BJP Worker Assassination In Kerala: కేరళ రాష్ట్రంలో సూపర్ హిట్ మూవీ ‘దృశ్యం’ మూవీ సీన్ రిపీట్ అయింది. దృశ్యం సినిమాలో ఓ శవాన్ని పోలీస్ స్టేషన్ లో ఫ్లోర్ కింద సమాధి చేయడం అందరికి గుర్తుండే ఉంటుంది. అయితే కేరళలో ఇలాంటి ఘటనే రిపీట్ అయింది. దృశ్యం మూవీని తలపించే విధంగా బీజేపీ కార్యకర్త మర్డర్ జరిగింది. ఇప్పుడు ఈ కేసు కేరళలో సంచలనంగా మారింది. బీజేపీ కార్యకర్తను దారుణంగా హత్య చేసి గోడలోపెట్టి ప్లాస్టరింగ్ చేశాడు నిందితుడు.
Read Also: Sunil Deodhar: నరేంద్రమోడీ పథకాలకు.. జగన్ స్టిక్కర్లా?
కేరళలోని కొట్టాయంకు చెందిన 43 ఏళ్ల బిందు కుమార్ సెప్టెంబర్ 26 నుంచి కనిపించకుండా పోయారు. అయితే అతని కుటుంబ సభ్యులు సెప్టెంబర్ 28న పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు.. చివరిసారిగా బిందుకుమార్ సెల్ ఫోన్ సిగ్నల్ ఎక్కడ ఉండనే విషయాన్ని కనుక్కోవడంతో కేసులో పురోగతి కనిపించింది. చివరిసారిగా బిందు కుమార్ సెల్ ఫోన్ సిగ్నల్ చంగనస్సేరిలోని కాలనీలోొ ట్రేస్ అయింది.
ఈ క్రమంలో ఆ ప్రాంతంలో బిందు కుమార్ కు పరిచయస్తులు ఎవరున్నారనేదానిపై ఆరా తీయగా.. నిందితుడు ముత్తుకుమార్ పేరు బయటకు వచ్చింది. దీంతో పాటు బిందుకుమార్ బైకు కూడా అదే ప్రాంతంలో దొరకడంతో పోలీసులు ముత్తుకుమార్ పై అనుమానం వ్యక్తం చేశారు. అతని ఇంటిని పరిశీలించగా.. కొత్తగా నిర్మించిన ఓ నిర్మాణం పోలీసులకు అనుమానం కలిగింది. బిందు కుమార్ ను చంపేసి గోడలో పూడ్చివేశాడనే అనుమానంతో పోలీసులు.. కాంక్రీట్ ను ఆరు గంటల పాటు తవ్విన తర్వాత బిందుకుమార్ మృతదేహం బయటపడింది. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తదుపరి విచారణ కోసం పోలీసులు వేలిముద్రలు, డాగ్ స్వ్కాడ్ తో సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.