Rapists should be hanged publicly to reduce crime, comments Minister Usha Thakur: మధ్యప్రదేశ్ మహిళా మంత్రి అత్యాచార నిందితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల క్రితం మధ్యప్రదేశ్ ఖాండ్వాలో నాలుగేళ్ల చిన్నారి అత్యాచార ఉదంతాన్ని ప్రస్తావిస్తూ మంత్రి ఉషా ఠాకూర్ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను బహిరంగంగా ఉరితీయాని.. అప్పుడే నేరాలు తగ్గుతాయని ఆమె అన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను అభ్యర్థిస్తానని అన్నారు. రేపిస్టులను బహిరంగా ఉరితీసినప్పుడే.. మరొకరు ఈ నేరాలకు పాల్పడకుండా భయం పుడుతుందని అన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రిగా ఉన్నారు ఉషా ఠాకూర్.
Read Also: Tiger attacks: బాబోయ్ పులులు.. ఎడాపెడా దాడులు
మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి నేరాల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తోందని.. కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దేశంలో రేపిస్టులకు మరణశిక్ష విధించే నిబంధనలను రూపొందించిన మొదటిరాష్ట్రం మధ్యప్రదేశే ఉషా ఠాకూర్ వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 72 మంది నేరస్తులకు ఉరిశిక్ష విధించారని తెలిపారు. ఇలాంటి నేరాలు సమాజంలో మళ్లీ మళ్లీ చోటు చేసుకోవడం ఫోర్త్ ఎస్టేట్, మీడియా, మనందరికి ఆందోళన కలిగించే విషమని అన్నారు.
ఇలాంటి నేరాలు జరకుండా సమాజంలో చైతన్యం తీసుకురావాలని.. ఎవరైనా ఇలాంటి అనాగరిక చర్యలకు పాల్పడితే అటువంటి నేరస్తులను బహిరంగ కూడళ్ల వద్ద శిక్ష విధించాలని ముఖ్యమంత్రిని కోరుతా అని అన్నారు. జైలులో ఇలాంటి శిక్షలు విధిస్తే..ఎవరికి తెలుస్తుందని ప్రశ్నించారు. ఇటీవల ఖాండ్వాలో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసి నిందితుడు చెరుకుతోటలో బాలికను వదిలివెళ్లారు. అపస్మారస్థితిలో ఉన్న చిన్నారికి ప్రస్తుతం ఇండోర్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరొకరు వేరే జిల్లాలో అత్యాచారం కేసులో పట్టుబడ్డాడు. మంత్రి ఉషా ఠాకూర్ ఇద్దరి నిందితుల గురించి మాట్లాడుతూ.. బహిరంగ ఉరిని ప్రస్తావించారు.