10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Garmin CIRQA Smart Band: గార్మిన్ (Garmin) సంస్థ నుండి మొదటి స్క్రీన్-ఫ్రీ స్మార్ట్ బ్యాండ్ గార్మిన్ సర్కా (Garmin CIRQA)ను లాంచ్ చేసింది. డిస్ప్లే లేకుండానే రోజంతా ఆరోగ్యం, ఫిట్నెస్ను నిరంతరం ట్రాక్ చేసేలా ఈ కొత్త వేరబుల్‌ను రూపొందించింది. ఒకసారి ఛార్జ్ చేస్తే 10 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఇందులో రికార్డ్ అయ్యే హెల్త్, యాక్టివిటీ డేటాను గార్మిన్ కనెక్ట్ యాప్‌లో చూడవచ్చు. ముఖ్యంగా ఈ బ్యాండ్‌లోని ప్రధాన హెల్త్, ఫిట్నెస్ ఫీచర్లను ఉపయోగించేందుకు ఎలాంటి సబ్స్క్రిప్షన్ అవసరం లేదని గార్మిన్ తెలిపింది.
ప్రత్యేక డిజైన్:
Garmin CIRQA పూర్తిగా స్క్రీన్-ఫ్రీ డిజైన్‌తో వస్తుంది. దీనికి సౌకర్యవంతమైన ComfortFit ఫ్యాబ్రిక్ బ్యాండ్ ను అందించారు. వినియోగదారులు దీనిని మణికట్టు లేదా పై చేయిపై ధరించవచ్చు. సిట్రాన్ గ్రే, మావ్, ఫ్రెంచ్ గ్రే, డార్క్ ఆలివ్, కెప్టెన్ బ్లూ, ఫ్రెంచ్ బ్లూ, బ్లాక్ ఇలా మొత్తం 7 రంగుల్లో అందుబాటులోకి వచ్చింది.
Also Read
- PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
- AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
- 9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
80+ యాక్టివిటీలకు సపోర్ట్:
ఈ స్మార్ట్ బ్యాండ్ వినియోగదారుడు చేస్తున్న యాక్టివిటీలను ఆటోమేటిక్‌గా గుర్తించి రికార్డ్ చేస్తుంది. తరువాత వాటిని Garmin Connect యాప్‌లో సవరించే అవకాశం ఉంటుంది. ఈ మార్పుల ఆధారంగా భవిష్యత్తులో యాక్టివిటీ గుర్తింపును మరింత మెరుగుపరుస్తుంది. ఇందులో రన్నింగ్, వాకింగ్, యోగా సహా 80కు పైగా స్పోర్ట్స్, ఫిట్నెస్ యాక్టివిటీలను మాన్యువల్‌గా ట్రాక్ చేయవచ్చు. ఇష్టమైన యాక్టివిటీని ఒకే బటన్ నొక్కి ప్రారంభించే సదుపాయం కూడా ఉంది.
మహిళల కోసం మెన్స్ట్రువల్ సైకిల్, ప్రెగ్నెన్సీ ట్రాకింగ్, చర్మ ఉష్ణోగ్రత ఆధారంగా మెరుగైన పీరియడ్ అంచనాలు, ఓవ్యులేషన్ అంచనాలు వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. అలాగే Natural Cycles యాప్‌తో కూడా సింక్ అవుతుంది. అయితే దీనికి విడిగా సబ్స్క్రిప్షన్ అవసరం. రోజువారీ అడుగులు, క్యాలరీలు మాత్రమే కాకుండా ఫిట్నెస్ను మరింత లోతుగా విశ్లేషించే ఫీచర్లను కూడా ఈ బ్యాండ్ అందిస్తుంది. వీటితోపాటు Connected GPS సపోర్ట్‌తో ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ కు కనెక్ట్ చేసి అవుట్డోర్ వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ వంటి యాక్టివిటీలను ట్రాక్ చేయవచ్చు. LiveTrack ద్వారా లైవ్ లొకేషన్‌ను కుటుంబ సభ్యులతో పంచుకునే అవకాశం కూడా ఉంది.
ధర:
Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ ధర 199.99 డాలర్లు (రూ.19,250). ఈ స్మార్ట్ బ్యాండ్‌కు జూలై 24 నుంచి ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో అధికారిక విడుదల తేదీని కంపెనీ ప్రకటించలేదు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!