Twitter down? Several users complain about login issues: మొన్న ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ సేవలు కొన్ని గంటల పాటు నిలిచిపోయాయి. తాజాగా ట్విట్టర్ డౌన్ అయింది. లాగిన్ లో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇండియా వ్యాప్తంగా శుక్రవారం ఉదయం 3 గంటల నుంచి 7 గంటల వరకు లాగిన్ లో సమస్యలు ఏర్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చాలా మంది వినియోగదారులు ట్విట్టర్ ఖాతాలోకి లాగిన్ కాలేకపోయారు. ‘‘ సంథింగ్ వెంట్ రాంగ్.. డోంట్ వర్రీ.. ట్రై అగైన్’’ అనే మెసేజ్ రావడం కనిపించింది.
ట్విట్టర్ డౌన్ కావడంపై పలు వినియోగదారులు ఆందోళనవ్యక్తం చేశారు. అయితే కేవలం వెబ్ యూజర్లకు మాత్రమే లాగిన్ సమస్యలు ఏర్పడినట్లు తెలుస్తోంది. కంప్యూటర్ ద్వారా ట్విట్టర్ ఖాతా లాగిన్ అయ్యే సందర్భంలోనే ఎర్రర్ మెసేజ్ లు వచ్చాయి. మొబైల్ లో ట్విట్టర్ యాప్ ఉపయోగించే వారికి ఎటువంటి సమస్యలు ఎదురుకాలేదు. గత వారం ఇలాగే వాట్సాప్ సేవలు కొన్ని గంటలు నిలిచిపోవడం చూశాం. అంతకుముందు ఇస్టా గ్రామ్ కూడా ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంది.
Read Also: Road Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి
ఇదిలా ఉంటే ట్విట్టర్ హస్తగతం చేసుకున్న తర్వాత ఎలాన్ మస్క్ ప్రక్షాళన చర్యలు చేపడుతున్నాడు. 44 బిలియన్ డాలర్ల భారీ డీల్ తో ట్విట్టర్ ను సొంత చేసుకున్న ప్రపంచ కుబేరుడు..ట్విట్టర్ లో తన మార్క్ చూపిస్తున్నాడు. వచ్చీ రావడంతోనే నలుగురు కీలక ఉద్యోగులతో పాటు ట్విట్టర్ బోర్డును రద్దు చేసి తానే ఏకైక డైరెక్టర్ గా ఉన్నాడు. మరోవైపు సగం మంది ఉద్యోగులను తొలగించే పనిలో ఉన్నాడు ఎలాన్ మస్క్. శుక్రవారం నుంచి సంస్థలో పనిచేస్తున్న సగం ఉద్యోగులను పనిలో ఉన్నాడు. ఖర్చును తగ్గించుకునేందుకు ఈ చర్య చేపడుతున్నట్లు చెబుతున్నారు. మొత్తం 7500 మంది ఉద్యోగుల్లో సగం మందిని తొలగించనున్నారు. శుక్రవారం ఉదయం నుంచి సంస్థలో ఎవరెవరు ఉంటారనే అనే విషయాన్ని ఈమెయిల్ ద్వారా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బ్లూటిక్ ఉన్నవారు ఇకపై నెలకు 8 డాలర్లు చెల్లించాల్సిందే అని మస్క్ స్పష్టం చేశాడు. ఇకపై మరెన్ని చర్యలు చేపడుతాడో చూడాలి.