“Its Called Karma” Mohammed Shami’s Response To Shoaib Akhtar’s Tweet: టీ20 ప్రపంచకప్ ఫైనల్స్ లో ఇంగ్లాండ్ చేతిలో పాకిస్తాన్ దారుణంగా ఓడిపోయింది. పాకిస్తాన్ నిర్దేశించిన 138 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ మరో ఓవర్ మిగిలి ఉండగానే 19 ఓవర్లలోనే ఛేదించింది. బెన్ స్టోక్స్ అద్భుత హాఫ్ సెంచరీతో పాటు సామ్ కర్రన్ సూపర్ బౌలింగ్ తో ఇంగ్లాండ్ మరోసారి టీ20 ఛాంపియన్ గా నిలిచింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ టీమ్, క్రికెటర్లు, మాజీ క్రికెటర్లపై తెగ ట్రోలింగ్ మొదలైంది. ముఖ్యంగా భారత అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇంగ్లాండ్ తో సెమీఫైనల్స్ లో భారత్ ఓడిపోయిన సందర్భంలో చాలా మంది పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఇండియన్ టీమ్ పై తెగ కామెంట్లు చేశారు. దీనికి ప్రతిగా ఇండియన్ ఫ్యాన్స్ పాకిస్తాన్ ఓటమితో రెచ్చిపోతున్నారు.
Read Also: T20 World Cup Final: పాకిస్తాన్ అభిమానిపై తెగ మీమ్స్.. చూస్తే నవ్వాపుకోలేరు..
ఇదిలా ఉంటే పాకిస్తాన్ మాజీ స్టార్ బౌలర్ షోయబ్ అక్తర్ పై ఇండియా క్రికెటర్ మహ్మద్ షమీ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. పాకిస్తాన్ ఓటమి త్వరత అక్తర్ గుండె పగిలినట్లు ఎమోజీనీ ట్వీట్ చేశాడు. దీనికి ప్రతిగా మహ్మద్ షమీ స్పందిస్తూ.. ‘‘సారీ బ్రదర్.. దీన్నే కర్మ అంటారు’’ అంటూ ట్వీట్ చేశారు. పాకిస్తాన్ టీమ్ గొప్పగా పోరాడిందని.. పాక్ బౌలర్లు బాగా బౌలింగ్ చేశారని అన్నారు షోయబ్ అక్తర్. పాక్ జట్టుకు మద్దతుగా నిలుస్తానని అన్నారు. తమ ఓటమికి స్టార్ బౌలర్ షాషీన్ ఆఫ్రిది గాయపడటమే కారణం అని కెప్టెన్ బాబర్ అజమ్ అన్నారు. మేము మరో 20 రన్స్ తక్కువగా స్కోర్ చేశామని బాబర్ అన్నాడు. తొలి రెండు మ్యాచుల్లో ఓడిపోయినప్పటికీ ఫైనల్ చేరుకున్నామని మ్యాచ్ అనంతరం చెప్పాడు.
Sorry brother
It’s call karma 💔💔💔 https://t.co/DpaIliRYkd
— 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@MdShami11) November 13, 2022