UK's Rishi Sunak Committed To Free Trade Pact With India: ఆర్థిక కష్టాలతో సతమతం అవుతున్న యూకే.. భారత్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు సిద్ధం అవుతోంది. దీనికి సంబంధించి చర్చలు కొనసాగుతన్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఎన్నికైన బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ఈ ఒప్పందంపై కసరత్తు చేస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన ఇండియాతో ఈ వాణిజ్య ఒప్పందం కుదిరితేనే బ్రిటన్ ఆర్థికంగా బలపడే అవకాశం ఉంది. బోరిస్ జాన్సన్ ప్రధానిగా ఉన్న సమయం…
Ukraine Sought Pakistan’s Help For Developing Nuclear Weapons: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ కు పాకిస్తాన్ సాయం చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అణ్వాయుధాలను అభివృద్ధి కోసం ఉక్రెయిన్, పాకిస్తాన్ సాయాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉక్రెయిన్ ప్రతినిధి బృందం ఇస్లామాబాద్ వెళ్లినట్లు రష్యా సెనెటర్ ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటికే రష్యా, పాకిస్తాన్ ను హెచ్చరించించినట్లు తెలుస్తోంది.
India had clearly told Colombo not to allow docking of Chinese military vessels: చైనా బాలిస్టిక్ క్షిపణి ట్రాకింగ్ నౌక వాంగ్ యువాన్ 5ను హంబన్ టోట వద్ద డాకింగ్ చేయడానికి కొన్ని నెలల క్రితం శ్రీలంక అనుమతి ఇచ్చింది. భారత్ ఎన్ని అభ్యంతరాలను తెలిపినా.. శ్రీలంక ఆ నౌకకు అనుమతి ఇచ్చింది. శ్రీలంక నుంచే భారత్ అణు కార్యక్రమాలు, క్షిపణి కార్యక్రమాలు, స్పేస్ ఏజెన్సీపై నిఘా పెట్టే అవకాశం ఉంటుందని భారత్ ఆందోళన చెందింది. ఇదిలా ఉంటే చైనా…
Benjamin Netanyahu as Prime Minister of Israel.. Exit polls revealed: ఇజ్రాయిల్ దేశంలో ఎన్నికలు ముగిశాయి. ఆ దేశ పార్లమెంట్ కనాసెట్ కు ఇటీవల ఎన్నికలు జరిగాయి. గత నాలుగేళ్లలో ఇజ్రాయిల్ లో ఐదుసార్లు ఎన్నికలు జరిగాయి. అయితే ఈ సారి భారతదేశానికి మిత్రుడిగా, ప్రధాన మంత్రితో మంచి స్నేహం ఉన్న బెంజిమిన్ నెతన్యాహు తిరిగి అధికారంలోకి వస్తారని తెలుస్తోంది. అక్కడి అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. మంగళవారం ఎన్నిలక తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో…
InSight lander mission will come to an end in the coming weeks: అంగారకుడి గురించి ఎన్నో వివరాలను అందించిన ఇన్సైట్ ల్యాండర్ మరికొన్ని రోజుల్లో మూగబోనుంది. 2018లో అంగారకుడిని చేరుకున్న ఇన్సైట్ ల్యాండర్ అంగారకుడి అంతర్గత పొరల్లో నిర్మాణాలను, అంగారకుడిపై వచ్చే మార్స్క్వేక్లను( అంగారకుడిపై భూకంపాలు) గుర్తించింది. ఇప్పటి వరకు 1,300 కంటే ఎక్కువ మార్స్క్వేక్లను గుర్తించింది ఇన్సైట్ ల్యాండర్. అంగారుకుడిపై నాలుగు సంవత్సరాలుగా ఇన్సైట్ ల్యాండర్ పనిచేస్తోంది.
China Locks Down Area Around iPhone Factory: చైనాలో జీరో కోవిడ్ ప్రోటోకాల్ ను కఠినంగా అమలు చేస్తోంది. చైనా ప్రజల నుంచి కమ్యూనిస్ట్ ప్రభుత్వం, అధ్యక్షుడు జి జిన్ పింగ్ పై విమర్శలు, నిరసన వ్యక్తం అవుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోకుండా కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తోంది. తాజాగా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాన్ని బుధవారం దిగ్బంధించారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా లాక్ చేశారు. కోవిడ్ నివారణ వాలంటీర్లు, అవసరమైన కార్మికులు తప్ప ప్రజలంతా…
India Set To Become World’s Third-Largest Economy By 2030: ప్రపంచదేశాలు అన్నీ ఆర్థిక మాంద్యం పరిస్థితులను ఎదుర్కొంటే ఒక్క భారతదేశం మాత్రమే మాంద్యాన్ని తప్పించుకుంటుందని పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇటీవలే బ్రిటన్ ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా నిలిచింది. ఇదిలా ఉంటే 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలుస్తుందని ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ ఓ […]
Elon Musk may take Tesla employees to Twitter: ట్విట్టర్ కంపెనీ హస్తగతం చేసుకున్న ఎలాన్ మస్క్ ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ట్విట్టర్ ను పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కంపెనీలో కీలక ఉద్యోగులను తొలగించడంతో పాటు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను తొలగించి తానే ఏకైక డైరెక్టర్ గా ఉన్నారు. తాజా అమెరికన్ మీడియా కథనాల ప్రకారం రానున్న రోజుల్లో ట్విట్టల్ నుంచి చాలా మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
16-year-old dies while playing hide-and-seek in lift: దాగుడుమూతలు ఆడుతూ.. 16 ఏళ్ల బాలిక మరణించింది. ఈ విషాదకరమైన సంఘటన ముంబైలో జరిగింది. లిఫ్టులో దాగుడుమూతలు ఆడటమే బాలిక ప్రాణాలను తీసింది. ముంబైలోని మాన్ ఖుర్డ్ ప్రాంతంలోని హౌసింగ్ సొసైటీలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. రేష్మా ఖరవీ అనే బాలిక దీపావళి పండగ జరుపుకోవడానికి అమ్మమ్మ ఇంటికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు బాలిక చనిపోయింది.
Engineering Student Gets 5 Years In Jail For "Celebrating" Pulwama Attack: 2019లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పుల్వామా దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి తర్వాత ఫేస్ బుక్ లో అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి బెంగళూర్ స్పెషల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు రూ. 25,000 జరిమానా విధించింది. ఈ మేరకు అదనపు సిటీ సివిల్, సెషన్స్ జడ్జి గంగాధర ఈ ఉత్తర్వులు జారీ చేశారు.