Cognizant: లేఆఫ్స్ జాబితాలోకి మరో టెక్ దిగ్గజం.. 3,500 మంది తొలగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cognizant: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, ఆర్థిక మాంద్యం భయాలు టెక్ కంపెనీలను భయపెడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, గూగుల్, యాక్సెంచర్ వంటి సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ జాబితాలో మరో టెక్ సంస్థ కాగ్నిజెంట్ కూడా చేరింది. 2023లో తమ ఆదాయాలు తగ్గుముఖం పట్టడంతో కాగ్నిజెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. కాగ్నిజెంట్కు ప్రధాన ఆదాయం యూఎస్ నుంచి వస్తోంది.
Read Also: Press Freedom Index: మీడియా స్వేచ్ఛలో మరింత దిగువకు ఇండియా.. ఎన్నో స్థానం అంటే..
Also Read
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
తగ్గిన ఆదాయాలతో ఖర్చులను తగ్గించుకునేందుకు కాగ్నిజెంట్ 3500 మంది ఉద్యోగులను తొలగించడానికి నిర్ణయించుకుంది. యాక్సెంచర్, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థలతో పోటీ పడటంలో కాగ్నిజెంట్ చాలా కష్టపడుతోంది. ఖర్చులను తగ్గించుకోవడం కోసం కాగ్నిజెంట్ భారతదేశంలోని పెద్ద నగరాల్లో 11 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను కూడా వదులుకుంది. కొత్తగా సీఈఓగా నియమితులైన రవికుమార్ వచ్చీరావడంతోనే ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని తీసుకున్నారు.
పెరుగుతున్న వడ్దీ రేట్లు, ఆర్థిక మాంద్యం భయాల వల్ల అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో ఉద్యోగులను తొలగించుకుంటున్నాయి టెక్ కంపెనీలు. ఇప్పటికే ఫేస్ బుక్ పేరెంట్ కంపెనీ మెటా రెండు పర్యాయాలుగా వేలల్లో ఉద్యోగులను తీసేసింది. ఈ ఏడాది గత నెలలో 10,000 మందిని, గతేడాది నవంబర్ లో 11,000 మందిని తొలగించింది. అమెజాన్ 18,000 మందిని, గూగుల్ 12,000, మైక్రోసాఫ్ట్ 10,000 మందిని, ట్విట్టర్ 50 శాతం మందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. రానున్న కాలంలో యూఎస్, యూరోపియన్ దేశాలు ఆర్థిక మాంద్యం బారిన పడుతాయనే వార్తల నేపథ్యంలో ఐటీ కంపెనీల పరిస్థితి కష్టతరంగా మారుతోంది. రానున్న కాలంలో మరిన్ని లేఆఫ్స్ ఉండే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!