Tamil Nadu Rains: తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని చెన్నై నగరంతో పాటు పలు జిల్లాలు వరద గుప్పిట చిక్కుకున్నాయి. చెన్నైలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచింది. పలు చోట్ల సబ్ వేలను మూసేశారు. ఇదిలా ఉంటే భారీ వర్షాల కారణంగా చెన్నై, పుదుచ్చేరిలో సెలవులు ప్రకటించాయి అక్కడి ప్రభుత్వాలు. పుదుచ్చేరిలో రెండు రోజుల పాటు స్కూళ్లు, కాలేజీలను మూసేస్తున్నట్లు విద్యాశాక మంత్రి ఓం నవమశ్శివాయం వెల్లడించారు.
Read Also: Ayyannapatrudu: ఎన్ని కేసులు పెట్టినా..నన్నేం పీకలేరు
నవంబర్ 6 వరకు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళ నాడులోని 22 జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా కావేరీ డెల్టా జిల్లాలు, తీర ప్రాంత జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. నీలగిరి, కరూర్, కడలూరు, అరియలూరు, తిరువారూర్, తంజావూరులలో ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేశారు. మరో ఏడు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు అధికారులు. నవంబర్ 4న నీలగిరి, కోయంబత్తేర్, తిరుప్పూర్, దిండిగల్, తేనీ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. చెన్నై, నాగపట్నం, కడలూరు,కరైకల్ సహా ఎనిమిది జిల్లాలలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు అధికారులు. శుక్రవారం రోజు మై
శుక్రవారం తమిళనాడులోని మైలాడుతురై, నాగై, తంజావూరు, తిరువారూర్, పుదుక్కోట్టై, శివగంగ, రామ్‌నాడ్ జిల్లాలు, కారైకల్ ప్రాంతంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కడలూరు, విల్లుపురం, కళ్లకురిచ్చి, అరియలూర్, పెరంబలూరు, తిరుచ్చి, మదురై, తేని, దిండిగల్, విరుదునగర్, తెన్‌కాసి, తూత్తుకుడి, తిరునల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే సీఎం స్టాలిన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.