Wrestlers protest: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్నారు. మహిళా క్రీడాకారిణులపై బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ లైంగిక వేధిపులకు పాల్పడినట్లు రెబర్లు ఆరోపిస్తున్నారు. అతడిని ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే బుధవారం రాత్రి రెజ్లర్ల పట్ల ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై మహిళ రెజ్లర్లు కన్నీటి పర్యంతం అయ్యారు. ‘‘మేము పథకాలు సాధించింది ఈ రోజు చూడడానికేనా..’’ అంటూ స్టార రెజ్లర్ వినేష్ ఫోగట్ ఆవేదన వ్యక్తం చేశారు. తాము నేరస్తుల కాదని, మీరు మమ్మల్ని చంపాలనుకుంటే చంపండి అని వినేష్ ఫోగట్ మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు. ప్రత మగాడికి ఆడవాళ్లను తిట్టే హక్కుందా..? ఈ పోలీసులు తుపాకులు పట్టుకుని మమ్మల్ని చంపగలరని వినేష్ భావోద్వేగానికి లోనయ్యారు. మహిళా పోలీస్ అధికారులు ఎక్కడ ఉన్నారు.? అని ప్రశ్నించారు. మద్యం మత్తులో ఉన్న పోలీసులు తన సోదరుడిని కొట్టారని ఆమె ఆరోపించారు.
Read Also: Alwal News: అల్వాల్‌లో సాప్ట్‌వేర్ ఉద్యోగిని హల్ చల్.. కొత్తకారుతో భీభత్సం
ఇదిలా ఉంటే ఫోగట్ వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ‘‘దేశంలోని ఛాంపియన్ ప్లేయర్లతో ఇలా దుర్మార్గంగా ప్రవర్తించడం విచారకరం, సిగ్గుచేటు. బీజేపీ వ్యక్తులు మొత్తం వ్యవస్థను గుండాయిజంతో నడపాలని కోరుకుంటున్నారు.. మొత్తం వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారు’’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. దేశంలో ప్రజలు బీజేపీ గుండాయిజాన్ని సహించవద్దని, బీజేపీ తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
ఇదిలా ఉంటే రెజ్లర్లకు మద్దతుగా గురువారం ఉదయం జంతర్ మంతర్ వద్దకు మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ వెళ్లారు. తనను నిరసన ప్రదేశానికి అనుమతించడం లేదని ఆమె ఆరోపించారు. రెజ్లర్లు వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్ తమను చిత్రహింసలకు గురిచేస్తున్నారని చెబుతున్నారని, ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషన్ కు ఎందుకు రక్షణ కల్పిస్తున్నారని, ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని..? స్వాతి మలివాల్ ప్రశ్నించారు.