Apple Users In India To Get 5G From Next Week: భారతదేశంలోని ఆపిల్ యూజర్లకు శుభవార్త చెప్పింది ఆ సంస్థ. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న 5 జీ సేవల గురించి క్లారిటీ ఇచ్చింది. 5 జీ నెట్ వర్క్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సాఫ్ట్వేర్ అప్గ్రేడ్లను వచ్చే వారం నుంచి విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఆపిల్ తన ఐఓఎస్ 16 బీటా సాఫ్ట్వేర్ అప్డేట్ను అందుబాటులోకి తెస్తోంది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. సీఈసీ రాజీవ్ కుమార్ ఎన్నికలకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉన్న గుజరాత్ అసెంబ్లీ ఐదేళ్ల కాలపరిమితి ఫిబ్రవరి 18,2023తో ముగుస్తోంది. గత 25 ఏళ్లుగా గుజరాత్ లో బీజేపీ తిరుగలేని అధికారాన్ని చెలాయిస్తోంది. ఈ సారైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తాను అధికారంలో ఉన్నానని చెబుతోంది.
Miss Puerto Rico And Miss Argentina Reveal That They're Married: వారిద్దరు ఇరు దేశాల అందెగత్తెలు. వీరిని ఆరాధించే కుర్రాళ్లు కోట్లలో ఉన్నారు. కానీ వారిద్దరికి మాత్రం ఒకరంటే ఒకరికి ప్రేమ. దీంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ హాట్ బ్యూటీస్ పెళ్లి చేసుకోవడం చాలా మంది కుర్రాళ్లను షాక్ కు గురిచేసింది. మాజీ మిస్ అర్జెంటీనా, మాసీ మిస్ ప్యూర్టోరికో ఇద్దరు పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించారు.
Bangladesh Player Accuses Virat Kohli Of "Fake" Fielding: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భారత్ సెమీస్ రేసులో ముందుంది. బుధవారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించింది. విజయం వైపు దూసుకెళ్తున్న బంగ్లాదేశ్ ను ఐదు పరుగుల తేడాతో భారత్ ఓడించింది. ఈ పరాజయాన్ని బంగ్లా ఫ్యాన్స్, క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. భారత్ ను ఓడించేందుకు వచ్చామని బీరాలు పలికిన బంగ్లా టీమ్ కు ఏడుపు ఒకటే తక్కువ. దీంతో ఓటమికి సాకులు…
Benjamin Netanyahu on the way to a huge victory in the Israeli elections: ఇజ్రాయిల్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం దిశగా దూసుకుపోతున్నారు బెంజిమిన్ నెతన్యాహు. ఇజ్రాయిల్ కు అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న ఆయన మరోసారి ఎన్నికల్లో విజయం సాధించనున్నారు. గురువారం అక్కడ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభం అయింది. 87.6 శాతం ఓట్లు లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి నెతన్యాహు లికుడ్ పార్టీ, దాని మిత్రపక్షాలు 65 స్థానాలు సాధించే స్థితికి చేరుకుంది. ఇందులో లికుడ్ పార్టీనే 61-62 సీట్లు…
Elon Musk Plans to Cut Half of Twitter Jobs to Slash Costs: ట్విట్టర్ను సొంతం చేసుకున్న అపర కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. గత వారం 44 బిలియన్ డాలర్ల భారీ డీల్ తో సోషల్ మీడియా కంపెనీ ట్విట్టర్ను హస్తగతం చేసుకున్నారు. వచ్చీ రావడంతోనే సంస్థలో పనిచేస్తున్న నలుగురు కీలక ఉద్యోగులను తొలగించారు. ఆ తరువాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను రద్దు చేసి.. తానే ఏకైక డైరెక్టర్ గా ఉన్నారు.
Congress Leader Seek Bharat Ratna For Mulayam Singh Yadav: సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఇటీవల మరణించారు. దివంగత ములాయం సింగ్ యాదవ్ కు మరణానంతరం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత. మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ ఆరిఫ్ నసీమ్ ఖాన్..ములాయంకు భారతరత్న ఇవ్వాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు.
Gujarat Election Dates To Be Announced At Noon Today: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు మధ్యాహ్నం ప్రకటించనుంది. డిసెంబర్-జనవరి నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ ను వెల్లడించిన ఈసీ.. ఈ రోజు గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. ఫిబ్రవరి 18,2023తో గుజరాత్ అసెంబ్లీ ఐదేళ్ల కాల పరిమితి ముగియనుంది. దీంతో ఈ మధ్యలోనే ఎన్నికలను నిర్వహించనుంది ఎన్నికల సంఘం. సీఈసీ రాజీవ్ కుమార్ మధ్యాహ్నం…
Number Of Foreign Terrorists Operating In Kashmir Has Increased: జమ్మూ కాశ్మీర్లో పాక్ ప్రేరిపిత ఉగ్రవాదుల సంఖ్య ఎక్కువ అవుతోంది. ఆర్టికల్ 370 తరువాత కేంద్ర తీసుకున్న చర్యల వల్ల కాశ్మీర్ యువత ఉపాధి పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఎప్పటికప్పుడు లోయలో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించేలా పాకిస్తాన్ కుటిల ప్రయత్నాలకు పాల్పడుతూనే ఉంది. ఆ దేశంలో శిక్షణ పొందిన ఉగ్రవాదులను పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా ఇండియాలోకి పంపిస్తోంది. పాక్ ఆక్రమిత […]
By-elections in Munugode, Adampur, Andheri East and 4 other seats: తెలంగాణలో మునుగోడుతో పాటు దేశవ్యాప్తంగా పలు కీలక అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటీవల కాలంలో మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో ప్రభుత్వం మారిన తర్వాత తొలిసారిగా ఆ రాష్ట్రాల్లో ఉపఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా బీజేపీకి ఈ ఎన్నికలకు కీలకంగా మారాయి. మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, ఒడిశా, హర్యానా రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఈ రోజు జరగుతున్నాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు…