Afghanistan: మహిళలకు తాలిబాన్ సర్కార్ కొత్త రూల్.. ఇకపై అక్కడికి వెళ్లకుండా నిషేధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taliban ban Afghan women from gyms, public baths: ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై నిషేధం ఎక్కువైంది. మహిళలు కేవలం ఇళ్లకు మాత్రమే పరిమితం అయ్యారు. బయటకు వెళ్లాలన్నా మగతోడు కావాల్సిందే. ఇక మహిళ హక్కులనే మాటకు అక్కడ స్థానమే లేదు. ప్రజా ప్రభుత్వం ఉన్నంత వరకు ప్రభుత్వంలో ఇతర రంగాల్లో ఉద్యోగాలు చేసిన మహిళలు ప్రస్తుతం ఉద్యోగాలను కోల్పోయారు. గతేడాది ఆగస్టులో అధికారంలోకి వచ్చిన తాలిబాన్లు అక్కడ మహిళపై తీవ్రమైన ఆంక్షలను విధిస్తున్నారు. మహిళలు విద్యకు దూరం అయ్యారు.
Read Also: Kochi molestation case: కొచ్చి మహిళపై సామూహిక అత్యాచారం.. సీఐతో సహా నలుగురి అరెస్ట్
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
ఇదిలా ఉంటే తాజాగా జిమ్‌లు, పబ్లిక్ బాత్‌లకు వెళ్లకుండా అక్కడి మహిళలపై నిషేధం విధించారు. దీన్ని ఆదివారం తాలిబాన్ ప్రభుత్వం కూడా ధృవీకరించారు. పార్కులకు వెళ్లకుండా మహిళలపై నిషేధం విధించిన కొన్ని రోజుల్లోనే కొత్తగా ఈ నిబంధనలను తీసుకువచ్చింది తాలిబాన్ సర్కార్. 2001 తర్వాత అధికారం కోల్పోయిన తాలిబాన్లు, 2021లో అమెరికా సైన్యం వైదొలగడంతో మళ్లీ అధికారంలోకి వచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కఠినమైన ఇస్లామిక్ చట్టాలను అమలు చేయమని హామీ ఇచ్చినప్పటికీ అందుకు కట్టుబడి ఉండటం లేదు. ఇప్పటికే టీనేజ్ అమ్మాయిలకు విద్యను నిలిపివేసింది. బహిరంగ ప్రదేశాల్లో తప్పకుండా హిజాబ్, బురఖా ధరించాల్సిందే.
మహిళల జిమ్‌లు మూసివేయబడ్డాయి.. ఎందుకంటే వారి శిక్షకులు పురుషులు. వారితో కలిసి జిమ్ చేస్తున్నారని తాలిబాన్ మత వ్యవహారాలను పర్యవేక్షించే మంత్రిత్వశాఖ ప్రతినిధి అకిఫ్ సాడెక్ మొహజిర్ అన్నారు. అయితే తాలిబాన్ల నిర్ణయంపై అక్కడి మహిళలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహిళపై విధిస్తున్న ఆంక్షలపై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు తాలిబాన్ పరిపాలనలో అక్కడి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఉద్యోగాలు, ఉపాధి లేదు. దీంతో చాలా మంది ఆఫ్ఘన్లు తమ కిడ్నీలను, పిల్లలను అమ్ముకుంటున్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు