Mass layoffs: మెటా దారిలో మరో కంపెనీ.. ఉద్యోగులను తొలగించే పనిలో స్ట్రీమింగ్ దిగ్గజం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
After Meta, Disney to freeze hiring, fire employees, a leaked memo reveals: ఐటీ ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ట్విటర్, మైక్రోసాఫ్ట్, నెట్ ఫ్లిక్స్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఈ దారిలో ఫేస్ బుక్, వాట్సాప్ మాతృసంస్థ మెటా కూడా భారీగా ఉద్యోగులను తొలగిస్తోంది. కంపెనీలోని 13 శాతం అంటే దాదాపుగా 11,000 మందిని తొలగిస్తున్నట్లు సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ బుధవారం వెల్లడించారు. ఆర్థిక మాంద్యం పరిస్థితులు, ఆదాయం తగ్గడం నేపథ్యంలో పలు ఐటీ దిగ్గజాలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకున్నాయి.
Read Also: S Jaishankar: ఉక్రెయిన్ మంత్రితో సమావేశం అయిన జైశంకర్.. యుద్ధం ముగించే మార్గాలపై చర్చ
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
తాజాగా ఈ జాబితాలో స్ట్రీమింగ్ దిగ్గజం డిస్నీ కూడా ఉద్యోగాలను తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డిస్నీ కొత్త నియామకాలను నిలిపేసింది. తాజాగా కంపెనీ సీఈఓ బాబ్ చాపెల్ ఓ మోమోలో ఉద్యోగుల తొలగింపు విషయం ప్రస్తావించినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఖర్చులను తగ్గించుకునేందుకు మార్గాలను డిస్నీ అణ్వేషిస్తున్నట్లు.. వ్యాపార పర్యటనలను పరిమితం చేయాలని చాపెల్ కోరాడు. ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో పొదుపు మార్గాలను డిస్నీ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగాల తొలగింపు కూడా చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. డిస్నీలో ప్రపంచవ్యాప్తంగా 1,90,000 మంది ఉద్యోగులు ఉన్నారు. కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని సీఈఓ బాబ్ చాపెల్ మెమోలో పేర్కొన్నాడు.
ఆదాయం పరంగా డిస్నీ పెద్దగా రాణించడం లేదు. దీనికి తోడు కంపెనీ షేర్లు పడిపోయాయాయి. 52 వారాల కనిష్ట స్థాయికి చేరాయి. అంతకుముందు వార్నర్ బ్రదర్స్, నెట్ ఫ్లిక్స్ లు తమ సిబ్బందిని తగ్గించుకున్నాయి. ఇదే దారిలో డిస్నీ కూడా సిబ్బందిని తగ్గించుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. మెటాతో పాటు ట్విట్టర్ ఈ మధ్య వార్తల్లో నిలిచాయి. ట్విట్టర్ టేకోవర్ తరువాత 50 శాతం సిబ్బందిని తొలగిస్తూ ఎలాన్ మస్క్ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు, మాంద్యం భయాలు టెక్ కంపెనీలు భయపెడుతున్నాయి. దీంతో తమ నష్టాలను తగ్గించుకునేందుకు ఉద్యోగాల్లో కోత పెడుతున్నాయి. భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..