Strikes On Ukraine Power Grid In Response To Crimea Attack Says Putin: ఉక్రెయిన్ పై రష్యా విరుచుకుపడుతోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. దీంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ తో సహా పలు నగరాలు, పట్టణాల్లో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. దీంతో చాలా చోట్ల అంధకారం అలుముకుంది. దీంతో పాటు విద్యుత్ లేకపోవడంతో తాగునీటి వంటి మౌళిక సదుపాయాలపై ప్రభావం పడుతోంది. ఇదిలా ఉంటే క్రిమియాలోని తన నౌకాదళంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేయడం వల్లే…
Supreme Court to hear Gyanvapi mosque case on November 10: జ్ఞానవాపీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు కీలక విచారణ జరపనుంది. నవంబర్ 10న ఈ అంశం సుప్రీం ధర్మాసనం ముందుకు రానుంది. ఇప్పటికే ఈ కేసును వారణాసి జిల్లా కోర్టు విచారిస్తోంది. వీడియో సర్వేలో జ్ఞానవాపీ మసీదులో లభించిన శివలింగాన్ని పరిరక్షించాలని మే నెలలో సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతోపాటు ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఆదేశించింది.ఈ ఆదేశాల తరువాత మళ్లీ ఇప్పుడే సుప్రీంకోర్టు ఈ అంశాన్ని విచారించనుంది.
Jamshed J Irani, known as Steel man of India, passes away: స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన టాటా స్టీల్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, పద్మభూషన్ డాక్టర్ జంషెడ్ జే ఇరానీ కన్నుమూశారు. సోమవారం రాత్రి జంషెడ్ పూర్ లోని మరణించినట్లు టాటా స్టీల్ తెలిపింది. 86 ఏళ్ల జంషెడ్ జే ఇరానీ మరణంపై టాటా స్టీల్ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది. అనారోగ్యంతో చికిత్స పొందుత.. జంషెడ్ పూర్ లోని టాటా ఆస్పత్రిలో సోమవారం రాత్రి 10 గంటలకు…
ఇదిలా ఉంటే మోర్బీ వంతెన కూలిన ఘటన సుప్రీం కోర్టుకు చేరింది. ఈ ప్రమాదంపై రిటైర్డ్ జడ్జితో తక్షణమే జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. పర్యావరణ సాధ్యత, భద్రతను నిర్దారించేందుకు పాత వంతెనలను, స్మారక కట్టడాలను సర్వే, రిస్క్ అసెస్మెంట్ కోసం కమిటీని ఏర్పాటు చేయాడానికి రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు.
Sound Of Earth's Magnetic Field Released By European Space Agency: భూమిపై ఉన్న సమస్త జీవజాలాన్ని భూ అయస్కాంత క్షేత్రం రక్షిస్తుంది. విశ్వం నుంచి వచ్చే ప్రమాదకరమైన రేడియేషన్ పార్టికల్స్, సూర్యుడి నుంచి వెలువడే సౌరజ్వాలలు, సోలార్ తుఫానుల నుంచి భూమిని రక్షిస్తోంది. అయితే ఇంతలా భూమిని రక్షిస్తున్న ఎర్త్ మాగ్నెటిక్ ఫీల్డ్ సౌండ్ ఎలా ఉంటుందో ఎప్పుడైనా విన్నారా..? తాజా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ దీనికి సంబంధించిన సౌండ్స్ రికార్డ్ చేసింది. భూమి అయస్కాంత క్షేత్రాన్ని మనం
‘Jamie Oliver of Iran’ beaten to death in police custody month after Mahsa Amini: ఇరాన్ లో మరోసారి ఆందోళనలు ఎగిసిపడే అవకాశం ఏర్పడింది. హిజాబ్ సరిగ్గా ధరించలేదని 23 ఏళ్ల మహ్సా అమిని అనే యువతిని అరెస్ట్ చేసి తీవ్రంగా దాడి చేయడంతో ఆమె మరణించింది. దీంతో ఇస్లామిక్ దేశం అయిన ఇరాన్ లో తీవ్ర స్థాయిలో నిరసనలు ఎగిసిపడ్డాయి. అక్కడి మహిళలు హిజాబ్ విసిరేస్తూ.. జట్టు కత్తిరించుకుని, ప్రభుత్వానికి, అధ్యక్షుడికి వ్యతిరేకంగా తీవ్రంగా ఆందోళన చేశారు. ఈ…
PM Narendra Modi visit to Morbi today: మోర్బీ వంతెన కూలిన ఘటన యావత్ దేశాన్ని విషాదంలో ముంచింది. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 141 మంది మరణించారు. సమయం గడుస్తున్నా కొద్ధీ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరణించిన వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉండటం అందర్ని కలిచివేస్తోంది. ఇదిలా ఉంటే ఈ రోజు(మంగళవారం) ప్రమాద స్థలాన్ని సందర్శించనున్నారు ప్రధాని నరేంద్రమోదీ. అక్కడే ముఖ్యమంత్రి, అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించనున్నారు. చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. ఈ ఘటనలో మరణించిన…
US President Joe Biden condoles loss of lives at Morbi bridge collapse: గుజరాత్ మోర్బీ వంతెన కూలిన ఘటనపై యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనలో 141 మంది మరణించారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు మరణించడం అందర్ని కలిచివేస్తోంది. దీపావళి సెలువులు కావడం, వారాంతం కావడంతో మచ్చు నదీ అందాలను తిలకించేందుకు వచ్చిన చాలా మంది ఈ ప్రమాదం బారిన పడ్డారు.
Elon Musk fires entire Twitter board to become sole director: ట్విట్టర్ సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ట్విట్టర్ టేకోవర్ తరువాత కీలక పదవుల్లో ఉన్న నలుగురు ఉద్యోగులను పీకేశారు. తాజాగా మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా ట్విట్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రద్దు చేశారు. తానే ఏకైక డైరెక్టర్ గా కొనసాగనున్నారు. నవంబర్ 1కి ముందు కంపెనీలో భారీ తొలగింపులు ఉంటాయని వచ్చిన వార్తలను తిరస్కరించిన కొన్ని గంటల్లోనే బోర్డును రద్దు చేశారు.…
Gujarat Cable Bridge Collapse..Death toll rises to 60: గుజరాత్ మోర్బీ కేబుల్ వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య 60కి చేరింది. సమయం గడుస్తున్నా కొద్ది మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆదివారం సాయంత్ర మోర్బీ జిల్లాలో మచ్చు నదిపై ఉన్న కేబుల్ వంతెన కూలిపోవడంతో ఒక్కసారిగా 500 మంది వరకు సందర్శకులు నదిలో పడిపోయారు. 400 మంది ప్రాణాలు దక్కించుకోగా.. 100కు పైగా మంది గల్లంతు అయినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 60 మంది మరణించినట్లు గుజరాత్ పంచాయితీ మంత్రి…