Man Tricks Daughter To Write Suicide Note, Then Kills Her: కంటికి రెప్పటా కాపాడాల్సిన కన్న తండ్రే కూతురిని మోసం చేసి హత్య చేశాడు. తన బంధువులను ఇరికించేందుకు కూతురి మరణాన్ని వాడుకోవాలని చూశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే 40 ఏళ్ల వ్యక్తి తన 16 ఏళ్ల కూతురు చేత సూసైడ్ నోట్ రాయించి, ఆత్మహత్య చేసుకునేలా నాటకం ఆడాలని సూచించాడు. అయితే తండ్రి మాటలను నమ్మిన ఆ బాలిక తండ్రి చెప్పినట్టే చేసింది. అయితే తండ్రి మాత్రం నిజంగానే అమ్మాయిని చంపేశారు. ఈ ఘటన నవంబర్ 6న నాగ్‌పూర్ నగరంలోని కలమ్నా ప్రాంతంలో జరిగింది.
Read Also: Tragedy In Love Marriage: ప్రేమ వివాహంలో విషాదం.. ఉదయం పెళ్లి, సాయంత్రం మృతి
ముందుగా గదిలో దొరికిన సూసైడ్ నోట్ ఆధారంగా బాలిక సవతి తల్లి, మామ, అత్త, తాతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే విచారణ సమయంలో మృతురాలి తండ్రి ఫోన్ పరిశీలించగా.. బాలిక ఆత్మహత్య చేసుకుంటుండగా తీసిన ఫోటోలు ఉన్నాయి. దీంతో బాలిక మరణం వెనక కుట్ర దాగి ఉందని పోలీసులు అనుమానించారు. మొబైల్ ఫోన్ పరిశీలించగా బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఫోటోలు ఉన్నాయి. తన బంధువులను ఇరికించేందుకు కుమార్తెను ఉరివేసుకున్నట్లు నటించమని కోరాడు తండ్రి. స్టూల్ పై ఉండి ఉరి వేసుకున్నట్లు ఫోటోలకు ఫోజు ఇస్తున్న క్రమంలో తండ్రి స్టూల్ తన్నేశాడు. ఆ సమయంలో తండ్రితో పాటు 12 ఏళ్ల మరో కుమార్తె ఉన్నారు. వీరిద్దరి ముందే బాలిక చనిపోయింది.
ఈ ఘటన జరిగిన తర్వాత తండ్రి బయటకు వెళ్లిపోయాడు. ఆ తరువాత ఇంటికి తిరిగి వచ్చి తన కూతురు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని అందర్ని నమ్మించారు. ముందుగా పోలీసులు కూడా బాలిక రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా కేసు దర్యాప్తు చేశారు. ఆ తరువాత కుట్ర కోణం బయటకు వచ్చింది. పోలీసులు నిందితుడి ఫోన్ చూసిన తర్వాత ప్రశ్నించగా.. అసలు నిజాన్ని వెల్లడించాడు. మొదటి భార్య 2016లో చనిపోయింది. ఆ తరువాత రెండో పెళ్లి చేసుకున్న తర్వాత రెండో భార్య కూడా ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలోనే రెండో భార్య తరుపు బంధువులను ఇరికించేందుకు సొంత కూతురినే చంపేశాడు.