Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Light Flip 5G Phone Launched: డిజిటల్ ప్రపంచానికి కాస్త దూరంగా ఉండాలనుకునే వినియోగదారుల కోసం లైట్ (Light) కంపనీ నుండి కొత్త Light Flip 5G ఫోన్‌ను లాంచ్ చేసింది. ఆధునిక స్మార్ట్ఫోన్లకు ప్రత్యామ్నాయంగా రూపొందించిన ఈ మినిమలిస్ట్ ఫోన్లో సోషల్ మీడియా యాప్‌లు, వెబ్ బ్రౌజర్, ప్రకటనలతో నిండిన యాప్‌లు వంటి దృష్టి మరల్చే ఫీచర్లకు చోటు ఇవ్వలేదు. క్లాసిక్ క్లామ్‌షెల్ (Flip) డిజైన్‌తో పాటు కొత్త హార్డ్‌వేర్‌ను చేర్చి, అవసరమైన పనులకే పరిమితమైన డిజిటల్ అనుభవాన్ని అందించేలా ఈ ఫోన్‌ను రూపొందించింది.
ఇందులో కంపెనీ అభివృద్ధి చేసిన LightOS ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లో సోషల్ మీడియా, వెబ్ బ్రౌజర్ లేదా నిరంతరం నోటిఫికేషన్లతో ఇబ్బంది పెట్టే యాప్‌లు ఉండవు. బదులుగా రోజువారీ అవసరాలకు ఉపయోగపడే ఫీచర్లపై మాత్రమే దృష్టి పెట్టారు. Predictive T9 టైపింగ్, Voice-to-Text, ఆడియో మెసేజింగ్, 9 స్పీడ్ డయల్ షార్ట్కట్లు వంటి కమ్యూనికేషన్ టూల్స్ ఇందులో ఉన్నాయి.
Also Read
- OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
- 11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
- Microsoft Buyout Plan: మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. 60 వేల మంది ఉద్యోగులపై ప్రభావం?
- Ethanol Cars: ఇండియాలో ఇక పెట్రోల్ కార్లకు స్వస్తి.. E100 ఇథనాల్ ఫ్యూయల్ వాహనాలకు గ్రీన్‌సిగ్నల్..
వినియోగదారుల దైనందిన అవసరాలను దృష్టిలో ఉంచుకుని Light Flipలో అలారం, క్యాలెండర్, కాలిక్యులేటర్, డైరెక్టరీ, నావిగేషన్, మొబైల్ హాట్‌స్పాట్, మ్యూజిక్ ప్లేయర్, నోట్స్, వాయిస్ మెమో, పోడ్కాస్ట్, వాతావరణ సమాచారం, 2FA ఆథెంటికేటర్, టైమర్ వంటి పలు ఉపయోగకరమైన టూల్స్‌ను అందించారు. అలాగే డెవలపర్ ప్రోగ్రామ్ ద్వారా కమ్యూనిటీ రూపొందించే ఓపెన్ సోర్స్ టూల్స్‌కు కూడా సపోర్ట్ ఉంటుంది.
Light Flipలో 2.8 అంగుళాల OLED డిస్ప్లే (480×640 పిక్సెల్స్)ను మ్యాట్ ఫినిష్‌తో అందించారు. MediaTek MT8873 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 6GB LPDDR4X RAM, 128GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఫొటోగ్రఫీ కోసం 50MP రియర్ కెమెరాను అందించారు. ఇది 12MP ఫొటోలను క్యాప్చర్ చేయగలదు. కెమెరాతో పాటు ఇంటిగ్రేటెడ్ ఫ్లాష్‌లైట్ కూడా ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, Dual 4G VoLTE, Wi-Fi 6, Bluetooth 5.0, GPS, GLONASS, USB Type-C పోర్ట్‌ను అందించారు. అలాగే 3.5mm హెడ్‌ఫోన్ జాక్, స్టీరియో స్పీకర్లు, IP54 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెన్స్, 1800mAh రీప్లేస్ చేయగల బ్యాటరీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
Light Flipను నలుపు, నేవీ, ఎరుపు, గులాబీ, పసుపు, లేత బూడిద రంగుల్లో మార్కెట్లోకి తీసుకురానున్నారు. అంతేకాకుండా ఫోన్‌కు చార్మ్స్ లేదా యాక్సెసరీలు అమర్చుకునేందుకు ప్రత్యేక లూప్‌ను కూడా ఏర్పాటు చేశారు. దీని ధర 299 అమెరికన్ డాలర్లు (రూ.28,870). అలాగే కంపెనీ సర్వీస్ ప్లాన్‌తో నెలకు 39 డాలర్ల EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫోన్‌కు ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. డెలివరీలు నాలుగు విడతల్లో జరగనున్నాయి. తొలి విడత 2027 ఏప్రిల్ ప్రారంభంలో, రెండో విడత ఏప్రిల్ చివర్లో, మూడో విడత మే ప్రారంభంలో, నాలుగో విడత మే చివర్లో వినియోగదారులకు అందించనున్నారు.
There’s a nostalgia for a time before smartphones, when phones were just that.
Introducing the Light Flip… now available for pre-order:https://t.co/hVr5D1yHao pic.twitter.com/sfBJQManiu
— light (@thelightphone) July 21, 2026
తాజావార్తలు
-
Daren Sammy: మేము భారత్‌తో ఎంత గొప్పగా ఆడామో ఇప్పటికైనా తెలిసిందా.. విండీస్ కోచ్ డారెన్ సామీ సంచలన వ్యాఖ్యలు..
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. కరువుపై తెలంగాణ సర్కార్ కీలక భేటీ
-
Killer : సెకండాఫ్ ట్విస్ట్ చెప్తే కోటి రూపాయల బహుమతి.. హైకోర్టు లాయర్ల సమక్షంలో ఛాలెంజ్
-
InnoData Layoffs: ఇన్నోడేటాలో భారీ ఉద్యోగ కోతలు.. భారత్‌లో 550 మందికి ఉద్వాసన?
-
Ind Vs NZ: కివీస్ గడ్డపై టీమిండియా దండయాత్ర.. భారత్ అద్భుత విజయం.. 3-0తో సిరీస్ కైవసం..
ట్రెండింగ్
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!