Bomb blast in Balochistan: పాకిస్తాన్ మరోసారి పేలుడుతో దద్దరిల్లింది. బలూచిస్తాన్ ప్రావిన్సులో రద్దీగా ఉండే ఓ మార్కెట్ లో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. బలూచిస్తాన్ లోని కోహ్లు పట్టణంలోని ఓ స్వీట్ షాపులో ఈ పేలుడు జరిగింది. దీంట్లో ఇప్పటి వరకు ఒకరు మరణించగా.. మరో 20 మంది వరకు గాయపడ్డారు. ఇందులో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు జరిగిన వెంటనే క్షతగాత్రులను కోహ్లులోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Death threats to a Muslim cleric over Rashtra Pita remarks: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల ముస్లిం మేధావులను, ముస్లిం మతపెద్దలను వరసగా కలిశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ ముస్లిం నాయకులతో భేటీ కావడం దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సెప్టెంబర్ 22న మోహన్ భగవత్ ఢిల్లీలోని ఓ మసీదుతో పాటు మదర్సాను సందర్శించారు. ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ హెడ్ ఉమర్ అహ్మద్ ఇలిమాసీతో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఇలియాసీ, మోహన్ భగవత్…
Congress President Elections: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరెవరు పోటీ పడుతున్నారనే దానిపై క్లారిటీ వచ్చింది. సీనియర్ నాయకులు మల్లికార్జున ఖర్గేతో పాటు శశి థరూర్ పోటీలో నిలిచారు. చివరి నిమిషంలో దిగ్విజయ్ సింగ్ తప్పుకోవడంతో తెరపైకి అనూహ్యంగా మల్లికార్జున ఖర్గే పేరు వచ్చింది. గతంలో అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపడుతారని అనుకున్నప్పటికీ.. రాజస్థాన్ రాజకీయ సంక్షోభం కారణంగా అశోక్ గెహ్లాట్ పోటీ నుంచి తప్పించుకున్నారు. ప్రస్తుతం అధ్యక్ష పోటీలో ముగ్గురు వ్యక్తులు బరిలో ఉన్నారు. మల్లికార్జున ఖర్గే, శశి థరూర్…
100 children killed in suicide bombing at Kabul school: ఆప్ఘనిస్తాన్ మరోసారి నెత్తురోడింది. రాజధాని కాబూల్ లోని ఓ స్కూల్ లో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య 100కు చేరినట్లు తెలుస్తోంది. కాబూల్ నగరానికి పశ్చిమాన ఉన్న దష్ట్-ఏ- బర్చి ప్రాంతంలో ఉన్న ఓ స్కూల్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. దాడి సమయంలో మొత్తం స్కూల్ లో దాదాపుగా 600 మంది విద్యార్థులు ఉన్నారు. యూనివర్సిటీ ప్రవేశ పరీక్షకు విద్యార్థులు సిద్ధం అవుతున్న సయమంలో ఈ దాడి జరిగింది.
Russia-Ukraine war: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏడు నెలలు దాటినా కూడా ఈ రెండు దేశాల మధ్య యుద్ధతీవ్రత తగ్గడం లేదు. ఎటువైపు నుంచి ఏ రాకెట్ వచ్చిపడుతుందో అని తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలు వణికిపోతున్నాయి. మరోవైపు పాక్షిక సైనిక సమీకరణకు ఆదేశాలు ఇచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్ పై దాడులను మరింతగా పెంచేలా ప్లాన్ వేస్తున్నారు. ఇదిలా ఉంటే దక్షిణ జపోరిజ్జియా ప్రాంతంలో దారుణానికి తెగబడింది రష్యా. ఓ పౌరకాన్వాయ్ పై దాడి చేసింది. రష్యా…
Encounter Breaks Out In Jammu And Kashmir: జమ్మూకాశ్మీర్‌లో భద్రతబలగాలు, ఉగ్రవాదులకు మధ్య శుక్రవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో జైషే మహ్మద్(జేఎం) ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న ఇద్దరు టెర్రరిస్టులను భద్రతాబలగాలు హతమార్చాయి. బాముముల్లా జిల్లాలోొని మోడిపోరా, పట్టన్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. దీనికి ముందు శుక్రవారం ఉదయం షోఫియాన్ జిల్లాలో కూడా ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమచారంతో గాలింపులు చేపట్టిన భద్రతాబలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో…
Senior advocate R Venkataramani appointed Attorney General of India: భారత అటార్నీ జనరల్‌గా సీనియర్ న్యాయవాది ఆర్ వెంకటరమణి నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. దేశ అత్యతున్నత న్యాయ అధికారిగా వెంకటరమణి అక్టోబర్ 1న బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఉన్న అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పదవీ కాలం ఈ నెల 30తో ముగియనుంది. దీంతో కొత్త అటార్నీ జనరల్ గా వెంకటరమణి బాధ్యతలు స్వీకరించనున్నారు.
North Korea Fires 2 Missiles: ఉత్తర కొరియా క్షిపణులు ప్రయోగాల్లో తగ్గేది లేదంటోంది. బుధవారం వరసగా రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. రెండు రోజుల క్రితం ప్యాంగాంగ్ నుంచి చివరి సారిగా క్షిపణి ప్రయోగం చేసిన నార్త్ కొరియా.. బుధవారం మరో రెండు క్షిపణుల్ని ప్రయోగించింది. ఈ విషయాన్ని సౌత్ కొరియా ధృవీకరించింది. ప్యాంగాంగ్ లోని సునాన్ ప్రాంతం నుంచి ఈ రెండు క్షిపణల్ని ప్రయోగించింది నార్త్ కొరియా.
India's harsh comments on Pakistan in the UN: భారత్ మరోసారి పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పింది. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలిలో పాకిస్తాన్ తీరును ఎండగట్టింది. పాక్ అనుసరిస్తున్న విధానాలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రపంచానికి ఉగ్రవాదాన్ని అందిస్తున్న పాకిస్తాన్ వంటి దేశం ప్రజాస్వామ్యం, మానవహక్కుల గురించి ప్రపంచానికి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. జెనీవాలోని యుఎన్‌హెచ్‌ఆర్‌సి 51వ సెషన్ లో జనరల్ డిబేట్ లో భాగంగా భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ సీమా పూజానీ…
Time's 100 Emerging Leaders-Akash Ambani in list: టైమ్స్ మ్యాగజిన్ 100 మంది ఎమర్జింగ్ లీడర్ల జాబితాను ప్రకటించింది. వ్యాపారం, వినోదం, క్రీడలు, రాజకీయం, ఆరోగ్యం, సైన్స్, ఇలా పలు రంగాల్లో 100 మంది ఎమర్జింగ్ లీడర్ల జాబితాను టైమ్స్ రూపొందించింది. దీంట్లో ఇండియా నుంచి ముఖేష్ అంబానీ కొడుకు ఆకాష్ అంబానీ చోటు దక్కించుకున్నాడు. భారత్ నుంచి కేవలం ఒక్క ఆకాష్ అంబానీ మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. అయితే భారత సంతతికి చెందిన అమెరికన్ బిజినెస్ లీరడ్ అమ్రపాలి గన్…