Jharkhand Chief Minister H Soren Summoned Tomorrow In Mining Scam Case: అక్రమ మైనింగ్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వేగం పెంచింది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు ఈడీ బుధవారం సమన్లు జారీ చేసింది. గురువారం విచారణకు రావాల్సిందిగా కోరింది. రాంచీలోనీ ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో రేపు విచారణకు జరగనుంది. ఈ కేసులో ముఖ్యమంత్రి సహాయకుడు పంకజ్ మిశ్రాతో పాటు మరో ఇద్దరిని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ వ్యవహారంలో ఈడీ జూలైలో రాష్ట్రవ్యాప్తంగా సోదాలు నిర్వహించింది. పంకజ్ మిశ్రా…
Taliban Official Beating Female Students Outside Afghan University: ఆఫ్ఘనిస్తాన్ లో మహిళల హక్కులు ఏ విధంగా ఉంటాయో.. మహిళలను తాలిబాన్లు ఎంత చిన్నచూసు చూస్తారనే దానికి చిన్న ఉదాహరణ ఈ వీడియో. తమ హక్కుల గురించి పోరాడితే అక్కడి తాలిబాన్ ప్రభుత్వం మహిళలపై అణచివేస్తోంది. నిరసన తెలుపుతున్న మహిళా విద్యార్థులపై తాలిబాన్ అధికారులు దాడి చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన రాజధాని కాబూల్ లో జరిగింది. ఆప్ఘన్ యూనివర్సిటీ ముందు నిరసన తెలుపుతున్న…
North Korea fired at least 10 missiles of various types on Wednesday: ఉత్తర కొరియా మరోసారి క్షిపణి ప్రయోగాలను జరిపింది. బుధవారం రోజున ఏకంగా 10 క్షిపణులను ప్రయోగించింది. దీంతో దక్షిణ కొరియా అలెర్ట్ ప్రకటించింది. తమ ప్రజలు బంకర్లలోకి వెళ్లాలని సూచించింది. బాలిస్టిక్ క్షిపణి దక్షిణ కొరియా జాలాలకు దగ్గర్లో పడినట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. దీన్ని కవ్వింపు చర్యగా దక్షిణ కొరియా అభివర్ణించింది. మరోవైపు రెండు దేశాల వివాదాస్పద […]
Monkeypox still a global health emergency, says WHO: ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగానే కొనసాగించాలని డబ్ల్యూహెచ్ఓ నిర్ణయించింది. ఎమర్జెన్సీ కమిటీ మంకీపాక్స్ ను హెల్త్ ఎమర్జెన్సీగానే కొనసాగించాలని మంగళవారం నిర్ణయించింది. ఈ ఏడాది జూలైలో మంకీపాక్స్ ను గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించారు. ప్రస్తుతం దీన్ని మరికొంత కాలం కొనసాగించనున్నారు. మంకీపాక్స్ కట్టడికి ప్రపంచ దేశాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. అత్యవసర కమిటీ నిర్ణయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ అథనామ్ ఘెబ్రేయేసస్ స్వాగతించారు.
Tamil Nadu Witnesses Heavy Rain: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవితం అస్తవ్యస్తంగా తయారైంది. ముఖ్యంగా చెన్నై మహానగరం వరద గుప్పిట చిక్కుకుంది. చెన్నైతో పాటు పరిసర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి. నగరంలోని చాలా ప్రాంతాలు వరద నీరు చేరింది. సిటీలోని నుంగంబాక్కంలో నిన్న ఒకే రోజు 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. దీంతో పాటు సబర్బన్ రెడ్ హిల్స్ 13 సెంటీమీటర్లు, పెరంబూర్ లో 12 సెంటీమీటర్ల వర్షపాతం…
Twitter blue tick at $8 per month, says Elon Musk: ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సంస్థలో పనిచేసే కీలక ఉద్యోగులను తొలగించారు. దీంతో పాటు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ను రద్దు చేశారు. దీంతో ట్విట్టర్ కు కేవలం మస్క్ మాత్రమే ప్రస్తుతం డైరెక్టర్ గా ఉన్నారు. మరోవైపు మరింత మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధం అవుతున్నారు. 75 శాతం ఉద్యోగులను తొలగించే ప్లాన్ లో…
Chinese people protest with Bappi Lahiri song: చైనా దేశంలో జీరో కోవిడ్ ప్రోటోకాల్ తో అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఏకంగా జి జిన్ పింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ హిందీ పాట తెగ క్రేజ్ సంపాదించుకుంది. ఎప్పుడో 1982లో బప్పిలహరి స్వరపరిచిన ‘‘జిమ్మి..జమ్మి’’ సాంగ్ తెగ హల్చల్ చేస్తోంది. అక్కడి ప్రజలు ప్రభుత్వానికి నిరసన తెలిపే ఓ పాటగా దీన్ని ఎంచుకున్నారు. 82లో మిథున్ చక్రవర్తి నటించిన ‘ డిస్కో డాన్సర్’…
Union minister snubs journalist on India's Russian oil purchase: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆయిల్ కొనుగోళ్లపై ఆంక్షలు విధించాయి. ఇదిలా ఉంటే యుద్ధం నేపథ్యంలో ఆయిల్ కొనుగోళ్లపై భారత్ కు రష్యా డిస్కౌంట్ ఇచ్చింది. దీంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా తక్కువ ధరకే రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటోంది ఇండియా. ఇదిలా ఉంటే భారత్ ఈ చర్యపై యూరోపియన్ దేశాలు, అమెరికా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అక్కడి మీడియా భారత చర్యను తప్పుపడుతోంది.…
Fire breaks out in Delhi and Pune:దేశ రాజధాని ఢిల్లీతో పాటు పూణే నగరాల్లో మంగళవారం అగ్నిప్రమాదాలు సంభవించాయి. రెండు ప్రమాదాల్లో ప్రాణ నష్ణం సంభవించలేదు. పెద్ద ఎత్తున ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పూణేలోని లుల్లా నగర్ ప్రాంతంలోని ఓ వాణిజ్య భవనంలోని ఏడో అంతస్తులో ఉన్న ఓ రెస్టారెంట్ లో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మార్వెల్ విస్టా కమర్షియర్ భవనంలోని ఏడో అంతస్తులో ఉన్న వెజిటా రెస్టారెంట్ లో ఉదయం 8.15 గంటలకు మంటలు చెలరేగాయి. మంటలను…
"Go Back Modi" trending on Twitter: గుజరాత్ మోర్బీ వంతెన కూలిన ఘటన దేశవ్యాప్తంగా పలువురిని కలిచివేసింది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్రమోదీని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. గతంలో పశ్చిమ బెంగాల్ లో ఓ వంతెన కూలిన ఘటనపై మోదీ చేసిన ‘ఆక్ట్ ఆఫ్ గాడ్ కాదు ఆక్ట్ ఆఫ్ ఫ్రాడ్’ అని చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇప్పుడు గుజరాత్ బ్రిడ్జ్ కూలిన ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.