Police officer, 4 others arrested over alleged molestation in Kochi: కేరళలో సంచలనం సృష్టించి సామూహిక అత్యాచార ఘటనలో పోలీస్ అధికారితో సహా నలుగురిని కేరళ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. కొచ్చిలో ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేపూర్(కోజికోడ్) కోస్టల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ పిఆర్ సునుతో పాటు మరో నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీస్ అధికారితో పాటు నలుగురు కూడా తనపై అత్యాచారం చేసినట్లు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Read Also: A Man Sudden death In Marriage : పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ వధువు మేనమామ మృతి.. షాక్లో కుటుంబం
శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది మహిళ. గృహిణి అయిన తనపై మే నెలలో ఇంట్లో మొదటిసారిగా అత్యాచారం చేశారని.. రెండు నెలల తర్వాత కొచ్చిలో మరోసారి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే పోలీసులకు భయపడి ఫిర్యాదు చేయలేదని తెలిపింది. బాధితురాలి భర్త కొచ్చిలో ఉపాధి పేరుతో మోసం చేసి జైలులో ఉన్నాడు. అయితే ఈ కేసులో పోలీసులు ఆమెను సంప్రదించారు. దీంతో నిందితులు ఆమెను బెదిరించి లైంగికంగా వేధించారని పోలీసులు తెలిపారు.
కొచ్చి పోలీస్ కమిషనర్ నాగరాజు ఆదేశాాల మేరకు ఎస్‌హెచ్‌ఓను అతని పోలీస్ స్టేషన్‌లో అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన వారిపై అత్యాచారం, మోసం, అక్రమ నిర్భంధం కింద కేసులు నమోదు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. సదరు పోలీస్ అధికారి రెండేళ్ల క్రితం అత్యాచార కేసులో వారం రోజుల పాటు పోలీసుల కస్టడీలో ఉన్నాడని తెలిసింది. సదరు అధికారిని సర్వీసు నుంచి తొలగించేందుకు పోలీసులు ప్రభుత్వానికి సిఫారసు చేస్తారని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు.