Venu Goapl Reddy
Author- NTV Telugu-
Dogs Attack: ఐదేళ్ల బాలుడిపై వీధికుక్కల దాడి..
Dog Attack: వీధికుక్కల దాడులు దేశంలో ఎక్కువ జరుగుతున్నాయి. తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ ఘటనలు నమోదయ్యాయి. వీధికుక్కల దాడుల్లో చిన్నారు, పెద్ద వయసు ఉన్న వారు మరణిస్తున్నారు. వీరే ఈజీగా వాటికి టార్గెట్ అవుతున్నారు. ఇదిలా ఉంటే కేరళ రాష్ట్రంలో నీల్మబూర్ లో మంగళవారం ఐదేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఎల్కేజీ చదువుతున్న పిల్లాడు స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తుందగా మూడు వీధికుక్కలు దాడి చేశాయి. -
Crocodile Attack: కొత్త బైక్ కొన్న ఆనందం ఆవిరైంది.. గంగా జలం కోసం వెళ్తే మొసలికి ఆహరమయ్యాడు..
Crocodile Attack: కంటికి కన్ను, ప్రాణానికి ప్రాణం. బీహార్ రాష్ట్రంలో 14 ఏళ్ల బాలుడిని ఓ మొసలి చంపి తినేసింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఆ మొసలిని నది నుంచి ఈడ్చుకొచ్చి కసితీరా కర్రలు, రాడ్లతో కొట్టి చంపారు. కొత్త బైక్ కొన్నామనే ఆనందం ఆ కుటుంబంలో ఎంతో సేపు నిలవలేదు. కొత్త బండికి పూజలు చేసేందుకు గంగా నదిలో స్నానం చేసి, గంగా జలాన్ని తీసుకురావాలనుకున్న బాలుడిపై మొసలి దాడి చేసి చంపేసింది. -
NEET 2023 Results: నీట్ ఫలితాలు విడుదల.. టాపర్ మనోడే
NEET 2023 Results: మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్(NEET) 2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వరుణ్ చక్రవర్తి, తమిళనాడుకు చెందిన ప్రభంజన్ ఈ ఏడాది జాతీయ స్థాయిలో టాపర్లుగా నిలిచారు. 99.99 పర్సంటైల్ స్కోర్ తో అగ్రస్థానంలో నిలిచారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) మంగళవారం ప్రకటించింది. మొత్తం 20.38 లక్షల మంది అభ్యర్థులు నీట్ పరీక్షను రాయగా.. 11.45 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించారు. -
Kerala High Court: సహజీవనాన్ని వివాహంగా చట్టం గుర్తించదు..
Kerala High Court: సహజీవనంపై కేరళ హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. లివ్ ఇన్ రిలేషన్ ని వివాహంగా చట్టం గుర్తించదని హైకోర్టు పేర్కొంది. వ్యక్తిగత, లౌకిక చట్టాల ప్రకారం జరిగే వివాహాలనే చట్టబద్ధ వివాహాలుగా గుర్తిస్తామని చెప్పింది. ఒప్పందం ప్రకారం సహజీవనం చేసే జంట దాన్ని వివాహంగా చెప్పలేరని, -
Rajnath Singh: ప్రియాంకా గాంధీ “సీజనల్ హిందువు”.. కేంద్రమంత్రి విమర్శలు..
Rajnath Singh: మరికొన్ని నెలల్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ విమర్శలు ప్రారంభం అయ్యాయి. దీంతో పాటు పలువురు కాంగ్రెస్, బీజేపీ అగ్ర నేతలు మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని సందర్శిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ కి వెళ్లిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కాంగ్రెస్ నేత ప్రియాంగా గాంధీపై మంగళవారం విమర్శలు గుప్పించారు. -
Mosquito Bite: దోమలు మిమ్మల్నే ఎక్కువగా కుడుతున్నాయా..? సబ్బు కూడా కారణం కావచ్చు..
Mosquito Bite: సాధారణంగా దోమలు మనుషుల్ని కుడుతాయి. ఇందులో పెద్ద వింతేముందని మీరు అనుకోవచ్చు. అయితే కొందరిని మాత్రం దోమలు ఎక్కువగా కుడుతుండటం మనం అప్పుడప్పుడు గమనిస్తుంటాం. అయితే ఇందుకు ఓ కొత్త కారణాన్ని పరిశోధకులు వెల్లడించారు. మీరు వాడే సబ్బు కూడా దోమలు కట్టడాన్ని ప్రభావితం చేస్తాయని, దోమల్ని ఆకర్షిస్తాయని తాజాగా ఓ పరిశోధనలో తేలింది. -
Kim Jong Un: ప్రజలు ఆత్మహత్య చేసుకుంటే మీదే బాధ్యత.. కిమ్ ఆదేశాలు..
Kim Jong Un: నార్త్ కొరియా గురించి పెద్దగా ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. అడపాదడపా వివరాలు తప్పితే పెద్దగా అక్కడి సమచారం బయటకు రాదు. ఇక అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అరాచకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పటికే నార్త్ కొరియా ప్రజలకు వేరే ప్రపంచం ఉందనే విషయం కూడా తెలియదు. తమకు తెలిసినంత వరకు కిమ్ కుటుంబమే దేవుళ్లు, కిమ్ చెప్పిందే నిజం. అంతలా ఆ దేశం నిర్బంధానికి గురవుతోంది. -
Tata: టాటా కంపెనీ సీఈఓల వార్షిక వేతనం ఎంతో తెలుసా..? షాక్ అవ్వడం ఖాయం..
Tata: దేశీయ పారిశ్రామిక దిగ్గజం టాటా ఇటీవల తన కంపెనీలోని వివిధ సంస్థల సీఈవోల జీతాలను 16-62 శాతం పెంచింది. సాధారణ టీసీఎస్ ఉద్యోగి ఏడాదికి లక్షల్లో వేతనం తీసుకుంటాడు. -
Odisha: టాటా స్టీల్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. 19 మందికి గాయాలు..
Odisha: టాటా స్టీల్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఒడిశాలోని దెంకనల్ జిల్లాలోని టాటా స్టీల్ కు చెందిన మెరమండలి ప్లాంట్ లో మంగళవారం ఆవిరి లీక్ అయింది. ఈ ఘటనలో మొత్తం 19 మంది గాయపడినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. తీవ్రంగా కాలిన గాయాలు అయిన వారిని వెంటనే కటక్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బ్లాస్ ఫర్నెస్ ని పరిశీలిస్తున్న సందర్భంలో ఈ ఘటన జరిగింది. కార్మికులు, పలువురు ఇంజనీర్లు గాయపడ్డారు. -
Maharashtra: “దేశంలో మోడీ.. రాష్ట్రంలో షిండే”.. బీజేపీ-శివసేన మధ్య చిచ్చుపెట్టిన యాడ్..
Maharashtra: మహరాష్ట్రలో పాలక బీజేపీ- శివసేన(ఏక్ నాథ్ షిండే) కూటమిలో లుకలుకలు ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. తాజాగా ఓ పత్రికా ప్రకటన ఈ రెండు పార్టీల మధ్య విబేధాలకు కారణం అవుతోంది. ‘‘దేశంలో మోడీ.. మహారాష్ట్రలో షిండే’’ అనే ట్యాగ్ లైన్ తో ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేకు చెందిన శివసేన పార్టీ పత్రికా ప్రకటన వేయించింది.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!