారెంట్ లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు గాయపడినట్లు చైనా అధికారులు వెల్లడించారు. చాంగ్ చున్ నగరంలో ఓ రెస్టారెంట్ లో బుధవారం మధ్యాహ్నం 12.40 గంటలకు మంటలు చెలరేగాయి. మంటల వార్తలు తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. దాదాపుగా మూడు గంటల పాటు ఫైర్ సిబ్బంది శ్రమించి మంటలను ఆర్పేశారు.
DA hiked by 4% for central govt employees, pensioners: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది కేంద్రం. డియర్నెస్ అలవెన్స్(డీఏ)ను 4 శాతం పెంచుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దసరా ముందు కేంద్ర డీఏ పెంచడంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల దేశంలో కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు.
Shaheed Bhagat Singh International Airport: గత ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో చండీగఢ్ విమానాశ్రయం పేరును షహీద్ భగత సింగ్ గా మారుస్తామని ప్రకటించారు. బుధవారం స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా చండీగఢ్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం పేరును షహీద్ భగత్ సింగ్ ఎయిర్ పోర్టుగా మార్చారు. ఈ కార్యక్రమానికి కేంద్రఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Himachal Congress Chief Harsh Mahajan Joins BJP: అధ్యక్ష ఎన్నికలు, రాజస్థాన్ రాష్ట్రంలో సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే రాజస్థాన్ సంక్షోభాన్ని ముగించేందుకు పార్టీ ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, యువనేత సచిన్ పైలెట్ల మధ్య ఆధిపత్య పోరు రాజస్థాన్ రాష్ట్రాన్ని మరో పంజాబ్ విధంగా చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సమస్యల మధ్య కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మరో రెండు మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే హిమాచల్ ప్రదేశ్…
Lalu Prasad Yadav's demand to ban RSS: రాడికల్ ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా( పీఎఫ్ఐ) కోరలు పీకే పనిలో ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే రెండు విడతలుగా ఆపరేషన్ ఆక్టోపస్ పేరుతో దేశంలోని 15 రాష్ట్రాల్లో ఎన్ఐఏ, ఈడీ భారీ ఎత్తున పీఎఫ్ఐపై దాడులు చేసింది. ఈ సంస్థ కీలక వ్యక్తులు, కార్యకర్తలను అరెస్ట్ చేసింది. ఎన్ఐఏ విచారణలో విస్తూపోయే నిజాలు బయటకు వస్తుండటంతో పీఎఫ్ఐని బ్యాన్ చేయాలని దేశవ్యాప్తంగా పలు సంఘాలు కోరుతున్నాయి. ముస్లిం సంఘాలు కూడా…
Centre To Extend Free Ration Scheme By Three More Months: కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతోంది. పేదలకు అందించే ఉచిత రేషన్ పథకాన్ని పొడగించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బుధవారం దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరో మూడు నెలల పాలు ఉచిత రేషన్ పథకాన్ని అందించేందకు కేంద్ర కసరత్తు చేస్తోంది. కోవిడ్ మహమ్మారి సమయంలో 2020లో ఈ పథకం కింద పేదలకు ప్రతీ నెల ఒక్కొక్కరికి 5 కిలోల ఉచిత ఆహార ధాన్యాలు అందించబడుతున్నాయి. ఈ పథకం సెప్టెంబర్…
Anti-Hijab Protests in iran: ఇరాన్ లో పది రోజులుగా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. హిజాబ్ సరిగ్గా ధరించలేదని చెబుతూ.. మోరాలిటీ పోలీసులు మహ్సాఅమిని అనే 22 ఏళ్ల యువతిని అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆమె కోమాలోకి వెళ్లి మరణించింది. పోలీసులు దాడి చేయడంతోనే ఆమె మరణించిందని ఆరోపిస్తూ.. దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. యువత, మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. మహిళలు హిజాబ్ తీసేస్తూ.. జట్టు కత్తిరించుకుంటూ నిరసనల్లో పాల్గొంటున్నారు.
Xi Jinping makes first public appearance since SCO meet: చైనాలో సైనిక కుట్ర జరుగుతుందని.. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీ ఓ) సదస్సు తర్వాత చైనాకు తిరిగి వచ్చిన అధ్యక్షుడు జి జిన్ పింగ్ ను గృహ నిర్భంధం చేశారని ప్రపంచ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. గతంలో ప్రభుత్వంలో పనిచేసిన మాజీ మంత్రులకు వరసగా ఉరిశిక్షలు విధించడంతో పాటు.. మూడోసారి అధ్యక్షుడు కావాలని భావిస్తున్న జిన్ పింగ్ వైఖరిపై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాలోని నాయకులకు రుచించడం లేదని అందుకే ఆయనపై…
Supreme Court On EWS Reservation: ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు విద్యాసంస్థల్లో, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ పూర్తియింది. దీనిపై తీర్పును రిజర్వ్ చేసింది రాజ్యాంగ ధర్మాసనం. ఆర్థికంగా వెనకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ.. 103వ రాజ్యాంగ సవరణ తీసుకువచ్చింది కేంద్రం. దీన్ని సవాల్ చేస్తూ.. 40 వరకు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి.