Sunil Gavaskar’s key comments on Bangladesh’s defeat: ఆస్ట్రేలియాలో జరుతున్న టీ20 ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ ను ఇండియా ఓడించింది. బంగ్లా ఓటమిపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. బంగ్లా క్రికెటర్లు తమ ఓటమికి సాకులు వెతుకుతూనే ఉన్నారు. విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడంటూ.. ఫెయిర్ గేమ్ లో ఓడిపోయామంటూ బంగ్లా క్రికెటర్లు గగ్గోలు పెడుతున్నారు. తొలుత భారత జట్టు 184-6 రన్స్ చేసింది. అయితే వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలగడంతో 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది బంగ్లాదేశ్. ఆరంభంలో బంగ్లా ఓపెనర్ లిట్టన్ దాస్ 27 బంతుల్లో 60 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ శాంతో సహకారం అందించాడు. అయితే వర్షం పడే సమయానికి ఒక్క వికెట్ కోల్పోకుండా బంగ్లాదేశ్ విజయం వైపుగా దూసుకెళ్లింది. ఎప్పుడైతే వర్షం పడి పరిస్థితులు మారాయో.. మ్యాచ్ భారత్ చేతిలోకి వచ్చింది.
Read Also: Husband Attack on Wife: భార్యపై కత్తితో దాడి.. రాయచోటిలో భర్త దారుణం
అయితే ఈ మ్యాచుపై భారత మాజీ క్రికెటర్లు పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ బంగ్లా టీమ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు భారత్ గెలవడం కంటే బంగ్లాదేశ్ ఓడిపోయిందని ఆయన అన్నారు. వర్షం తరువాత బంగ్లాదేశ్ భయపడిందని అన్నారు. వర్షంతో అంతరాయం ఏర్పడే సమయానికి బంగ్లాదేశ్ 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 66 పరుగుల పటిష్ట స్థితిలో ఉందని.. 10 వికెట్లు చేతిలో ఉన్నాయని.. వర్షం కారణంగా 33 పరుగులను తగ్గించారు..అయితే అదే సమయంలో బంగ్లాదేశ్ భయాందోళనకు గురైనట్లు అనిపించిందని సునీల్ గవాస్కర్ అన్నారు.
స్మార్ట్ క్రికెట్ ఆడటానికి బదులు బంగ్లా క్రికెటర్లు ప్రతీ బంతిని సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించారని అన్నాడు. షార్ట్ స్వేర్ బౌండరీలను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించారని.. అయితే భారత బౌలర్లు తెలివిగా బౌలింగ్ చేశారని గవాస్కర్ అన్నారు. పెద్ద షాట్లు ఆటడానికి ప్రయత్నించి విఫలం అయ్యారని.. లాంగ్ ఆన్, డీప్ మిడ్ వికెట్ పై నుంచి సిక్సర్ల కొట్టడానికి ప్రయత్నించి క్యాచ్ అవుట్ అయ్యారని అన్నారు. మ్యాచ్ ను భారత్ గెలవడం అనే కంటే బంగ్లాదేశ్ ఓడిపోయిందని అని నేను చెబుతానని గవాస్కర్ అన్నారు. బంగ్లా బ్యాటర్లు భయపడ్డారని వారు స్మార్ట్ క్రికెట్ ఆడి ఉంటే గెలిచేవారిని అన్నారు.