Balakrishna : బాలయ్యకి సర్జరీ.. NBK 111 పరిస్థితి ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాక్షన్ సీన్ షూటింగ్ లో బాలకృష్ణ గాయపడ్డాడు. మోకాలికి చిన్న గాయమైందని, గాయం నుంచి త్వరగా కోలుకోవడానికి త్వరలో మైనర్ సర్జరీ చేస్తారని చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని తెలిపారు. రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ సూచించడంతో NBK111 రిలీజ్ మరింత లేట్ కానుంది. మేకర్స్ అనుకున్న టైం కు సినిమా థియేటర్ లోకి వస్తుందా, రాదా? బాలకృష్ణ నటిస్తున్న గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ కాకినాడ పోర్ట్ లో జరుగుతోంది. కాకినాడ ఎయిర్పోర్ట్ లో దిగిన బాలయ్యకు ఘన స్వాగతం పలికారు. యాక్షన్ సీన్స్ ఇంకో రెండు రోజుల్లో ముగియనుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రాథమిక చికిత్స అనంతరం స్కానింగ్ తీయగా, మజిల్ టియర్ అయిందని, త్వరగా కోలుకోవడానికి చిన్నపాటి సర్జరీ అవసరమవుతుందని డాక్టర్లు సూచించారు.
అభిమానులు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని, త్వరలో కోలుకొని మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటారని ఎక్స్ వేదికగా డైరెక్టర్ ట్వీట్ చేశాడు. బాబాయి త్వరగా కోలుకోవాలని అబ్బాయిలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎక్స్ వేదికగా వేర్వేరు పోస్టులు పెట్టారు. త్వరగా కోలుకొని తిరిగి గర్జించాలని ఎన్టీఆర్ పోస్ట్ చేశాడు. తక్కువ టైంలోనే మళ్ళీ యాక్షన్ మోడ్ లోకి రావాలని కళ్యాణ్ రామ్ ఎక్స్ లో రాసుకొచ్చాడు. NBK111 ను దసరాకే రిలీజ్ చేయాలనుకున్నా, షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో సినిమాను డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే ప్రభాస్ ఫౌజీ డిసెంబర్ 3న రావడంతో, క్రిస్మస్ హాలిడేస్ ను క్యాష్ చేసుకుంటూ డిసెంబర్ 24న రిలీజ్ చేద్దామన్న ప్లాన్ లో నిర్మాతలు ఉన్నారు. అనుకోకుండా బాలకృష్ణకు ప్రమాదం జరగడంతో, సినిమా క్రిస్మస్ కి వచ్చే ఛాన్స్ లేదంటూ ప్రచారం జరుగుతోంది. బాలయ్య వెంటనే కోలుకొని సెట్స్ పైకి వస్తే, సినిమా డిసెంబర్ 24న రావడం పెద్ద కష్టమేమీ కాదు.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!