Bangladesh: బంగ్లాదేశ్‌లో రాడికల్ గ్రూపులు ఢాకాలోని భారత హైకమిషన్‌పై దాడికి యత్నించారు. గుంపుగా వచ్చిన నిరసనకారులు బారికేడ్లను దాటుకుని రాయబార కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. వీసాల జారీ ప్రక్రియ నిలిపివేతను వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు ఎంబసీని ముట్టడించారు. గత కొన్ని రోజులుగా భారత రాయబార కార్యాలయానికి ఆ దేశంలోని పలువురు నాయకుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఢిల్లీలోని బంగ్లా రాయబారి రియాజ్ హబీబుల్లాను భారత విదేశాంగ శాఖ పిలిపించి, పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం బెదిరింపులు వస్తున్నా చర్యలు తీసుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది.
Read Also: Supreme Court: ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్.. టోల్‌ప్లాజాల మూసివేతకు ఆదేశం
మరోవైపు, యూనస్ సర్కార్ రాడికల్, అతివాదులు భారత ఎంబసీపై దాడికి యత్నించేందుకు అనుమతించినట్లు వార్తలు వస్తున్నాయి. ఉగ్రవాదుల బెదిరింపులు, బంగ్లాదేశ్ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పెరుగుతున్న భద్రతా సమస్యల మధ్య భారత్ ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం బంగ్లా రాజధాని ఢాకాలో ఉన్న ఇండియన్ వీసా దరఖాస్తు కేంద్రాన్ని (IVAC) మూసివేసింది. భద్రతా పరిస్థితిని చూపిస్తూ మధ్యాహ్నం 2 గంటల నుంచి కార్యకలాపాలను నిలిపేసింది. బుధవారం షెడ్యూల్ అయిన అన్ని అపాయింట్మెంట్లను తర్వాత తేదీకి తిరిగి షెడ్యూల్ చేస్తామని ఒక ప్రకటనలో తెలిపింది.