Rajiv Gandhi assassination: “మా నాన్నను ఎందుకు చంపారు”.. ప్రియాంకాగాంధీ ఏడ్చారన్న నళిని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajiv Gandhi assassination case: సుప్రీంకోర్టు ఆదేశాలతో రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులు తమిళనాడు జైలు నుంచి శనివారం విడుదలయ్యారు. నళినితో పాటు మరో ఐదుగురు వెల్లూరు, మధురై జైళ్ల నుంచి విడుదల అయ్యారు. ఆదివారం నిందితుల్లో ఒకరైన నళిని శ్రీహరన్ మీడియాతో మాట్లాడారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు తనకు సహాయపడిన వారందరికి థాంక్స్ చెప్పారు. ఇదిలా ఉంటే గతంలో ప్రియాంకా గాంధీ వాద్రా కలిసిన సమయంలో జరిగిన సంఘటనలను వివరించారు.
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ తనను జైలులో కలిశారని.. నా తండ్రిని ఎందుకు చంపారని ప్రశ్నించారని నళిని తెలిపారు. జైలులో కలిసిన సమయంలో నన్ను కలిసిన సమయంలో భావోద్వేగంతో ఏడ్చేశారని వెల్లడించారు. రాజీవ్ గాంధీ హత్య గురించి తనను ప్రియాంకాగాంధీ ప్రశ్నించినట్లుగా తెలిపారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో మొత్తం ఏడుగురు నిందితులు ఉంటే.. ఈ ఏడాది మేలో ఏజీ పెరివాలన్ ను సుప్రీంకోర్టు తన విస్తృత అధికారాలను ఉపయోగించి విడుదల చేసింది. తాజాగా ఇదే సూత్రాన్ని మిగతా ఆరుగురు నిందితులకు వర్తింప చేస్తూ 30 ఏళ్ల తరువాత ఈ కేసు నుంచి ఆరుగురికి విముక్తిని ప్రసాదించింది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
Read Also: Gold Smuggling: ముంబై విమానాశ్రయంలో భారీగా పట్టుబడ్డ బంగారం.. బెల్టులో అమర్చి తరలించే యత్నం
నిందితుల్లో నళిని భర్త శ్రీహరన్ కూడా ఉన్నారు. ఆయన శ్రీలంక జాతీయుడు కావడంతో తిరుచ్చిలోని ప్రత్యేక శిబిరంలో ఉంచారు. త్వరలోనే తన భర్తను కలుస్తున్నట్లు నళిని వెల్లడించారు. తమిళనాడులోని పలు ప్రదేశాలకు వెళ్లాలని తాను అనుకుంటున్నట్లు నళిని వెల్లడించారు. ఈ కేసులో తనకు సహకరించిన అందర్ని కలవాలనుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తో పాటు గాంధీ కుటుంబీకులను కలవాలనుకుంటున్నట్లు తెలిపారు.
జైలులో ఉన్న సమయంలో మమ్మల్ని మరణశిక్ష ఖైదీలుగా చూసేవరాని.. తాను అరెస్ట్ అయ్యే సమయానికి గర్భవతిని అయినప్పటికీ..జైలులో బంధించారని నళిని అన్నారు. నా జీవితం ఇప్పటికే నాశనం అయిందని..కుటుంబమే తనకు మొదటి ప్రాధాన్యత అని ఆమె తెలిపారు. నేను నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోబోతున్నట్లు తెలిపారు. ఈ కేసులో నళినితో పాటు రవిచంద్రన్, రాబర్ట్ పాయస్, జయకుమార్, ఎస్ రాజా, శ్రీహరన్ దోషులుగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 21, 1991న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ పర్యటనకు రాజీవ్ గాంధీ వచ్చిన సమయంలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టిటిఇ) గ్రూప్‌కి చెందిన మహిళా ఆత్మాహుతి బాంబర్ ఆయన్ను హత్య చేసింది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..